For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

ఆసియా దేశాల్లో రూపాయి అత్యంత చెత్త ప్రదర్శన! పాక్ రుపీ, బంగ్లా టాకా పరిస్థితి ఇదీ..

|

ఆర్థికవృద్ధి తగ్గుదల, ద్రవ్యోల్భణం పెరుగుదల కారణంగా రూపాయి మారకపు రేటుపై ఒత్తిడి పడుతోంది. గత సంవత్సరం ఆసియా దేశాల్లో వరస్ట్ ప్రదర్శన చేసిన కరెన్సీలలో రూపాయి ఉండటం ఆందోళన కలిగించే అంశం. దక్షిణ కొరియా వోన్, పాకిస్తాన్ రూపాయిని మినహాయించి మన కరెన్సీ పడిపోయింది.

మరో బ్యాంకు మోసం: 14 బ్యాంకులకు రూ.3,600 కోట్లు ఎగవేత

రూపాయి 2 శాతం, చైనీస్ కరెన్సీ 0.4 శాతం పడిపోయింది

రూపాయి 2 శాతం, చైనీస్ కరెన్సీ 0.4 శాతం పడిపోయింది

2019 జనవరి ప్రారంభం నుంచి చూస్తే అమెరికా డాలరుతో రూపాయి మారకం విలువ 2 శాతం మేర పడిపోయింది. అదే సమయంలో అమెరికా డాలరుతో పోలిస్తే థాయి బాహ్త్ 6.3 శాతం, మలేషియా రింగిట్ 1.5 శాతం, పిలిఫ్పైన్స్ పెసో 3 శాతం పడిపోయాయి. గత ఏడాది కాలంగా చైనీస్ రెన్మింబీ 0.4 శాతం పడిపోయింది.

కారణమిదే

కారణమిదే

భారత్‌లో ఆర్థికమాంద్యం ఊహించిన దాని కంటే చాలా ఎక్కువగా ఉందని, ఈ కారణంగా రూపాయి పడిపోయిందనేది ఆర్థికవేత్తలు అభిప్రాయం. కరెన్సీ బలానికి, ఆర్థికవృద్ధికి సంబంధం ఉంటుంది. భారత్ స్థూల జాతియోత్పత్తి వృద్ధిలో భారీ పతనం కనిపించింది. దీంతో కరెన్సీపై ఒత్తిడి పెరిగిందని చెబుతున్నారు.

2008లో 20 శాతం క్షీణించిన రూపాయి వ్యాల్యూ

2008లో 20 శాతం క్షీణించిన రూపాయి వ్యాల్యూ

2019 క్యాలెండర్ ఇయర్లో ఈక్విటీ, డెబ్ట్ మార్కెట్లోకి 2 బిలియన్ల వ్యాల్యూ కలిగిన ఫారెన్ క్యాపిటల్ పెట్టుబడులు వచ్చినప్పటికీ రూపాయి విలువ క్షీణించిందని ఎక్వినోమిక్స్ రీసెర్చ్ అండ్ అడ్వైజరీ సర్వీసెస్ మేనేజింగ్ డైరెక్టర్ అండ్ ఫౌండర్ చొక్కలింగం అన్నారు. మూలధన ప్రభావం రూపాయిపై పడిందన్నారు. ఉదాహరణకు 2008లో లెహమాన్ సంక్షోభం సమయంలో రూపాయి విలువ 20 శాతం పడిపోయిందన్నారు. గత సెప్టెంబర్‌లో కార్పోరేట్ పన్ను ట్యాక్స్ తగ్గించిన అనంతరం మూలధన ప్రవాహం మెరుగుపడిందన్నారు. అప్పుడు స్టాక్స్ ర్యాలీ అయ్యాయని చెప్పారు.

బంగ్లాదేశ్ టాకా మెరుగు..

బంగ్లాదేశ్ టాకా మెరుగు..

డేటా ప్రకారం ఇప్పుడు భారత రూపాయి కంటే బంగ్లాదేశ్ టాకా మెరుగ్గా ఉంది. టాకా గత 12 నెలల్లో 1.5 శాతం తగ్గింది. భారత రూపాయిని 100 బేసిస్ పాయింట్స్ అధిగమించింది.

