RBI నిర్ణయం ఎఫెక్ట్: 45,000 వద్ద సెన్సెక్స్, నిఫ్టీ సరికొత్త రికార్డ్
ముంబై: స్టాక్ మార్కెట్లు శుక్రవారం (డిసెంబర్ 4) భారీ లాభాల్లో ముగిశాయి. సూచీలు వరుసగా 5వ వారం లాభాల్లో క్లోజ్ అయ్యాయి. సూచీలు నేడు మరో సరికొత్త జీవనకాల గరిష్టాన్ని తాకాయి. సెన్సెక్స్ మొదటిసారి 45,000 పాయింట్ల క్రాస్ చేయగా, నిఫ్టీ 13,250 పాయింట్లను క్రాస్ చేసింది. నిఫ్టీ బ్యాంకు ఇండెక్స్ 2 శాతం ఎగిసిపడగా, మెటల్, ఇన్ఫ్రా, ఫార్మా, ఎఫ్ఎంసీజీ సూచీలు 1 శాతం వరకు లాభపడ్డాయి. అల్ట్రాటెక్ సిమెంట్స్, ఐసీఐసీఐ బ్యాంకు స్టాక్స్ 4 శాతానికి పైగా లాభపడ్డాయి.
కస్టమర్ల సేవలకు ఇబ్బందిలేదు: RBI ఆదేశాలపై HDFC, అసలేం జరిగింది?

టాప్ గెయినర్స్, టాప్ లూజర్స్
సెన్సెక్స్ 446.90 పాయింట్లు(1%) శాతం లాభపడి 45,079.55 పాయింట్ల వద్ద, నిఫ్టీ 124.60 పాయింట్లు(0.95%) లాభపడి 13,258.50 పాయింట్ల వద్ద క్లోజ్ అయింది. 1483 షేర్లు లాభాల్లో, 1178 స్టాక్స్ లాభాల్లో ముగిశాయి. 138 షేర్లలో ఎలాంటి మార్పులేదు.
డాలర్ మారకంతో రూపాయి 73.77 వద్ద ట్రేడ్ అయింది. గురువారం నాడు రూపాయి 73.93 వద్ద క్లోజ్ అయింది. నేడు 12 పైసలు బలపడి ప్రారంభమైంది.
టాప్ గెయినర్స్ జాబితాలో హిండాల్కో 4.42 శాతం, ICICI బ్యాంకు 4.19 శాతం, అదానీ పోర్ట్స్ 4.11 శాతం, అల్ట్రా టెక్ సిమెంట్స్ 4.04 శాతం, సన్ ఫార్మా 3.79 శాతం లాభాల్లో ముగిశాయి.
టాప్ లూజర్స్ జాబితాలో రిలయన్స్ 0.88 శాతం, HDFC లైఫ్ 0.73 శాతం, బజాజ్ ఫిన్సర్వ్ 0.68 శాతం, HCL టెక్ 0.43 శాతం, BPCL 0.41 శాతం నష్టపోయింది.
నేటి మోస్ట్ యాక్టివ్ స్టాక్స్‌లో ఎస్బీఐ, ఐసీఐసీఐ బ్యాంకు, మారుతీ సుజుకీ, హెచ్డీఎఫ్సీ బ్యాంకు, బజాజ్ ఫైనాన్స్ ఉన్నాయి.

స్టాక్స్.. రంగాలు
అన్ని రంగాలు కూడా లాభాల్లో ముగిశాయి. నిఫ్టీ నిఫ్టీ బ్యాంకు వరుసగా 5వ వారం లాభాల్లో ముగిశాయి. నిఫ్టీ మిడ్ క్యాప్, స్మాల్ క్యాప్ కూడా 5వ వారం లాభపడ్డాయి. నిఫ్టీ పీఎస్‌యూ బ్యాంక్ జూన్ 7వ తేదీ తర్వాత భారీ లాభాలను నమోదు చేసింది. నిఫ్టీ రియాల్టీ అక్టోబర్ 25 వతేదీ తర్వాత భారీ లాభాలు నమోదు చేసింది. నిఫ్టీ మెటల్, ఆటో జూన్ 7వ తేదీ తర్వాత వారంలో మంచి లాభాలు నమోదు చేసింది.
రంగాలవారీగా చూస్తే నిఫ్టీ 50 స్టాక్స్ 0.95 శాతం, నిఫ్టీ 0.53 శాతం లాభపడ్డాయి. నిఫ్టీ ఆటో 0.62 శాతం, నిఫ్టీ బ్యాంకు 2.05 శాతం, నిఫ్టీ ఫైనాన్షియల్ సర్వీసెస్ 1.04 శాతం, నిఫ్టీ ఎఫ్ఎంసీజీ 1.40 శాతం, నిఫ్టీ ఐటీ 0.48 శాతం, నిఫ్టీ మీడియా 0.10 శాతం, నిఫ్టీ మెటల్ 1.13 శాతం, నిఫ్టీ ఫార్మా 1.20 శాతం, నిఫ్టీ పీఎస్‌యూ బ్యాంకు 1.49 శాతం, నిఫ్టీ రియాల్టీ 1.14 శాతం, నిఫ్టీ ప్రయివేటు బ్యాంకు 2 శాతం లాభపడ్డాయి.
కేవలం నిఫ్టీ ఎనర్జీ 0.10 శాతం నష్టపోయింది.
రిలయన్స్ స్టాక్ 0.83 శాతం నష్టపోయి రూ.1947.70 వద్ద క్లోజ్ అయింది.

మార్కెట్ లాభాలకు కారణం
రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వడ్డీ రేట్లను యథాతథంగా ఉంచింది. అలాగే జీడీపీ వృద్ధి రేటు అంచనాను 2020-21 ఆర్థిక సంవత్సరానికి గాను మైనస్ 9.5 శాతం నుండి మైనస్ 7.5 శాతానికి సవరించింది. ఇది మార్కెట్లకు కొత్త ఊపు తీసుకు వచ్చింది. కరోనా రికవరీలు పెరగడం, కేసులు భారీగా తగ్గడం ఇన్వెస్టర్ల సెంటిమెంటుకు కలిసి వచ్చింది. అంతర్జాతీయ మార్కెట్లు కూడా సానుకూలంగా ఉన్నాయి. ప్రధానంగా ఆర్థిక వృద్ధిని వివిధ సంస్థలు గతంలో కంటే కాస్త సానుకూలంగా అంచనా వేయగా, ఇప్పుడు ఆర్బీఐ కూడా సవరించడం కలిసి వచ్చింది.