For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

అమెరికాలో జరిగింది... మన దగ్గరా జరుగుతుందా? రోబోట్స్ తో పెద్ద జాబ్స్ కూడా ఊష్ట్!

|

అగ్ర రాజ్యం అమెరికా అన్ని రంగాల్లోనూ రారాజే. ముఖ్యంగా టెక్నాలజీ లో అయితే తిరుగే లేదు. ఆపిల్ నుంచి అమెజాన్ వరకు... గూగుల్ నుంచి ఉబెర్ వరకు అన్ని వినూత్నమైన కంపెనీలకు కేర్ ఆఫ్ అడ్రస్ అమెరికానే. అలాంటి దేశంలో రోబోటిక్స్, ఆర్టిఫిషల్ ఇంటలిజెన్స్, ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్, క్లౌడ్ కంప్యూటింగ్, మెషిన్ లెర్నింగ్, బిగ్ డేటా అనలిటిక్స్ వంటి రంగాల్లో అపారమైన అవకాశాలు అందుబాటులోకి వచ్చాయి.

ఆ అవకాశాలను అందిపుచ్చుకొనేందుకు అమెరికా వారే కాకుండా ప్రపంచ వ్యాప్తంగా ఉన్న నిపుణులు రెక్కలు కట్టుకొని మరీ అమెరికాలో వాలే ప్రయత్నం చేస్తున్నారు. కానీ అమెరికా లో మాత్రం కొత్త ఒరవడి మొదలైంది. అది ఉద్యోగాల కోసం వేచి చూస్తున్నవారికి ఆందోళన కలిగిస్తోంది. అమెరికా స్టాక్ మార్కెట్లు, ఆర్థిక సేవల రంగంలో రోబోటిక్స్ రాకతో వేళల్లో ఉద్యోగాలు పోతున్నాయి. అదేదో చిన్నా చితకా జాబ్స్ కూడా కాదు. రోబోటిక్స్ దెబ్బకు పెద్ద పెద్ద జాబ్స్ కు కూడా ప్రమాదంలో పడిపోతున్నాయి. దీంతో అంతా ఆందోళన చెందుతున్నారు. భవిష్యత్ పై భయాందోళనలు వ్యక్తం చేస్తున్నారు.

6 లక్షల మందిపై ప్రమాదం...

6 లక్షల మందిపై ప్రమాదం...

రోబోటిక్స్ ఎంటరైనప్పుడు అవి కేవలం కింది స్థాయి జాబ్స్ ను మాత్రమే రీప్లేస్ (మార్పిడి) చేశాయి. కానీ ఆర్టిఫిషల్ ఇంటలిజెన్స్ వంటి వినూత్న సోలుషన్స్ రాక తో రోబోటిక్స్ అంచెలంచెలుగా ఎదుగుతోంది. ఫ్యాక్టరీల్లో వేళ మంది కార్మికులకు పని లేకుండా చేసిన రోబోటిక్స్... ఇప్పుడు అత్యున్నత హోదాలో పనిచేస్తున్నమేనేజర్ల కు కూడా ముప్పు తెస్తోంది. దీంతో ప్రస్తుతం ఒక్క అమెరికా లోనే ఆర్థిక సేవలు, ఇన్సూరెన్స్ రంగాల్లో సుమారు 6 లక్షల మందికి ప్రమాదం పొంచి ఉంది. ఈ విషయాన్ని ప్రముఖ వార్తా ఏజెన్సీ బ్లూమ్బెర్గ్ ఒక కథనంలో వెల్లడించింది. దీనికంతా ఒకటే కారణంగా కనిపిస్తోంది. రోబోటిక్స్ లో నెక్స్ట్ లెవెల్ టెక్నాలజీ పై ప్రస్తుతం ఉన్న ఉద్యోగుల్లో అవగాహన లేకపోవటం లేదా ఇలాంటి కొత్త తరహా టెక్నాలజీ లను వీలైనంత వేగంగా నేర్చుకోలేక పోవడం. కాపిటల్ మార్కెట్ల లో జరిగే ఎలక్ట్రానిక్ లావాదేవీల్లో ఉపయోగించే అల్గోరిథమ్స్ పై వీరికి శిక్షణ లేకపోవటం కూడా ఉద్యోగాలు పోయేందుకు కారణమవుతోంది. ఇలాంటి పనులన్నీ రొటోబిక్స్ లో ఆటోమేషన్ విధానం వల్ల చక చకా జరిగిపోతున్నాయి.