పాకిస్తాన్, దక్షిణ కొరియా కరెన్సీ భారీగా పడిపోయింది

పాకిస్తాన్, దక్షిణ కొరియా కరెన్సీ భారీగా పడిపోయింది

పాకిస్తాన్ రూపాయి మాత్రం అత్యంత చెత్త ప్రదర్శన చేసింది. గత 12 నెలల్లో పాకిస్తాన్ రూపాయి 9.5 శాతం మేర పడిపోయింది. డాలరు మారకంతో పాకిస్తాన్ రూపాయి 154.4 వద్ద ట్రేడ్ అవుతోంది. ఏడాది క్రితం ఇది 139.8గా ఉంది. పాకిస్తాన్ తర్వాత దక్షిణ కొరియా కరెన్సీ వోన్ భారీగా పడిపోయింది. ఇది ఏడాదిలో 5 శాతం మేర పడిపోయింది. డాలరు మారకంతో ఇది 1,167.1 వద్ద ట్రేడ్ అవుతోంది.

వృద్ధి రేటు

వృద్ధి రేటు

2019-20 ఆర్థిక సంవత్సరంలో భారత్ వృద్ధి రేటు 5 శాతంగా ఉంటుందని అంచనా. వేగంగా అభివృద్ధి చెందుతన్న దేశాల్లో భారత్ వృద్ధి రేటు 2019లో గణనీయంగా పడిపోయింది. కాగా, డేటా ప్రకారం అత్యధిక ఆదాయం, ట్రేడ్ సెన్సిటివ్ సిటీలలో హాంగ్‌కాంగ్, సింగపూర్ ఉన్నాయి. చైనీస్‌కు వ్యతిరేకంగా ఆందోళనల కారణంగా హాంగ్‌కాంగ్, గ్లోబల్ ట్రేడ్ వ్యాల్యూమ్ తగ్గడంతో సింగపూర్‌లపై ప్రభావం పడింది.

పాకిస్తాన్ పరిస్థితి దారుణమే.. ఆసియా దేశాల కరెన్సీ ఇలా..

పాకిస్తాన్ పరిస్థితి దారుణమే.. ఆసియా దేశాల కరెన్సీ ఇలా..

ఆసియా దేశాల్లో 2019లో పాకిస్తాన్ వృద్ధి రేటు గత ఏఢాది కంటే దారుణంగా పడిపోనుంది. 2018లో 5.5 శాతం ఉండగా, ఈసారి 3.3 శాతానికి పడిపోనుందని అంచనా. అయితే సౌత్ ఈస్ట్ ఆసియాలో మాత్రం వృద్ధి రేటు క్షీణత కాస్త తక్కువగా ఉంది. ఇండోనేషియా ఎకానమీ 5 శాతానికి పెరగనుందని అంచనా. ఫిలిప్సీన్, వియత్నా, చైనా, బంగ్లాదేశ్‌లలో 50 బేసిస్ పాయింట్లు, 20 బేసిస్ పాయింట్లు, 40 బేసిస్ పాయింట్లు, 10 బేసిస్ పాయింట్లు, సౌత్ కొరియాలో 70 బేసిస్ తగ్గే అవకాశముంది. భారత రూపాయి గత ఐదేళ్లలో నాలుగు సంవత్సరాలు నష్టపోయింది. గత పదేళ్లలో ఎనిమిదిసార్లు నష్టపోయింది.

English summary

Rupee one of the worst performers among its Asian peers in the past 1 year

A sharp deceleration in economic growth and surge in inflation have begun to weigh on the rupee exchange rate. The Indian rupee has become one of the worst performers among its Asian peers in the past one year, with the exception of the South Korean won and the Pakistani rupee.
Story first published: Thursday, January 23, 2020, 11:01 [IST]
Company Search
Thousands of Goodreturn readers receive our evening newsletter.
Have you subscribed?
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Goodreturns sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Goodreturns website. However, you can change your cookie settings at any time. Learn more