For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

ఇంతకు ఈఎంఐలు చెల్లించాలా? వద్దా?

|

దేశవ్యాప్తంగా లాక్ డౌన్. ఎవరు ఇళ్ల నుంచి బయటకు వెళ్ళవద్దు అన్న ప్రకటన వెలువడగానే బ్యాంకుల నుంచి రుణాలు తీసుకొని ఉండి నెలవారీ వాయిదాలు చెల్లిస్తున్న వారి గుండెల్లో బాంబు పేలినంత పనయిపోయింది. బ్యాంకులు లేదా ఇతర ఆర్ధిక సంస్థల నుంచి తీసుకున్న రుణాల వాయిదాలు చెల్లించడం ఎలా? ఒకవేళ చెల్లించకపోతే పరిస్థితి ఏమిటి? డిఫాల్ట్, జరిమానాలు, క్రెడిట్ స్కోర్ పై దెబ్బ ఇలా అన్ని విషయాలు మైండులో తిరిగిపోయి తలపట్టుకున్న వారు చాలా మందే ఉంటారు. ఇలాంటి ఆందోళనలను దృష్టిలో ఉంచుకొనే భారత రిజర్వ్ బ్యాంకు రుణాలు తీసుకున్న వారు మూడు నెలల పాటు వాయిదాలు వాయిదా ( మారటోరియం) వేసుకునే సదుపాయాన్ని కల్పించింది. ఇది ఎంతో మందికి ఊరట కల్పించే విషయం. అయితే ఈ సదుపాయాన్ని వాడుకుంటేబాగుంటుందా లేక ఎప్పటి లాగే వాయిదాలు చెల్లిస్తూ పోతే బాగుంటుందా అన్న దానిపై కొన్ని అనుమానాలు ఉన్నాయి. వాటి గురించి చూద్దాం.

3 నెలలు EMI కట్టక్కర్లేదు, క్రెడిట్ కార్డు బిల్లు చెల్లించాలా? 8 కీలక అంశాలు తెలుసుకోండి

ఎవరికీ వర్తింపు

ఎవరికీ వర్తింపు

అన్ని రకాల కాలపరిమితి రుణాల వాయిదాల చెల్లింపులకు ఇది వర్తిస్తుంది. ఈ రుణాల్లో గృహ, ఆటో, విద్య, వ్యక్తిగత రుణాలు ఉంటాయి. వీటితో పాటు క్రెడిట్ కార్డు బకాయిలకు కూడా ఆర్బీఐ వెసులుబాటు కల్పించింది. మార్చి ఒకటో తేదీ నుంచి మే 31వ తేదీల మధ్య వాయిదాలు ఉన్న వారికీ ఇది వర్తిస్తుంది. ఈ సదుపాయం కల్పించడం వల్ల ఎంతో మంది రుణగ్రహీతలు ఊపిరి లభించింది. ఇప్పుడు ఈఎంఐ వాయిదా సదుపాయాన్ని వినియోగించుకోవాలా వద్దా అనే చాలా మంది ఆలోచిస్తున్నారు.

కాగా ఈఎంఐ ల వాయిదాలకు సంబందించిన విధానానికి బ్యాంకుల బోర్డులు అనుమతి ఇవ్వాల్సి ఉంటుంది. అప్పుడు ఎవరు ఈ సదుపాయాన్ని వినియోగించుకోవచ్చు అన్న దానిపై ఒక స్పష్టత వస్తుంది. ఇప్పటికే చాలా మంది వాయిదాలు చెల్లించే వారు ఎలక్ట్రానిక్ క్లియరింగ్ స్కీం ద్వారా వాయిదాలు చెల్లిస్తున్నారు. ఈ సదుపాయాన్ని ఏవిధంగా వాయిదా వేయాలన్న దానిపై బ్యాంకులు ఒక నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుందని చెబుతున్నారు.

చెల్లిస్తే పోలా!

చెల్లిస్తే పోలా!

రిజర్వ్ బ్యాంకు రేపో రేటును 0.75 శాతం మేర తగ్గించింది. ఈ మేరకు ఇప్పటికే స్టేట్ బ్యాంక్ అఫ్ ఇండియా వడ్డీ రేటును 0.75 శాతం తగ్గించింది. మిగతా బ్యాంకులు కూడా తమ వడ్డీ రేట్లను తగ్గించడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ వడ్డీ రేట్లతో సంబంధం ఉన్న రుణాలు చవకగా మారిపోతాయి. నెలవారీగా చెల్లించే ఈఎంఐ భారం కూడా తగ్గిపోతుంది. కాబట్టి ఇప్పుడున్న పరిస్థితుల్లో మీ దగ్గర డబ్బులు ఉంటే వాయిదాలు చెల్లించడమే మేలు. మీరు మూడు నెలలు వాయిదాలను చెల్లించకున్నా చెల్లించాల్సిన మొత్తంపై వడ్డీ పడుతుంది. మూడు నెలల తర్వాతి నుంచి మీరు ఈ వాయిదాల మొత్తాన్ని కూడా చెల్లించాల్సి ఉంటుంది. ఒకవేళ అప్పుడు ఏమైనా అవసరాలు ఏర్పడితే మీపై ఎక్కువ ఆర్ధిక భారం పడటానికి అవకాశం ఉంటుంది. కాబట్టి కాస్త అడ్జెస్ట్ చేసుకొని వాయిదాలు చెల్లించేయడం మేలంటున్నారు విశ్లేషకులు. మరీ వాయిదాలు చెల్లించే పరిస్థితి లేకపోతే అందుబాటులో ఉన్న సదుపాయాన్ని వినియోగించుకోవచ్చు.

క్రెడిట్ కార్డు వాయిదాల పరిస్థితి

క్రెడిట్ కార్డు వాయిదాల పరిస్థితి

క్రెడిట్ కార్డు వాయిదాలకు కూడా మారటోరియం వర్తిస్తుంది. అయితే దీన్ని వినియోగించుకునే విషయంలో కాస్త ఆలోచించాలి. క్రెడిట్ కార్డు బిల్లులపై వడ్డీ రేటు జమవుతూ ఉంటుంది. ఒకవేళ ఇది ఎక్కువగా ఉంటే గూబ గుయ్ మంటుంది జాగ్రత్త. ఒకవేళ ఈ బిల్లుల చెల్లింపులను వాయిదా వేసుకుంటే వడ్డీ ఏవిధంగా ఉంటుందో చూసుకొని నిర్ణయం తీసుకోవడం మంచిదాని విశ్లేషకులు సలహా ఇస్తున్నారు.

English summary

Should you pay EMI or not?

Lockdown across the country is going on. At this time many retail borrowers concerned about the impact of the lockdown on their finances. Many people feared about their ability to repay their loan EMis. Thanks to the Reserve Bank of India for big relief to these people.Banks and financial institutions are permitted to provide a moratorium of three months for all term loan installments which are due for payments between 1 March and 31 May. Should u opt this facility or not?
Story first published: Monday, March 30, 2020, 19:12 [IST]
Company Search
Thousands of Goodreturn readers receive our evening newsletter.
Have you subscribed?
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Goodreturns sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Goodreturns website. However, you can change your cookie settings at any time. Learn more