రికార్డ్‌కు సమీపంలో సెన్సెక్స్, నిఫ్టీ, రిలయన్స్ హైజంప్: మార్కెట్‌పై అమెరికా ఎఫెక్ట్
ముంబై: స్టాక్ మార్కెట్లు శుక్రవారం భారీ లాభాల్లో ముగిశాయి. అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో డెమోక్రటిక్ అభ్యర్థి జోబిడెన్ గెలుపు దాదాపు ఖాయమైనట్లుగా కనిపిస్తోంది. దీంతో అమెరికా సహా అంతర్జాతీయ మార్కెట్లు లాభాల్లో ఉన్నాయి. ఆసియా మార్కెట్లు కూడా రాణించాయి. ఇక, భారత మార్కెట్లు వరుసగా 5వ రోజు లాభాలు నమోదు చేశాయి. ఈ వారమంతా మార్కెట్లు లాభపడ్డాయి. నేడు (నవంబర్ 6) సెన్సెక్స్ 552.90 పాయింట్లు(1.34%) లాభపడి 41,893.06 వద్ద, నిఫ్టీ 143.20 పాయింట్లు(1.18%) ఎగిసి 12,263.50 పాయింట్ల వద్ద క్లోజ్ అయింది. 1478 షేర్లు లాభాల్లో, 1106 షేర్లు నష్టాల్లో ముగియగా, 186 షేర్లలో మార్పులేదు.
2009 తర్వాత.. ఈసారి వేతన పెంపు ఎంత ఉందంటే: 2021లో శాలరీ పెంచే కంపెనీలు 87%

పుంజుకుంటున్న రిలయన్స్
ఈ వారం ప్రారంభంలో భారీగా పతనమైన రిలయన్స్ స్టాక్ ఈ రోజు మరింత ఎగిసింది. సెప్టెంబర్ త్రైమాసికం ఫలితాల అనంతరం రూ.1900 మార్క్ దిగువకు పడిపోయిన స్టాక్, పెట్టుబడులు సమీకరించిన వార్తల నేపథ్యంలో లాభపడింది. నిన్న సౌదీ సంస్థ రిలయన్స్ రిటైల్‌లో ఇన్వెస్ట్ చేసింది. నేడు రిలయన్స్ స్టాక్ 3.58 శాతం లాభపడి రూ.2.025 వద్ద ముగిసింది. నాలుగు రోజుల తర్వాత రూ.2వేల మార్క్‌ను క్రాస్ చేసింది.
సెన్సెక్స్ ఈ వారం 2300 పాయింట్లు లాభపడింది. నిన్నటి వరకు 1700 పాయింట్లకు పైగా లాభపడిన సెన్సెక్స్ ఈ రోజు మరో 550 పాయింట్లకు పైగా ఎగిసింది.
నిఫ్టీ కరోనా ముందు 12100 స్థాయిని దాటింది.

టాప్ గెయినర్స్.. టాప్ లూజర్స్
టాప్ గెయినర్స్ జాబితాలో బజాజ్ ఫిన్ సర్వ్ (3.82 శాతం), రిలయన్స్ (3.79 శాతం), ఇండస్ఇండ్ బ్యాంకు (3.39 శాతం), హెచ్డీఎఫ్సీ బ్యాంకు (3.03 శాతం), కొటక్ మహీంద్ర బ్యాంకు (2.54 శాతం) ఉన్నాయి.
టాప్ లూజర్స్ జాబితాలో మారుతీ సుజుకీ, గెయిల్, భారతి ఎయిర్ టెల్, అల్ట్రా టెక్ సిమెంట్, ఏషియన్ పేయింట్స్ ఉన్నాయి.
మోస్ట్ యాక్టివ్ స్టాక్స్‌లో రిలయన్స్, హెచ్డీఎఫ్సీ బ్యాంకు, ఇండస్ఇండ్ బ్యాంకు, బజాజ్ ఫైనాన్స్, ఎస్బీఐ ఉన్నాయి.
నిఫ్టీ ఆటో 0.13 శాతం, నిఫ్టీ బ్యాంకు 1.85 శాతం, నిఫ్టీ ఎనర్జీ 1.07 శాతం, నిఫ్టీ ఫైనాన్షియల్ సర్వీసెస్ 1.85 శాతం, నిఫ్టీ ఐటీ 0.50 శాతం, నిఫ్టీ మీడియా 0.05 శాతం, నిఫ్టీ మెటల్ 0.47 శాతం, నిఫ్టీ పీఎస్‌యూ బ్యాంకు 0.56 శాతం, నిఫ్టీ రియాల్టీ 1.07 శాతం, నిఫ్టీ ప్రయివేటు బ్యాంకు 2.12 శాతం లాభపడ్డాయి.
నిఫ్టీ ఎఫ్ఎంసీజీ 0.10 శాతం, నిఫ్టీ ఫార్మా 0.70 శాతం నష్టపోయాయి.

రికార్డ్ గరిష్టానికి చేరువలో సెన్సెక్స్, నిఫ్టీ
మార్కెట్లు వరుసగా ఐదో రోజు లాభపడ్డాయి.
మార్కెట్లు పది నెలల గరిష్టానికి చేరుకున్నాయి. నేడు సెన్సెక్స్, నిఫ్టీ ఒక్కో శాతం చొప్పున పెరిగాయి.
నిఫ్టీ రికార్డ్ హై నుండి కేవలం 200 పాయింట్ల దూరంలో ఉంది.
సెన్సెక్స్ రికార్డ్ గరిష్టానికి 500 పాయింట్ల దూరంలో ఉంది.
నిఫ్టీ బ్యాంకు 486 పాయింట్లు పెరిగి 26,799, మిడ్ క్యాప్ సూచీ 126 పాయింట్లు ఎగిసి 17,803 పాయింట్ల వద్ద ముగిసింది.
నిఫ్టీ స్టాక్స్‌లో 31 లాభాల్లో ముగిశాయి.
రిలయన్స్, హెచ్‌డీఎఫ్‌సీలు నిఫ్టీ లాభంలో 50 శాతం కవర్ చేశాయి.

ఈ వారం ఎలా లాభపడిందంటే
ఈ వారం నిఫ్టీ బ్యాంకు 12.1 శాతం లాభపడింది. గత 8 నెలల్లో బ్యాంకింగ్ స్టాక్‌కు ఇదే అత్యధికం.
ఈ వారం సెన్సెక్స్ 5.7 శాతం, నిఫ్టీ 5.3 శాతం లాభపడ్డాయి. గత 5 నెలల కాలంలో ఇదే అత్యధికం.
ఈ వారం మిడ్ క్యాప్ సూచీలు 4.3 శాతం లాభపడ్డాయి. 5 నెలల కాలంలో ఇది అత్యధికం.
ఈ వారం రియాల్టీ మినహాయించి అన్ని రంగాలు లాభాల్లో ముగిశాయి. నిఫ్టీ పీఎస్‌యూ బ్యాంకింగ్ మంచి లాభాల్లో ముగిసింది.
ఈ వారం 43 నిఫ్టీ స్టాక్స్ లాభపడ్డాయి. ఇండస్ఇండ్ బ్యాంకు, ఎస్బీఐ, బజాజ్ ఫైనాన్స్, బజాజ్ ఫిన్ సర్వ్ టాప్ గెయినర్స్‌గా ఉన్నాయి.