For Daily Alerts
వివాద్ సే విశ్వాస్లో రూ.97వేల కోట్ల కేసులు పరిష్కారం
|
వివాద్ సే విశ్వాస్ స్కీం కింద రూ.97,000 కోట్ల విలువైన పన్ను వివాదాలు పరిష్కారమయ్యాయని రెవిన్యూ శాఖ వర్గాలు రెండు రోజుల క్రితం తెలిపాయి. ఇప్పటి వరకు వివాద్ సే విశ్వాస్ పథకాన్ని 1,25,144 కేసులు ఎంచుకున్నాయని మొత్తం 5,10,491 దీర్ఘకాల పెండింగ్ కేసుల్లో ఇవి 24.5 శాతమని ఈ వర్గాలు వెల్లడించాయి.
వివాద్ సే విశ్వాస్ పథకానికి మంచి స్పందన వస్తోందని, ఇప్పటి వరకు రూ.97,000 కోట్లకు పైగా పన్ను వివాదాలు సెటిల్మెంట్ అయినట్లు తెలిపారు. ప్రత్యక్ష పన్ను వివాద తీర్మాన పథకం 2016తో పోల్చితే వివాద్ సే విశ్వాస్ పథకానికి పదిహేను రెట్లు అధిక స్పందన వచ్చిందన్నారు.

1998కి చెందిన కర్ వివాద్ సంవర్ధన్ (KVS) స్కీం కొన్ని వేల కేసులకు గాను రూ.739 కోట్ల వరకు రాబడితే, డీటీడీఆర్(డైరెక్ట్ ట్యాక్స్ డిస్పూట్ రిసొల్యూషన్ స్కీం) ద్వారా 8600 కేసులు, రూ.631 కోట్లు వచ్చాయి.
Comments
English summary
Rs 97k crore disputed sum offered for settlement under Vivad Se Vishwas
Story first published: Sunday, February 7, 2021, 20:30 [IST]