డాలర్ మారకంతో రూపాయి ఆల్ టైమ్ కనిష్టం 77.69
డాలర్ మారకంతో రూపాయి వ్యాల్యూ నేడు (మంగళవారం, మే 17) భారీగా పడిపోయింది. నేడు ప్రారంభ ట్రేడింగ్‌లో డాలర్ మారకంతో రూపాయి ఆల్ టైమ్ కనిష్టం 77.69 వద్దకు చేరుకుంది. వడ్డీ రేట్లు పెరుగుతాయా లేదా అనే అంశంపై ఇన్వెస్టర్లు అయోమయంలో ఉన్నారు. మరోవైపు సిక్స్ బాస్కెట్ కరెన్సీలో డాలర్ వ్యాల్యూ క్రమంగా పెరుగుతోంది. వ్యాపారులు నిధుల ప్రవాహాల కోసం దేశీయ షేర్ మార్కెట్ వైపు చూస్తున్నారు. డాలర్ వ్యాల్యూ మరింత పెరిగితే రూపాయి మరింతగా క్షీణించే అవకాశాలు లేకపోలేదు.
గ్రీన్ బ్యాక్ ఈ వారం రెండు దశాబ్దాల గరిష్టస్థాయికి చేరుకుంది. యూఎస్ బాండ్ యీల్డ్స్ కూడా పెరుగుతున్నాయి. అమెరికా కరెన్సీ డాలర్ మారకంతో రూపాయి ఇంట్రాడేలో బలహీనంగా 77.63 స్థాయిని తాకిన అనంతరం, రూపాయి మంగళవారం ప్రారంభ ట్రేడింగ్‌లో 14 పైసలు క్షీణించి 77.69కి పడిపోయింది.

ఇంటర్ బ్యాంక్ ఫారెన్ ఎక్స్చంజ్ వద్ద డాలర్‌తో రూపాయి 77.67 వద్ద బలహీనంగా ప్రారంభమైంది. ఆ తర్వాత మరింత క్షీణించి 77.69కి పడిపోయింది. దేశీయ కరెన్సీ కూడా ప్రారంభ డీల్స్‌లో డాలర్‌తో పోలిస్తే ఇంట్రా-డేలో కనిష్టస్థాయి 77.71ని తాకింది. నష్టాలను అరికట్టేందుకు ఆర్బీఐ బహిరంగ మార్కెట్లో జోక్యం చేసుకున్నది. దీంతో శుక్రవారం కరెన్సీ కోలుకొని 77.31 వద్ద ముగిసింది. బుద్ధ పౌర్ణమ సెలవుదినం సందర్భంగా దేశంలోని ఇంటర్ బ్యాంకు విదేశీ మారకద్రవ్య మార్కెట్ సోమవారం క్లోజ్ ఉంది.