For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

రెండో ఉద్దీపన ప్యాకేజీపై నిర్మలమ్మ యూటర్న్: నష్టం అంచనా: రాష్ట్రాలతో సంప్రదింపులు

|

న్యూఢిల్లీ: దేశంలో కరోనా వైరస్ విలయతాండవం చేస్తోంది. రోజూ మూడున్నర నుంచి నాలుగు వేల మంది మృత్యువాత పడుతున్నారు. కొత్తగా 3,617 మంది పేషెంట్లు కరోనాకు బలి అయ్యారు. కంటికి కనిపించని ఈ మహమ్మారి వ్యాప్తి చెందడాన్ని నివారించడానికి దాదాపు అన్ని రాష్ట్రాలు లాక్‌డౌన్‌లోకి జారుకున్నాయి. సంపూర్ణ లాక్‌డౌన్‌ను అమలు చేస్తోన్నాయి. ఈ పరిణామాలతో ఆయా రాష్ట్రాల ఆర్థిక వనరులు దెబ్బతిన్నాయి. రాబడి క్షీణించింది. రెండు తెలుగు రాష్ట్రాలు కూడా మినహాయింపు కాదు. పైగా దాదాపు అన్ని రాష్ట్రాలు కూడా కేంద్రం నుంచి జీఎస్టీ బకాయిలను ఎదుర్కొంటోన్నాయి.

ఉద్దీపన ప్యాకేజీ పేరుతో ఊరించి..

ఉద్దీపన ప్యాకేజీ పేరుతో ఊరించి..

ఈ పరిణామాల మధ్య కేంద్ర ఆర్థికమంత్రిత్వ శాఖ రెండో ఉద్దీపన ప్యాకేజీని తెరమీదికి తీసుకొచ్చింది. తొలిదశలో ప్రకటించిన 20 లక్షల కోట్ల రూపాయల మేర ప్యాకేజీ తరహాలోనే ఇదీ ఉండొచ్చంటూ మొదట్లో వార్తలొచ్చాయి. తొలిదశతో పోల్చుకుంటే.. కరోనా వైరస్ సెకెండ్ వేవ్ మరింత దారుణంగా అన్ని రంగాలనూ దెబ్బకొడుతోన్న ప్రస్తుత పరిస్థితుల్లో మరో ఉద్దీపన ప్యాకేజీని తీసుకుని రావాల్సిన అవసరాన్ని ఆర్థికశాఖ గుర్తించిందని, ఈ దిశగా కసరత్తు చేస్తోందంటూ లీకులు వెలువడ్డాయి. కరోనా ప్రభావం తీవ్రంగా కనిపించిన సెక్టార్ల గురించి ఆ శాఖ అధికారులు అంచనాలు వేస్తోన్నారని, త్వరలోనే దీన్ని ప్రకటిస్తారంటూ మీడియాలో కథనాలు వెలువడ్డాయి.

ఇప్పట్లో ఉండదు..

ఇప్పట్లో ఉండదు..

దీనిపై ఆర్థికశాఖ ఎట్టకేలకు ఓ స్పష్టత ఇచ్చింది. ఇప్పట్లో ఎలాంటి ఆర్థిక ఉద్దీపన ప్యాకేజీ ఉండబోదని తెలిపింది. కరోనా వైరస్ సెకెండ్ వేవ్ ప్రభావం తగ్గిన తరువాత దీనిపై ఓ నిర్ణయానికి వస్తామని తెలిపింది. ఈ ప్యాకేజీ రూపురేఖలు ఎలా ఉండాలి? ఏఏ రంగాలకు ప్రాధాన్యతలను ఇవ్వాల్సి ఉంటుందనే విషయంపై రాష్ట్రాలను సంప్రదించాల్సి ఉందని పేర్కొంది. దీనిపై త్వరలోనే ఆర్థికశాఖ మంత్రి నిర్మల సీతారామన్.. ఆయా రాష్ట్రాల ముఖ్యమంత్రులు లేదా ఆర్థిక మంత్రులతో సంప్రదింపులు చేపడతారని స్పష్టం చేసింది.

రాష్ట్రాలను సంప్రదించాల్సి ఉంది..

రాష్ట్రాలను సంప్రదించాల్సి ఉంది..

సెకెండ్ వేవ్ తీవ్రత కొనసాగుతోన్న ప్రస్తుత పరిస్థితుల్లో నష్టాన్ని అంచనా వేయడం కష్టతరమని, అందుకే- అదుపులో వచ్చిన తరువాతే అది సాధ్యపడుతుందని స్పష్టం చేసింది. గత ఏడాది తరహాలో దేశవ్యాప్తంగా ఒకేసారి లాక్‌డౌన్‌ కావట్లేదు. రాష్ట్రాలే ఆ నిర్ణయాన్ని తీసుకుంటున్నాయి. కరోనా వైరస్ పాజిటివ్ కేసుల సంఖ్య అధికంగా ఉన్న రాష్ట్రాలు సొంతంగా లాక్‌డౌన్‌ను అమలు చేస్తోన్నాయి. ఇందులో కేంద్ర ప్రభుత్వం జోక్యం చేసుకోలేదు. లాక్‌డౌన్ విధించాలా? వద్దా? అనేది రాష్ట్ర ప్రభుత్వాల నిర్ణయాల మీదికే వదిలేసింది. ఈ నేపథ్యంలో- తాము ఏ స్థాయిలో నష్టపోయామనే విషయాన్ని లాక్‌డౌన్‌ను అమలు చేస్తోన్న రాష్ట్రాలే అంచనా వేసుకుంటోన్నాయి.

నష్టం అంచనా కోసం త్వరలో సంప్రదింపులు

నష్టం అంచనా కోసం త్వరలో సంప్రదింపులు

దీనివల్ల ఆయా రాష్ట్రాలను సంప్రదించిన తరువాతే ఉద్దీపన ప్యాకేజీని రూపొందించే అవకాశం ఉందని కేంద్ర ఆర్థిక మంత్రిత్వశాఖ స్పష్టం చేసింది. దీనిపై త్వరలోనే తాము ఆయా రాష్ట్రాల ప్రభుత్వాలతో సంప్రదింపులు మొదలుపెడతామని పేర్కింది. కరోనా తీవ్రత, లాక్‌డౌన్ వల్ల ఏర్పడిన నష్టం, ఆర్థిక లోటు వంటి పరిస్థితుల తీవ్రతను అర్థం చేసుకుని, దానికి అనుగుణంగా ఉద్దీపన ప్యాకేజీని రూపొందించాల్సి ఉంటుందని నిర్మల సీతారామన్ అభిప్రాయపడుతున్నట్లు తెలిపారు. ఈ విషయంలో గత ఏడాదిలాగే నీతి ఆయోగ్‌ సహకారాన్ని తీసుకోవాలని కూడా భావిస్తున్నట్లు చెప్పారు.

English summary

Second fiscal stimulus: FM Nirmala Sitharaman yet to take a call

Finance Minister Nirmala Sitharaman made it clear that the decision to grant yet another fiscal stimulus to the industry will be taken only after an assessment of the impact of the second wave of the COVID-19 pandemic is completed.
Story first published: Saturday, May 29, 2021, 17:10 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X