For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

మారుతీ సుజుకీ సేల్స్ అంచనాలో 20% తగ్గుదల, అదే అతిపెద్ద ఆందోళన

|

ముంబై: అనుబంధ సంస్థ మారుతీ సుజుకీ 2020 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన సేల్స్ అంచనాను సుజుకీ మోటార్స్ కార్పోరేషన్ (SMC) సవరించింది. తొలి క్వార్టర్లో సేల్స్ భారీగా తగ్గిపోయిన నేపథ్యంలో ఈ ప్రభావం ఈ ఆర్థిక సంవత్సరంపై పడుతుందని, ఈ నేపథ్యంలో 20 శాతం పడిపోతాయని అంచనా వేసింది. అంతకుముందు ఈ ఈ ఆర్థిక సంవత్సరంలో వృద్ధి 4 శాతంగా ఉంటుందని భావించింది. ఇప్పుడు దానిని సవరించింది.

రూ.1,500 కోట్ల శశికళ ఆస్తులు ఆటాచ్: ఎవరి పేరు మీద ఉన్నాయంటే?

సెప్టెంబర్ నెలతో ముగిసిన తొలి అర్ధ సంవత్సరంలో అంచనాల కంటే సేల్స్ 25 శాతం పడిపోయాయి. దీంతో ప్రపంచవ్యాప్తంగా ఈ కంపెనీ సేల్స్ 17 శాతం తగ్గాయి. ప్రస్తుతం ఆటో పరిశ్రమ కాస్త కోలుకుంది. అయినప్పటికీ మొత్తం ఆర్థిక సంవత్సరం పరంగా సేల్స్ పడిపోతాయని అంచనా వేస్తోంది.

మారుతీ సుజుకీ సేల్స్ అంచనాలో 20% తగ్గుదల,అదే అతిపెద్ద ఆందోళన

మొదటి త్రైమాసికం ఫలితాల నేపథ్యంలో SMC ప్రస్తుత ఆర్థిక సంవత్సర ఆదాయం, నిర్వహణ ఆదాయం, నికర ఆదాయ అంచనాను వరుసగా 10.3 శాతం, 39.4 శాతం, 30 శాతం సవరించింది. మోటార్ సైకిల్స్ సేల్స్ గతంలో అంచనా వేసిన దాని కంటే 3 శాతం తగ్గి, 1.77 మిలియన్లుగా ఉంటాయని భావిస్తోంది.

మారుతీ సుజుకీ సేల్స్ అక్టోబర్ నెలలో పుంజుకున్నాయి. ఓ వైపు మార్కెట్లో కొన్ని సేల్స్ పెరగనప్పటికీ ఈ సంస్థ సేల్స్ మాత్రం పెరిగాయి. 2020 ఆర్థిక సంవత్సరంలో గడిచిన ఆరునెలల్లో 25 శాతం సేల్స్ తగ్గాయని మారుతీ సుజుకీ చైర్మన్ ఆర్సీ భార్గవ అన్నారు.

అక్టోబర్ నెలలో దసరా, దీపావళి, ధనతెరాస్ పండుగల సందర్భంగా సేల్స్ భారీగా పెరిగాయి. అయితే మారుతీ సుజుకీకి ఆందోళన కలిగించే విషయం ఏమంటే ఈ కంపెనీకి అతి ఎక్కువ రెవెన్యూ వచ్చే మినీ కార్ సెగ్మెంట్ సేల్స్ 53 శాతం తగ్గాయి.

మారుతీ సుజుకీ నిదానంగా మార్కెట్‌ను పెంచుకుంటోంది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో మందగమనం, పెరుగుతున్న వ్యయం కారణంగా లాభాలు కొంత తగ్గాయి. మారుతీ సుజుకీ మంత్లీ సేల్స్ గత కొన్నాళ్లుగా 1.6 లక్షల నుంచి 1 లక్ష యూనిట్లకు పడిపోయాయి.

12 నెలల కాలంలో మారుతీ సుజుకీ ట్రేడింగ్ అంచనాల కంటే 30 రెట్లు పెరిగింది. పేరెంట్ SMC కంటే రెండు రెట్లు ఉంది. మారుతీ సుజుకీ స్టాక్స్ గత మూడు నెలల్లో 38 శాతం పెరిగాయి. అదే సమయంలో పేరెంట్ SMC 28 శాతం మాత్రమే పెరిగింది.

English summary

Suzuki Motor forecasts Maruti sales to fall 20%

Suzuki Motor Corporation (SMC) has revised the FY20 sales forecast of its Indian subsidiary Maruti Suzuki and said sales will plunge 20% on back of a dismal first half performance. The Japanese carmaker had earlier projected a 4% growth.
Company Search
Thousands of Goodreturn readers receive our evening newsletter.
Have you subscribed?
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Goodreturns sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Goodreturns website. However, you can change your cookie settings at any time. Learn more