నాస్ డాక్ లో 40...

నాస్ డాక్ లో 40...

అమెరికాలోని ప్రముఖ స్టాక్ ఎక్స్చేంజి ల్లో నాస్ డాక్ కూడా ఒకటి. ఈ స్టాక్ ఎక్స్చేంజి లో లిస్ట్ ఐన కంపెనీలు, వాటి పనితీరు, డేటా పరిశీలన చేయటం అనేది ఒక పెద్ద పని. కంపెనీలు అన్ని రూల్స్ ఫాలో అవుతున్నాయో లేదో చూడాల్సిన అవసరం ఉంటుంది. ఇందుకోసం చాలా మంది ఉద్యోగులు పని చేయాల్సి ఉంటుంది. కానీ ప్రస్తుతం నాస్ డాక్ సుమారు 40 వరకు అల్గోరిథమ్స్ ఉపయోగిస్తోంది. దీంతో సుమారు 35,000 వరకు పారామీటర్స్ ను పరిశీలించగలుగుతోంది. కంపెనీల డేటా, మార్కెట్లో అవి ఎలాంటి అవకతవకలకు పాల్పడకుండా ఉండేందుకు ఇలాంటి స్మార్ట్ సోలుషన్స్ ఉపయోగించాల్సిందేనని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. కానీ ఈ ప్రాసెస్ లో చాలా మంది ఉగ్యోగాలు కోల్పోయే ప్రమాదం ఉంటుందని హెచ్చరిస్తున్నారు.

ఇండియా లోనూ ...

ఇండియా లోనూ ...

భారత దేశంలోనూ ఆర్టిఫిషల్ ఇంటలిజెన్స్, రోబోటిక్స్ ఉపయోగం పెరిగిపోతోంది. మన స్టాక్ మార్కెట్ల లోనూ ఈ తరహా అప్లికేషన్స్ వాడుతున్నారు. ఇటీవల నేషనల్ స్టాక్ ఎక్స్చేంజి (ఎన్ ఎస్ ఈ ) నిర్వహించిన ఒక ఇన్వెస్టిగేషన్ కూడా ఇలాంటి కొత్త తరహా టెక్నాలజీ ద్వారానే విజయవంతంగా పూర్తి చేసినట్లు విశ్లేషకులు పేర్కొంటున్నారు. హైదరాబాద్ కేంద్రంగా కార్యకలాపాలు సాగించే కార్వీ కుంభకోణం బయట పడింది కూడా ఇలాంటి టెక్నాలజీ ద్వారానే. మార్కెట్ రెగ్యూలేటర్ సెక్యూరిటీస్ అండ్ ఎక్స్చేంజి బోర్డు ఆఫ్ ఇండియా (సెబీ) .. కార్వీ పై నిషేధం విధించింది కూడా ఇలా నిర్వహించిన ఇన్వెస్టిగేషన్ ఆధారంగానే. అంటే... మన కాపిటల్ మార్కెట్లో కూడా రోబోటిక్స్, ఆర్టిఫిషల్ ఇంటలిజెన్స్ అమలు పెరిగిపోయిందని చెప్పడానికి ఇవే కొన్ని నిదర్శనాలు. అందుకే, అమెరికాలో జరుగుతున్నట్లే మన దేశం కూడా పెద్ద ఉద్యోగాలు పోకుండా ఉండాలంటే కొత్త తరహా టెక్నాలజీ లు నేర్చుకునేందుకు సిద్ధంగా ఉండాలని, లేదంటే మనకూ అమెరికా వంటి పరిస్థితి తప్పదని నిపుణులు సూచిస్తున్నారు.

English summary

Robots in finance could wipe out some of its highest-paying jobs

Robots have replaced thousands of routine jobs on Wall Street. Now, they’re coming for higher-ups. That’s the contention of Marcos Lopez de Prado, a Cornell University professor and the former head of machine learning at AQR Capital Management LLC, who testified in Washington on Friday about the impact of artificial intelligence on capital markets and jobs.
Story first published: Tuesday, December 10, 2019, 7:29 [IST]
Company Search
Thousands of Goodreturn readers receive our evening newsletter.
Have you subscribed?
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Goodreturns sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Goodreturns website. However, you can change your cookie settings at any time. Learn more