i
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

SBI Card: కరోనా ఎఫెక్ట్, గ్రే మార్కెట్లో భారీగా పడిపోయిన ప్రీమియం

|

స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఎస్బీఐ కార్డ్స్ పబ్లిక్ ఇష్యూ పట్ల ఆసక్తి అంతగా లేదా అంటే అవుననే అంటున్నారు. ఇండియాలో రెండు కరోనా కేసులు నమోదు కావడంతో స్టాక్ మార్కెట్లు అమ్మకాల ఒత్తిడిని ఎదుర్కొంటున్నాయి. దీంతో ఇటీవలి వరకూ అనధికార(గ్రే) మార్కెట్లో భారీ ప్రీమియం పలికిన ఎస్బీఐ కార్డ్స్ ప్రస్తుతం వెనకడుగు వేస్తున్నట్లు చెబుతున్నారు.

కరోనా వైరస్ కారణంగా గత వారం రోజులుగా జాతీయ, అంతర్జాతీయ స్టాక్ మార్కెట్లు నష్టాలను చవిచూస్తున్నాయి. ఈ సెంటిమెంట్ ఎస్బీఐ కార్డ్స్ పైన కూడా పడింది. ఎస్బీఐ కార్డ్స్ ఐపీవోకి రావడానికి వారం రోజుల ముందు గ్రే మార్కెట్లో ఒక్కో షేర్ రూ.380 నుండి రూ.390 ప్రీమియం పలికింది. మంగళవారం ప్రీమియం 65 శాతం పతనమైనట్లుగా తెలుస్తోంది.

SBI Cards IPO: ఐపీవో ధరల శ్రేణి ఎంత, ఇష్యూకు దరఖాస్తు చేసుకోవచ్చా?

కరోనా ఎఫెక్ట్, గ్రే మార్కెట్లో భారీగా పడిపోయిన ప్రీమియం

దీంతో షేర్ రూ.130 నుండి రూ.140 ప్రీమియం మాత్రమే నమోదవుతున్నట్లుగా చెబుతున్నారు. అధికంగా రూ.190 వరకు ఆఫర్ చేస్తున్నట్లుగా తెలుస్తోంది. కరోనా భయాలు ఎస్బీఐ కార్డ్స్ ఐపీవో పట్ల పెట్టుబడిదారుల్లో ఆసక్తి తగ్గినట్లుగా నిపుణులు భావిస్తున్నారు.

కానీ మార్కెట్లు రికవరీ సాధిస్తే తిరిగి ప్రీమియం పుంజుకునే వీలుందని చెబుతున్నారు. గ్రే మార్కెట్ ప్రీమియం ద్వారా కాకుండా ఐపీవోకు ఎన్ని రెట్లు అధికంగా ధరఖాస్తులు వచ్చాయనే అంశం ఆధారంగా లిస్టింగ్ ధరను అంచనా వేయగలమని మరికొంతమంది మార్కెట్ నిపుణులు అంటున్నారు.

Read more about: sbi sbi card ipo ఎస్బీఐ
English summary

SBI Card bulls press panic button in unlisted market

Even as the SBI Card IPO mops up solid subscriptions gradually, unlisted shares of the company have taken a knock in the unofficial market for trading in such shares.
Story first published: Tuesday, March 3, 2020, 16:04 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X