For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

భారత ఆర్థిక వ్యవస్థ పరుగులు పెడుతోంది, ఉద్యోగ అవకాశాలు పెరిగాయి

|

ప్రపంచంలోనే అత్యంత వేగవంత పెద్ద ఆర్థిక వ్యవస్థ బాటలో మన దేశం ఉందని ఆర్థిక శాఖ తాజాగా విడుదల చేసిన నివేదిక వెల్లడించింది. కరోనా వ్యాక్సీన్ కార్యక్రమం దిగ్విజయంగా కొనసాగుతుండటం, పండుగ సీజన్‌లో రికవరీ వేగవంతం కావడం, డిమాండ్-సప్లై మధ్య అంతరం తగ్గడం, ఉద్యోగ అవకాశాలు పెరగడం వంటి అనేక అంశాలు ఆర్థిక వ్యవస్థకు ఊతమిస్తున్నట్లు నెలవారీ నివేదికలో ఆర్థిక శాఖ పేర్కొంది. దేశ ఆర్థిక వ్యవస్థ పునరుద్ధరణలో ఆత్మనిర్భర్ భారత్ మిషన్ కీలకపాత్ర పోషిస్తోందని చెప్పారు. వ్యాపార అవకాశాలు, వ్యయాలు పెంచడం ద్వారా ఈ మిషన్ తోడ్పాటును అందిస్తోందన్నారు. గత జనవరిలో విడుదల చేసిన 2020-21 ఆర్థిక సర్వేలో 2022 మార్చితో ముగిసే ఆర్థిక సంవత్సరంలో జీడీపీ వృద్ధిని 11 శాతంగా అంచనా వేశారు. సరఫరా వైపు సంస్కరణలు తీసుకురావడం, నిబంధనలు సులభతరం చేయడం, మౌలిక పెట్టుబడులు, తయారీ రంగానికి ఉత్పత్తి ఆధారిత ప్రోత్సాహక (PLI) పథకాలు అమలు చేయడంతో డిమాండ్-వినియోగం పెరుగుతాయని సర్వే తెలిపింది.

తగ్గిన కేసులు

తగ్గిన కేసులు

కరోనా నేపథ్యంలో గత ఆర్థిక సంవత్సరంలో భారత ఆర్థిక వ్యవస్థ తీవ్రంగా దెబ్బతిన్నది. ఆర్థిక రికవరీ నేపథ్యంలో క్రమంగా కోలుకుంటోంది. గత కొంతకాలంగా రోజువారీ కరోనా కేసులు తగ్గుముఖం పట్టడం, వ్యాక్సినేషన్ ప్రోగ్రాం 100 కోట్లు దాటడం, పండుగ సీజన్ వంటి అంశాలు డిమాండ్‌కు తోడ్పడి వేగవంతమైన ఆర్థిక రికవరీకి దోహదపడింది. దీపావళి పండుగ సమయంలో విక్రయాలు 1.3 లక్షల కోట్లతో రికార్డ్ స్థాయికి చేరుకున్నట్లు కాన్ఫెడరేషన్ ఆఫ్ ఆల్ ఇండియా ట్రేడర్స్ తెలిపింది. రోజువారీ కరోనా కేసులు సెప్టెంబర్ నెలలో 32,000 నుండి అక్టోబర్ నెలకు 18,000కు తగ్గాయి.

అందుకే రికవరీ

అందుకే రికవరీ

ప్రస్తుతం ప్రపంచ ఆర్థిక వ్యవస్థ పునరుద్ధరణ సరఫరా పరిమితులు, ఇన్‌పుట్ కాస్ట్ ద్రవ్యోల్భణం వంటి ఇబ్బందులు ఎదుర్కొంటున్నప్పటికీ, వ్యాక్సీన్ వ్యాప్తి, ఆర్థిక కార్యకలాపాల పునరుద్ధరణ కారణంగా భారత్‌లో పునరుజ్జీవ సంకేతాలు కనిపిస్తున్నాయని ఆర్థికమంత్రిత్వ శాఖ నివేదిక పేర్కొంది. అంతర్జాతీయ క్రూడాయిల్ మార్కెట్‌లో అస్థిర ధరలు, ఖరీదైన ఎడిబుల్ ఆయిల్స్, మెటల్ ఉత్పత్తులు సవాళ్లను కొనసాగించవచ్చునని నివేదిక తెలిపింది. ప్రపంచవ్యాప్తంగా మొబిలిటీ ఆంక్షలు సడలించడంతో ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్, వరల్డ్ ట్రేడ్ ఆర్గనైజేషన్ వంటి సంస్థలు ప్రపంచ వృద్ధి అవకాశాల అంచనాలను మెరుగుపరిచాయి. ఇది భారత ఎగుమతులకు ఊతమిచ్చింది. IMF అక్టోబర్ 2021లో తన ప్రపంచ వృద్ధి అంచనాలను 2021లో 5.8 శాతం, 2022లో 4.9 శాతంగా పేర్కొంది.

ఇవి జంప్

ఇవి జంప్

ఆగస్ట్ నెలలో ఇండస్ట్రియల్ ప్రొడక్షన్ ఇండెక్స్ 103 శాతం పెరిగిందని, తద్వారా కరోనా ముందుస్థాయికి చేరుకుందని రిపోర్ట్ తెలిపింది. తయారీ రంగంలో పునరుద్ధరణ కనిపిస్తోందని వెల్లడించింది. క్యాపిటల్ గూడ్స్ కేటగిరీలో పెరుగుదల కనిపించిందని, ఇది పెట్టుబడిలో పెరుగుదలను సూచిస్తున్నట్లు పేర్కొంది. బొగ్గు, సహజవాయువు, ఉక్కు, సిమెంట్ విద్యుత్‌తో కూడిన ఎనిమిది ప్రధాన పరిశ్రమల ఉత్పత్తి ఇప్పుడు సెప్టెంబర్ 2019 నాటి కరోనా పూర్వస్థితిని దాటిందని తెలిపింది.

English summary

Slowdown in COVID accelerates economic recovery in October

With the number of fresh COVID infections falling every day and vaccinations shooting past 100 crores, the festive season regained the lustre with a spurt in sales and accelerated the pace of economic recovery in India, according to a finance ministry statement.
Story first published: Thursday, November 11, 2021, 9:33 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X