పరిస్థితి అంతా సాధారణ స్థితికి, వ్యాక్సీన్ పంపీణీయే...: కరోనాపై బిల్ గేట్స్
వాషింగ్టన్: కరోనా వైరస్ కారణంగా ప్రపంచవ్యాప్తంగా కార్యకలాపాలు, తద్వారా ఆర్థిక వ్యవస్థ తీవ్రంగా దెబ్బతిన్నది. అయితే 2021 ఎండాకాలం నాటికి దాదాపు పూర్తిగా సర్దుకోవచ్చునని మైక్రోసాఫ్ట్ సహ వ్యవస్థాపకులు బిల్ గేట్స్ ఆశాభావం వ్యక్తం చేశారు. కరోనా వ్యాక్సీన్ అందుబాటులోకి వస్తే, దాదాపు అన్ని కార్యకలాపాలు తిరిగి కరోనా ముందుస్థాయికి చేరుకుంటాయన్నారు. 'వ్యాక్సీన్ అప్రూవల్స్ త్వరగా వచ్చి, అందుబాటులోకి వస్తే వచ్చే సమ్మర్ నాటికి, దాదాపు అన్ని కార్యకలాపాలు పూర్వస్థితికి చేరుకోవచ్చు'నని గురువారం రాత్రి ఓ టెలివిజన్ ఇంటర్వ్యూలో పేర్కొన్నారు.
LVB crisis: లక్ష్మీ విలాస్ బ్యాంకు నుండి రూ.5 లక్షలు తీసుకోవచ్చు.. ఇలా

వ్యాక్సీన్ ఫలితాలను బట్టి..
ఇప్పటికే ఫైజర్, మోడర్నా తమ తమ తమ వ్యాక్సీన్లు 95 శాతం ఫలితాలు ఇచ్చాయని ఇటీవల ప్రకటించిన విషయం తెలిసిందే. తమ వ్యాక్సీన్ అప్రూవల్స్ కోసం వేగంగా ముందుకు సాగుతున్నాయి. ట్రయల్స్ చివరి దశలో ఉన్నాయి. మొదటి టీకా డిసెంబర్ చివరలో అమెరికాలో ప్రారంభం కావొచ్చునని తెలుస్తోంది. ఈ నేపథ్యంలో బిల్ గేట్స్ వ్యాఖ్యలు గమనార్హం. వచ్చే ఏడాది మిడిల్ నాటికి ఉద్యోగులు కార్యాలయాలకు వెళ్లవచ్చునని, రెస్టారెంట్లు, బార్లు తెరుచుకుంటాయని ఆశాభావం వ్యక్తం చేశారు. ఇప్పటికే ప్రారంభం కంటే భిన్నమైన దశలో ఉన్నట్లు తెలిపారు. అలాగే ప్రతి స్కూల్ తెరుచుకోవచ్చునన్నారు.

వ్యాక్సీన్ పంపిణీ
వ్యాక్సీన్ పంపిణీపై కూడా బిల్ గేట్స్ స్పందించారు. ప్రపంచవ్యాప్తంగా అన్ని మూలల్లోకి వ్యాక్సీన్ వెళ్లాల్సిన ఆవశ్యకత ఉందని అభిప్రాయపడ్డారు. ప్రపంచవ్యాప్తంగా అందరికీ చేరడానికి 10 బిలియన్లు లేదా వెయ్యి కోట్ల డోసులు అవసరమన్నారు. ప్రపంచంలోనే అత్యధిక కేసులు, మరణాలు అమెరికాలో చోటు చేసుకున్నాయి. భారత్ రెండో స్థానంలో ఉంది. ప్రతి నగరంలో, పట్ఠణంలో కార్యాలయాలు, పార్కులు, రెస్టారెంట్లు యథాతథ స్థితికి వస్తాయన్నారు. అయితే వ్యాక్సీన్ సరఫరా క్లిష్టమైన అంశమన్నారు.

డిసెంబర్ నాటికి వ్యాక్సీన్ ప్రారంభం
కరోనా తర్వాత 50 శాతం బిజినెస్ ట్రావెల్, 30 శాతం ఆఫీస్ లైఫ్ కనిపించకుండా పోవచ్చునని గేట్స్ అన్నారు. కాగా గేట్స్ అండ్ మిలిండా ఫౌండేషన్ ద్వారా అంతర్జాతీయంగా కరోనా కట్టడి కోసం 350 బిలియన్ డాలర్ల మేర సాయం అందించారు. అమెరికాలో కరోనా టీకాల పంపిణీ డిసెంబర్ సమయానికి ప్రారంభం కావొచ్చునని భావిస్తున్నారు.