6 కంపెనీల మార్కెట్ క్యాప్ రూ.1.13 లక్షల కోట్లు జంప్: టీసీఎస్, ఎయిర్టెల్ అదుర్స్
టాప్ 10లోని ఆరు కంపెనీల మార్కెట్ క్యాపిటలైజేషన్ గతవారం రూ.1.13 లక్షల కోట్లు పెరిగింది. భారత ఐటీ దిగ్గజం టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ ఎం.క్యాప్‌లో బిగ్గెస్ట్ గెయినర్‌గా నిలిచింది. ఆ తర్వాత భారతీ ఎయిర్టెల్ ఉంది. రిలయన్స్ ఇండస్ట్రీస్, టీసీఎస్, HDFC బ్యాంకు, ఇన్ఫోసిస్, ICICI బ్యాంకు, భారతీ ఎయిర్టెల్ లాభపడగా, హిందూస్తాన్ యూనీలీవర్ (HUL), HDFC, కొటక్ మహీంద్రా బ్యాంకు, బజాజ్ ఫైనాన్స్ మార్కెట్ క్యాప్ నష్టపోయింది.
అమెరికా క్యాపిటల్ హింసకు ముందు వారికి భారీగా బిట్‌కాయిన్ పేమెంట్స్

వీటి మార్కెట్ క్యాప్ జంప్
- టీసీఎస్ మార్కెట్ క్యాప్ రూ.42,495.76 కోట్లు ఎగిసి రూ.12,13,371.12 కోట్లకు పెరిగింది.
- భారతీ ఎయిర్ టెల్ మార్కెట్ క్యాపిటలైజేషన్ రూ.33,960.84 కోట్లు ఎగిసి రూ.3,28,697.33 కోట్లకు చేరింది.
- HDFC బ్యాంకు ఎం-క్యాప్ రూ.19,001.41 కోట్లు లాభపడి రూ.8,07,615.27 కోట్లుగా నమోదయింది.
- ఇన్ఫోసిస్ మార్కెట్ క్యాప్ రూ.14,184.43 కోట్లు పెరిగి రూ.5,72,957.16 కోట్లకు చేరుకుంది.
- రిలయన్స్ ఇండస్ట్రీస్ ఎం-క్యాప్ రూ.Rs 2,884.44 కోట్లు పెరిగి రూ.12,28,330.03 కోట్లుగా ఉంది.
- ICICI బ్యాంకు మార్కెట్ క్యాప్ రూ.492.06 కోట్లు ఎగిసి రూ.3,74,745.94 కోట్లకు చేరుకుంది.

నష్టపోయిన కంపెనీలు...
- ఇక కొటక్ మహీంద్రా బ్యాంకు ఎం-క్యాప్ రూ.21,171.32 కోట్లు తగ్గి రూ.3,69,082.01 కోట్లకు చేరింది.
- బజాజ్ ఫైనాన్స్ మార్కెట్ క్యాపిటలైజేషన్ రూ.12,000.53 కోట్లు క్షీణించి రూ.2,94,156.02 కోట్లుగా నమోదయింది.
- HUL మార్కెట్ క్యాప్ రూ.9,034.04 కోట్లు తగ్గి రూ.5,52,592.14 కోట్లుగా ఉంది.
- HDFC మార్కెట్ క్యాప్ రూ.3,861.42 కోట్లు క్షీణించి రూ.4,73,801.61 కోట్లుగా నమోదయింది.

ఆయా కంపెనీ మార్కెట్ క్యాప్
టాప్ 10 మోస్ట్ వ్యాల్యూడ్ డొమెస్టిక్ కంపెనీల విషయానికి వస్తే వరుసగా రిలయన్స్(రూ.1228330.03 కోట్లు), టీసీఎస్ (రూ.1213371.12 కోట్లు), HDFC బ్యాంకు (రూ.807615.27 కోట్లు), ఇన్ఫోసిస్ (రూ.572957.16 కోట్లు), HUL (రూ.552592.14 కోట్లు), HDFC (రూ.473801.61 కోట్లు), ICICI బ్యాంకు (రూ.374745.94 కోట్లు), కొటక్ మహీంద్రా బ్యాంకు (రూ.369082.01 కోట్లు), భారతీ ఎయిర్టెల్ (రూ.328697.33 కోట్లు), బజాజ్ ఫైనాన్స్ (రూ.294156.02 కోట్లు) ఉన్నాయి. గతవారం బీఎస్ఈ సెన్సెక్స్ 252 పాయింట్లు లేదా 0.51 శాతం ఎగిసింది.