రిలయన్స్ 3% జంప్, ఐటీ స్టాక్స్ అదుర్స్: మళ్లీ 44,000 మార్క్ దాటిన సెన్సెక్స్
ముంబై: దేశీయ స్టాక్ మార్కెట్లు సోమవారం (నవంబర్ 23) లాభాల్లో ముగిశాయి. కరోనా వ్యాక్సీన్ పైన సానుకూల వార్తల నేపథ్యంలో అంతర్జాతీయ మార్కెట్లు పుంజుకున్నాయి. ఈ ప్రభావం మన మార్కెట్లపై పడింది. సెషన్ ఆరంభంలో భారీ లాభాల్లో కనిపించిన మార్కెట్లు ఆ తర్వాత నష్టాల్లోకి వెళ్లినప్పటికీ క్రమంగా పుంజుకున్నాయి. దీంతో 44 వేల మార్కును దాటింది.
నేడు మార్కెట్లు క్లోజ్ అయ్యే సమయానికి సెన్సెక్స్ 194.90 పాయింట్లు(0.44%) నష్టపోయి 44,077.15 వద్ద, నిఫ్టీ 67.50 పాయింట్లు(0.52%) పడిపోయి 12,926.50 పాయింట్ల వద్ద క్లోజ్ అయింది. 1636 షేర్లు లాభాల్లో, 1133 షేర్లు నష్టాల్లో ముగియగా, 178 షేర్లలో ఎలాంటి మార్పులేదు. బ్యాంకింగ్ రంగం మినహాయించి మిగతావి లాభాల్లో ముగిశాయి.
పన్ను ఎగవేతలు, దుర్వినియోగం.. భారత్‌కు రూ.75,000 కోట్ల నష్టం

రిలయన్స్ 3% జంప్.. ఐనా రూ.2,000కు దిగువనే
టాప్ గెయినర్స్ జాబితాలో ONGC 6.77 శాతం, ఇండస్ఇండ్ బ్యాంకు 4.78 శాతం, గెయిల్ 3.54 శాతం, డాక్టర్ రెడ్డీస్ ల్యాబ్స్ 3.38 శాతం, టెక్ మహీంద్ర 3.37 శాతం లాభాల్లో ముగిశాయి.
టాప్ లూజర్స్ జాబితాలో HDFC 3.60 శాతం, ICICI బ్యాంకు 2.49 శాతం, యాక్సిస్ బ్యాంకు 2.02 శాతం, ఎస్బీఐ 1.67 శాతం, ఎస్బీఐ లైఫ్ ఇన్సురెన్స్ 1.64 శాతం నష్టపోయాయి.
మోస్ట్ యాక్టివ్ స్టాక్స్‌లో రిలయన్స్, బజాజ్ ఫైనాన్స్, ఇండస్ ఇండ్ బ్యాంకు, బజాజ్ ఫిన్ సర్వ్, కొటక్ మహీంద్ర ఉన్నాయి.
రిలయన్స్ ఇండస్ట్రీస్ స్టాక్ నేడు దాదాపు3 శాతం రూ.55.70 పెరిగి రూ.1,955.20 వద్ద ముగిసింది. ఇప్పటికీ రూ.2,000కు తక్కువే ఉంది. ఫ్యూచర్ రిటైల్ 10 శాతం లాభపడింది.

రంగాలవారీగా...
రంగాలవారీగా నిఫ్టీ ఆటో 0.62 శాతం, నిఫ్టీ ఎనర్జీ 2.79 శాతం, నిఫ్టీ ఎఫ్ఎంసీజీ 0.36 శాతం, నిఫ్టీ ఐటీ 2.79 శాతం, నిఫ్టీ మీడియా 0.84 శాతం, నిఫ్టీ మెటల్ 1.22 శాతం, నిఫ్టీ ఫార్మా 1.83 శాతం, నిఫ్టీ రియాల్టీ 0.97 శాతం లాభపడ్డాయి.
నిఫ్టీ బ్యాంకు 0.72 శాతం, నిఫ్టీ ఫైనాన్షియల్ సర్వీసెస్ 1.07 శాతం, నిఫ్టీ పీఎస్‌యూ బ్యాంకు 0.16 శాతం, నిఫ్టీ ప్రయివేటు బ్యాంకు 0.31 శాతం నష్టపోయాయి.
ఐటీ, ఎనర్జీ, ఫార్మా, మెటల్ రంగాలు మంచి లాభాలు నమోదు చేశాయి.
సెన్సెక్స్, నిఫ్ఠీ రికార్డు స్థాయిలో ముగిసినప్పటికీ, నేటి గరిష్టాన్ని నిలబెట్టుకోలేదు.
నిఫ్టీ బ్యాంకు 212 పాయింట్లు నష్టపోయింది. మిడ్ క్యాప్ సూచీలు మంచి లాభాలు నమోదు చేశాయి.

ఐటీ స్టాక్స్ జంప్
ఐటీ స్టాక్స్‌లో టీసీఎస్ 2.52 శాతం, హెచ్‌సీఎల్ టెక్ 2.35 శాతం, ఇన్ఫోసిస్ 3.19 శాతం, టెక్ మహీంద్ర 3.09 శాతం, విప్రో 2.97 శాతం, మైండ్ ట్రీ 3.38 శాతం, కోఫోర్జ్ 3.38 శాతం లాభపడ్డాయి.
సెన్సెక్స్ నేడు ఆల్ టైమ్ హై 44,271.15ని తాకింది. 43,747.22 స్థాయికి పడిపోయి, చివరకు 44,077 పాయింట్ల వద్ద ముగిసింది.