For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

Shriram Properties IPO: ప్రైస్ బ్యాండ్, జీఎంపీ, లిస్టింగ్ సహా పూర్తి వివరాలివే..

|

ముంబై: దక్షిణాది రాష్ట్రాలకు చెందిన రియల్ ఎస్టేట్ డెవలప్‌మెంట్ కంపెనీ శ్రీరామ్ ప్రాపర్టీస్.. పబ్లిక్ ఇష్యూకు రాబోతోంది. ఈ నెల 8వ తేదీన ఐపీఓను జారీ చేయనుంది. పబ్లిక్ ఇష్యూను జారీ చేయడం ద్వారా మొత్తంగా 600 కోట్ల రూపాయలను సమీకరించుకోవాలని లక్ష్యంగా పెట్టుకుంది. మిడ్ క్యాప్ రేంజ్ సెగ్మెంట్ కావడం, రియాలిటీకి సంబంధించిన సంస్థ కావడం వల్ల ఇన్వెస్టర్ల నుంచి మిశ్రమ స్పందన లభించవచ్చని మార్కెట్ వర్గాలు అంచనావేస్తోన్నాయి.

శ్రీరామ్ ప్రాపర్టీస్ చెందిన పబ్లిక్ ఇష్యూ ఈ నెల 8వ తేదీన ఓపెన్ అవుతుంది. 10వ తేదీన ముగుస్తుంది. ఈ ఐపీఓ ప్రైస్ బ్యాండ్ 113 రూపాయల నుంచి 118 రూపాయలు. ఒక్కో రిటైల్ ఇన్వెస్టర్.. కనీసం 125 షేర్లను కొనుగోలు చేయాల్సి ఉంటుంది. 125 షేర్లను ఒక లాట్‌గా పరిగణిస్తారు. పబ్లిక్ ఇష్యూలో ఇన్వెస్ట్ చేయడానికి రిటైలర్లు గరిష్ఠంగా 14,750 రూపాయలను పెట్టుబడిగా పెట్టాల్సి ఉంటుంది. షేర్ల అలాట్‌మెంట్ ఈ నెల 15వ తేదీన ఉంటుంది. దీని కటాఫ్ ప్రైస్ 118 రూపాయలు.

Shriram Properties IPO will open on December 8 for subscription

అలాట్‌మెంట్ దక్కని వారికి ఆ మరుసటి రోజు నుంచే రిఫండ్ చెల్లిస్తారు. 20వ తేదీన బోంబే స్టాక్ ఎక్స్‌ఛేంజ్, నేషనల్ స్టాక్ ఎక్స్‌ఛేంజ్‌లో లిస్ట్ అవుతాయి ఈ కంపెనీకి చెందిన షేర్లు. ఒక్కో ఇన్వెస్టర్ 13 లాట్ల వరకు కొనుగోలు చేయవచ్చు గరిష్ఠంగా 1,91,750 రూపాయలను ఒకేసారి పెట్టుబడిగా పెట్టడానికి వీలు ఉంది. క్వాలిఫైడ్ ఇన్‌స్టిట్యూషనల్ ఇన్వెస్టర్ల కోసం అధిక వాటాను కేటాయించింది. మొత్తం 450 కోట్ల రూపాయల విలువ చేసే షేర్లను కేటాయించింది.

పబ్లిక్ ఇష్యూను జారీ చేయడం ద్వారా 600 కోట్ల రూపాయలను సమీకరించుకోనుంది. దాన్ని అసంపూర్తిగా ఉన్న ప్రాజెక్టుల కోసం ఈ మొత్తాన్ని వ్యయం చేయాలని ప్రాథమికంగా కంపెనీ యాజమాన్యం నిర్ణయించినట్లు తెలుస్తోంది. దక్షిణాదిన హైదరాబాద్, విశాఖపట్నం, బెంగళూరు, చెన్నై, కోయంబత్తూర్ వంటి టయర్-1 నగరాల్లో శ్రీరామ్ ప్రాపర్టీస్‌ సంస్థకు చెందిన ప్రాజెక్టులు నడుస్తున్నాయి. కంపెనీ బ్యాలెన్స్ షీట్ మైనస్‌లో ఉండటం వల్ల కొంత ప్రతికూల వాతావరణాన్ని ఎదుర్కొనవచ్చనే విశ్లేషణలు వ్యక్తమౌతున్నాయి.

ఏటీఎం క్యాష్ విత్ డ్రా ఛార్జీలు పెంపు: రిజర్వుబ్యాంక్ పెట్టిన ముహూర్తం ఇదేఏటీఎం క్యాష్ విత్ డ్రా ఛార్జీలు పెంపు: రిజర్వుబ్యాంక్ పెట్టిన ముహూర్తం ఇదే

శ్రీరామ్ ప్రాపర్టీస్ గ్రే మార్కెట్ ప్రీమియం అమౌంట్ ఎంత అనేది ఇంకా తెలియరావట్లేదు. పబ్లిక్ ఇష్యూను జారీ చేసిన తరువాతే జీఎంపీ వాల్యూ ఎంత ఉండొచ్చనే అంచనాలు వెలువడతాయి. రిటైల్ ఇన్వెస్టర్లు ఎలా స్పందిస్తారనేది జీఎంపీ మీద ఆధారపడి ఉంటుందనేది మార్కెట్ వర్గాల అంచనా. రియల్ ఎస్టేట్ డెవలప్‌మెంట్ సెగ్మెంట్‌కు చెందిన కంపెనీ కావడం వల్ల ఇన్వెస్టర్లు ఎలా స్పందిస్తారనేది పబ్లిక్ ఇష్యూ ఓపెనింగ్ నాడు తెలిసిపోతుంది.

English summary

Shriram Properties IPO: ప్రైస్ బ్యాండ్, జీఎంపీ, లిస్టింగ్ సహా పూర్తి వివరాలివే.. | Shriram Properties IPO will open on December 8 for subscription

Shriram Properties Ltd initial public offering has set price band of ₹113-118 a share, valuing the company at ₹1,752 crore at the top end of the band.
Story first published: Saturday, December 4, 2021, 15:09 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X