For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

వర్క్ ఫ్రమ్ హోం: బెంగళూరులో టెక్కీలు ఖాళీ, వీటికి భలే డిమాండ్

|

కరోనా కారణంగా హైదరాబాద్, బెంగళూరు వంటి నగరాలు ఖాళీ అవుతున్నాయి. ఐటీ రంగానికి ఈ రెండు నగరాలు పెట్టింది పేరు. కరోనా వ్యాప్తిని నిరోధించే క్రమంలో సాఫ్టువేర్ సంస్థలు సహా వెసులుబాటు కలిగిన ప్రతి రంగం కూడా తమ ఉద్యోగులకు ఇంటి నుండి పని చేసే వెసులుబాటును కల్పించింది. కంపెనీలు అన్నీ తాత్కాలికంగా వర్క్ ఫ్రమ్ హోమ్ ఇచ్చాయి. కరోనా కారణంగా ఇది ఎంతకాలం కొనసాగుతుందో తెలియదు. అదే సమయంలో కొన్ని కంపెనీలు పర్మినెంట్ వర్క్ ఫ్రమ్ దిశగా అడుగులు వేస్తున్నాయి.

వేలాదిమంది ఐటీ ఉద్యోగులకు ఇకముందు మరింత గండం!

స్టోరేజ్ హౌస్‌లకు యమ డిమాండ్

స్టోరేజ్ హౌస్‌లకు యమ డిమాండ్

తాత్కాలికం లేదా పర్మినెంట్ ఏదయినా ఐటీ రంగం సహా వివిధ రంగాలు వర్క్ ఫ్రమ్ హోమ్ ఇస్తున్నాయి. దీంతో ఐటీ అంటేనే మొదటగా గుర్తుకు వచ్చే బెంగళూరు నగరం ఖాళీ అవుతోంది. ప్రధానంగా టెక్కీలు సొంతూళ్లకు వెళ్లిపోయారు. కరోనా తగ్గుతుందేమోనని అద్దె ఇళ్లలోనే ఉండి వేచి చూసిన వారు కూడా ఇప్పుడు ఎప్పటికి తగ్గుతుందో తెలియని పరిస్థితుల్లో ఖాళీ చేసి వెళ్తున్నారు. దీంతో బెంగళూరు నగరంలో స్టోరేజ్ హౌస్‌లకు డిమాండ్ పెరుగుతోంది.

డిమాండ్ ఎందుకు పెరుగుతోంది

డిమాండ్ ఎందుకు పెరుగుతోంది

సేఫ్ స్టోరేజ్, స్టోరేజియన్స్, స్టోనెస్ట్ స్టోరేజ్, ఆరెంజ్ సేఫ్ స్టోరేజ్, మై-రక్ష వంటి సంస్థల సేవలకు రోజురోజుకు డిమాండ్ పెరుగుతోంది. టెక్కీలు సహా చాలామంది ఇళ్లకు వెళ్లిపోతున్నారు. ఇళ్లను ఖాళీ చేస్తున్న వారు తమ వస్తువులను సేఫ్‌గా దాచుకునేందుకు ఈ సేవల వైపు మొగ్గు చూపుతున్నారు. సాధారణంగా ఎక్కువ కాలం విదేశాలకు వెళ్లేవారు వీటిని ఉపయోగిస్తారు. అలాగే, ఇళ్లు ఖాళీ చేసి, సరైన ఇళ్లు దొరికే వరకు కూడా స్టోరేజ్ హోమ్స్ ఉపయోగించుకుంటారు. ఇప్పుడు కరోనా కారణంగా డిమాండ్ ఊహించని విధంగా పెరిగింది.

అద్దెలు చాలా ఎక్కువ అందుకే..

అద్దెలు చాలా ఎక్కువ అందుకే..

