For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

కుబేరులనూ వదలని ఆర్థిక మాంద్యం: బిజినెస్ జెట్స్ కు గుడ్ బై!

|

భారత దేశంలో నెలకొన్న ఆర్థిక మాంద్యం పరిస్థితులు అందరినీ ఇబ్బందికి గురిచేస్తున్నాయి. ఇప్పటికే సామాన్యులను అష్ట కష్టాలకు గురి చేస్తున్న ఆర్థిక మాంద్యం సెగలు ఇప్పుడు సంపన్నులనూ తాకాయి. ఇటీవల దేశంలోని అపార కుబేరులు సైతం తాము ఉపయోగిస్తున్న బిజినెస్ జెట్ విమానాలను అమ్మి వేయటమో లేదా వేరొకరికి లీజుకు ఇవ్వటమో చేస్తున్నారు. దీనికి ప్రధాన కారణం మాత్రం ఆర్థిక మాంద్యమే. ఈ లిస్టులో అనిల్ అంబానీ కూడా ఉండటం విశేషం.

భారత దేశ ఆర్థిక వ్యవస్థ కొంత కాలంగా సవాళ్ళను ఎదుర్కొంటోంది. జీడీపీ వృద్ధి రేటు పడిపోతూ ఆందోళనకు గురిచేస్తోంది. ఆటోమొబైల్ రంగంతో మొదలై అన్ని రంగాలనూ ఇది చుట్టేస్తోంది. పెద్ద ఎత్తున ఉద్యోగాలు పోతూ అందరినీ వణికిస్తోంది. అయితే ఈ ప్రభావానికి ఇప్పుడు కుబేరులూ కుదేలవుతున్నారు. తాము ఎంతగానో ఇష్టపడే ప్రైవేట్ జెట్ విమానాలకు తప్పనిసరి పరిస్థితిలో గుడ్ బై చెప్పేస్తున్నారు. గతేడాదితో పోల్చితే దేశంలో ఉన్న బిజినెస్ జెట్ విమానాల సంఖ్య తగ్గిపోతోంది. ఆర్థిక మాంద్యం ఎవరినీ వదలటం లేదని దీంతో నిరూపితమవుతోంది.

మరి కొందరిదీ అదే బాట...

మరి కొందరిదీ అదే బాట...

బిజినెస్ జెట్ విమానాలు నిర్వహించే కంపెనీలు దేశంలో కొన్ని మాత్రమే ఉన్నాయి. అందులో చాలా వరకు విమానాలు అత్యంత కుబేరుల కు సంబంధించినవే ఉంటాయి. వారి గ్రూప్ కంపెనీలు విమానాల నిర్వహణ బాధ్యతలు చూస్తుంటాయి. అనిల్ అంబానీ తర్వాత... తమ బిజినెస్ జెట్ విమానాలను విక్రయించటమో లేదా లీజుకిచ్చిన వారి జాబితాలో ప్రముఖ సినీ నటుడు, పారిశ్రామికవేత్త సచిన్ జోషి కూడా ఉన్నారు. ఆయనకు చెందిన వైకింగ్ ఏవియేషన్, ఇండియా బుల్స్ సంస్థ ఎయిర్ మిడ్ ఏవియేషన్, రెలిగేర్ కు చెందిన ఏవియేషన్ కూడా ఇదే దారిలో పయనిస్తున్నాయని ఈటీ తన ఆర్టికల్ లో పేర్కొంది. ఈ సంస్థలు తీవ్ర ఆర్థిక ఇబ్బందులను ఎదుర్కోవటం వల్లే జెట్ విమానాలను లీజుకు ఇవ్వటం లేదా విక్రయించటం చేస్తున్నట్లు తెలిసింది. సచిన్ జోషి వద్ద రెండు జెట్ విమానాలు ఉండగా వాటి నిర్వహణ ఇబ్బందిగా మారటంతో ఒకటి ముంబై విమానాశ్రయంలో, మరోటి నాందేడ్ విమానాశ్రయంలో పార్క్ చేసి పెట్టినట్లు సమాచారం. సిబ్బందికి మూడు నాలుగు నెలలుగా వేతనాలు చెల్లించలేదని తెలిసింది.

తగ్గిన విమానాల సంఖ్య...

తగ్గిన విమానాల సంఖ్య...

ఇండియా లో ఉన్న బిజినెస్ జెట్ విమానాల సంఖ్య తగ్గుతూ వస్తోంది. అధికారిక గణాంకాల ప్రకారం ఈ విషయం నిరూపితమైంది. డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ అవియేషన్ (డీజీసీఏ) సమాచారం ప్రకారం... దేశంలో నాన్ -షెడ్యూల్డ్ ఆపరేటర్ల సంఖ్య 130 ఉండేది. కానీ అది ప్రస్తుతం 99 కి పడిపోయింది. దీన్ని బట్టి చూస్తే కేవలం జెట్ విమానాలు కాకుండా వాటిని నిర్వహించే సంస్థలు కూడా మూత పడుతున్నాయని స్పష్టమవుతోంది. విమానాలను నిర్వహించటం అనేది చాలా ఖర్చుతో కూడుకొన్న వ్యవహారం. పైలట్ వేతనాలు, ఎయిర్ పోర్ట్ లో పార్కింగ్ చార్జీలు, ఇంధనం, మైంటెనెన్సు ఖర్చులు అధికంగా ఉంటాయి. అందుకే విమానాన్ని కొనుగోలు చేసే కన్నా కూడా దాన్ని అవసరమైనప్పుడు అద్దెకు తీసుకోవటమే మేలని కొందరు సంపన్నులు భావిస్తున్నారట. హెలికాప్టర్ ను గంటకు రూ 2.5 లక్షల అద్దెకు తీసుకోవచ్చు.

13% తగ్గిన కార్యకలాపాలు..

13% తగ్గిన కార్యకలాపాలు..

ప్రైవేటు రంగం ఉపయోగించే విమానాలు, వాటి నిర్వహణను జనరల్ ఏవియేషన్ (సాధారణ విమానయానం) గా పరిగణిస్తారు. దేశంలో ఉన్న ప్రైవేట్ జెట్ కార్యకలాపాలు వీటి పరిధిలోకి వస్తాయి. ఈ ఏడాది సెప్టెంబర్ లో ప్రైవేట్ జెట్ మూవెమెంట్స్ 5.7% పడిపోగా... అక్టోబర్ నెలలో మరింతగా తగ్గి 12.8% క్షీణించాయి. కేంద్ర ప్రభుతం ప్రాంతీయ విమానయానాన్ని ప్రోత్సహించేందుకు ఎన్ని చర్యలు తీసుకొన్నా... దేశంలో నెలకొన్న ఆర్థిక మాంద్యం మాత్రం ఒక్క అడుగు ముందుకు పడకుండా అడ్డుకుంటోంది

English summary

Slowdown grounds business jets as the rich tighten purse strings

Indian industrialists looking to tighten their belts amid the economic slowdown are giving up business jets as they cut the flab. Anil Ambani’s Reliance Transport and Travels has leased one of its three business jets, a 13-seater Global 5000, to a global charter company that has stationed the aircraft in Bengaluru. “This is the same aircraft that Anil Ambani used to fly in for his travels,” said a person with knowledge of the matter. The company has two more fixed-wing planes and a heli.
Story first published: Friday, December 6, 2019, 22:06 [IST]
Company Search
Thousands of Goodreturn readers receive our evening newsletter.
Have you subscribed?
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Goodreturns sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Goodreturns website. However, you can change your cookie settings at any time. Learn more