ఏడాదిన్నరలో రూపాయి దారుణ పతనం, ఏకంగా 104 పైసలు డౌన్
ముంబై: డాలర్ మారకంతో రూపాయి వ్యాల్యూ భారీగా క్షీణించింది. గత 19 నెలల కాలంలో తొలిసారి దారుణంగా పతనమైంది. నేడు భారత రూపాయితో పాటు ఈక్విటీ మార్కెట్ కూడా దారుణంగా పతనమైంది. ఆసియా, అంతర్జాతీయ మార్కెట్లు తీవ్ర నష్టాల్లో ఉండటంతో ఆ ప్రభావం మన ఈక్విటీ మార్కెట్లపై పడింది. దీంతో సెన్సెక్స్ నేడు 1,939 పాయింట్లు లేదా 3.80 శాతం నష్టపోయి 49,099.99 వద్ద, నిఫ్టీ 568 పాయింట్లు లేదా 3.76 శాతం నష్టపోయి 14,529.15 పాయింట్ల వద్ద ముగిశాయి. డొమెస్టిక్ మార్కెట్ అమ్మకాల ఒత్తిడి ఎదుర్కోవడంతో రూపాయి కూడా పతనమైంది.
అభిబస్ టిక్కెట్ బుకింగ్: మరింత సులభంగా IRCTCలోను టిక్కెట్ బుకింగ్
అమెరికా డాలర్ మారకంతో రూపాయి 104 పైసలు క్షీణించి 73.47 వద్ద క్లోజ్ అయింది. డొమెస్టిక్ ఈక్విటీ మార్కెట్లో అమ్మకాలు వెల్లువెత్తడం, ఓవర్సీస్ మార్కెట్లో అమెరికన్ కరెన్సీ బలంగా ఉండటంతో రూపాయి పతనమైంది. 19 నెలల్లో రూపాయికి ఇది దారుణమైన పతనం. ప్రారంభం నుండి రూపాయి బలహీనంగానే కదలాడింది. గురువారం రూపాయి 72.43 వద్ద క్లోజ్ అయింది.

స్టాక్ మార్కెట్లు కూడా నేడు భారీ నష్టాల్లో ముగిశాయి. సెన్సెక్స్ ఏకంగా 1,939 పాయింట్లు నష్టపోగా, నిఫ్ట 14,430 పాయింట్ల దిగువన ముగిసింది. క్రితం సెషన్లో 51,000కు పైగా ఉన్న సెన్సెక్స్ ఏకంగా 49,000 పాయింట్లకు పడిపోయింది. అన్ని రంగాలు కూడా భారీగా పతనం అయ్యాయి. దీంతో శుక్రవారం స్టాక్ మార్కెట్లు మరో బ్లాక్ ఫ్రైడేను చూశాయి. సూచీలు ఒకే రోజు మూడు శాతానికి పైగా నష్టపోయాయి.