బెంగళూరు వంటి నగరాల్లో అద్దెకు ఉండాలంటే ఆరు నెలల నుండి ఏడాది వరకు అడ్వాన్స్ చెల్లించాలి. అంతేకాదు, అద్దెలు కూడా ఎక్కువగా ఉంటాయి. ఎక్కువ కాలం నగరంలో ఉండలేని పరిస్థతుల్లో వీటికి ప్రత్యామ్నాయం స్టోరేజ్ హౌస్‌లు. కేవలం వ్యక్తులే కాదు, సంస్థలు కూడా కార్యాలయాలకు సంబంధించి తమ వస్తువులను దాచుకోవడానికి ఉపయోగిస్తాయి.

ఏవైనా సరే

ఏవైనా సరే

ఇంట్లో ఉపయోగించే వస్తువులు, ఆఫీస్ ఐటమ్స్, డాక్యుమెంట్స్, వాహనాలు.. ఇలా దేనినేనా దాచుకోవడానికి ఈ సేవలు అందుబాటులో ఉన్నాయి. స్వల్పకాలిక, దీర్ఘకాలిక ప్రాతిపదికన వీటిని దాచుకోవచ్చు. పికప్ సదుపాయం కూడా ఉంది. వ్యక్తిగత లాకర్ సదుపాయం, 24 గంటలు సీసీటీవీ పర్యవేక్షణ వంటి సౌకర్యాలు ఉన్నాయి.

రెంట్ భారం లేకుండా ఇవి కూడా...

రెంట్ భారం లేకుండా ఇవి కూడా...

ఈ స్టోరేజ్‌లు వివిధ రకాలుగా సేవలు అందిస్తున్నాయి. వీటిని ఉపయోగించే వారిలో స్టార్టప్స్, రెస్టారెంట్లు, జిమ్‌లు, చిన్న చిన్న ఐటీ కంపెనీలు, ప్లే స్కూల్స్ కూడా ఎక్కువగా ఉంటాయి. తమ నెలవారీ అద్దెల్ని తగ్గించుకోవడానికి ఈ సౌకర్యాన్ని తమకి అనుగుణంగా ఉపయోగించుకుంటాయి ఈ సంస్థలు. ప్రకృతి వైపరీత్యాలు, ఫైర్ యాక్సిడెంట్ వంటివి జరిగితే బీమా కూడా ఉంటుంది.

రెంట్ పెద్ద మొత్తంలో తగ్గింది

రెంట్ పెద్ద మొత్తంలో తగ్గింది

బెంగళూరు నుండి కన్నూరుకు షిఫ్ట్ అయిన రాజీవ్ ఎంపీ మాట్లాడుతూ.. మార్చి నెల నుండి వర్క్ ఫ్రమ్ హోమ్ అయినప్పటికీ తాను తన 2BHK ఇంటికి నెలకు రూ.24,000 చెల్లిస్తున్నానని, దీంతో తాను ప్రత్యామ్నాయంగా స్టోరేజ్ హౌస్‌ను ఎంచుకున్నానని, తన ఇంటి వస్తువుల రవాణా కోసం రూ.5,500 తీసుకున్నారని, నెలకు రూ.2,891 తీసుకుంటున్నారని తెలిపారు.

సేఫ్ స్టోరేజ్ కో-ఫౌండర్ రమేష్ మాడిశెట్టి మాట్లాడుతూ.. తమకు 1.16 లక్షల స్క్వేర్ ఫీట్లతో 13 వేర్ హౌస్‌లు ఉన్నాయని, ఇప్పటికే కొత్తగా 27వేల స్క్వేర్ ఫీట్లతో కొత్తది తీసుకున్నామని, రానున్న రోజుల్లో మరింత డిమాండ్ పెరిగి, కొత్తవి తీసుకోవచ్చునని చెప్పారు.

English summary

Storage on rent in demand as work from home techies

In an extended work from home scenario, a growing proportion of the working population, primarily techies, are leaving the city and moving back to their hometowns, pushing up demand for storage houses, where household and office belongings are stocked securely for low rentals.
Company Search
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Goodreturns sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Goodreturns website. However, you can change your cookie settings at any time. Learn more