For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

కరోనా ఎఫెక్ట్: భారత్ కు తగ్గనున్న ఎన్నారై నిధులు.. ఎంతంటే?

|

ఏ దేశమేగినా... ఎందుకాలిడినా మన భారతీయులు ప్రతి ఏటా తమ కుటుంబాలకు పెద్ద మొత్తంలో డబ్బులు పంపుతుంటారు. అక్కడ వారు ఎంత కష్టపడుతున్నా.. ఇండియా లో ఉన్న తమ కుటుంబ సభ్యుల మేలు కోసం, లేదా ఇక్కడ ఆస్తుల కొనుగోలు కోసం, లేదా అమ్మా నాన్నల ఖర్చుల నిమిత్తం విదీశీ మారకాన్ని ఇండియాకు పంపిస్తారు. దీనినే రెమిటెన్సు అని అంటారు. ప్రపంచంలోనే తమ సొంత దేశానికి రెమిటెన్సు పంపించే విషయంలో ఇండియన్స్ ముందుంటారు. కొన్నేళ్లుగా మన వారికి తిరుగు లేదు. ఈ విషయంలో చైనా కూడా మనతో పోటీ పడలేక పోతోంది.

మన వారి దేశ భక్తి, సొంత దేశంపై మమకారం ముందు మిగితా దేశాలు దిగదిడుపే. ప్రతి ఏటా మన వారు రూ లక్షల కోట్ల మొత్తం ఇండియాకు పంపిస్తారు. అయితే ఇప్పుడు కరోనా వైరస్ పుణ్యమా అని ఈ విషయంలో మన వారు కూడా కాస్త వెనక్కు తగ్గేలా ఉన్నారు. ప్రపంచంలోని 200 దేశాల్లో మన ఇండియన్స్ ఉన్నారు. ఇప్పుడు ప్రతి దేశంలోనూ కరోనా వైరస్ వ్యాప్తి చెందటంతో ఎక్కడికక్కడ లాక్ డౌన్ తో సతమతమవుతున్నారు. దీంతో, వారికి అక్కడ ఒక వైపు ఉద్యోగాలపై ప్రభావం పడటంతో పాటు, వ్యయాలు పెరగటమే ఇందుకు కారణం.

గ్రీన్‌కార్డు జారీ 60 రోజులు నిలిపివేత, వేలాది ఇండియన్-అమెరికన్లపై ప్రభావం

20% తగ్గే అవకాశం...

20% తగ్గే అవకాశం...

ఇండియా కు విదేశీ మారక నిల్వలను పెద్ద మొత్తంలో అందిస్తున్నది ఎన్నారైలు. ప్రతి ఏటా వారు వందల బిలియన్ డాలర్ల విలువైన విదేశీ మారక ద్రవ్యం ఇండియా కు పంపుతున్నారు. గతేడాది (2019) ఇలాగే సుమారు 83 బిలియన్ డాలర్లు (సుమారు రూ 6,22,500 కోట్లు) పంపించారు. ఇంత పెద్ద మొత్తంలో మన ప్రవాస భారతీయులు సొమ్ము పంపుతున్నారు కాబట్టే... ఇండియా లో ప్రస్తుతం 476 బిలియన్ డాలర్ల ఫారిన్ ఎక్స్చేంజి రిజర్వ్స్ ఉన్నాయి. దీంతో దేశం చేయాల్సిన విదేశీ చెల్లింపులు, కరెంటు అకౌంట్ చెల్లింపు లు సులువు అవుతున్నాయి. ఐతే, కరోనా వైరస్ వ్యాప్తి నేపథ్యంలో నెలకొన్న పరిణామాల దృష్ట్యా.. ప్రపంచ రెమిటెన్సులు తగ్గుతాయని వరల్డ్ బ్యాంకు అంచనా వేసింది. ఇందులో అత్యధికంగా దక్షిణాసియా కు సుమారు 22% తగ్గే అవకాశాలు ఉన్నాయని వెల్లడించింది. ఇండియా, బాంగ్లాదేశ్, పాకిస్తాన్, శ్రీలంక వంటి దేశాలు ఇందులో ఉంటాయి. భారత్ తో పాటు మన పొరుగు దేశాలు కూడా పెద్ద మొత్తంలో విదేశీ మారక ద్రవ్యాన్ని పొందుతున్నాయి. రమారమి భారత్ కు వచ్చే రెమిటెన్సులు కూడా సుమారు 20% తగ్గొచ్చు అని భావిస్తున్నారు.

మొత్తం రెమిటెన్సుల్లో 12% వాటా మనదే...

మొత్తం రెమిటెన్సుల్లో 12% వాటా మనదే...

ప్రపంచం మొత్తం రెమిటెన్సు లో భారత్ కేవలం ముందుంటమే కాదు... భారీ వాటాను కూడా సొంతం చేసుకుంటోంది. ఈ విషయంలో ఇండియా మొత్తం 12% వాటా తో మిగితా ఏ దేశానికి కూడా అందనంత ఎత్తులో నిలుస్తోంది. 2019 లో మొత్తం ప్రపంచ వ్యాప్త రెమిటెన్సులు 714 బిలియన్ డాలర్లు కాగా... ఒక్క ఇండియాకు 83 బిలియన్ డాలర్లు వచ్చాయి. ఇదిలా ఉండగా.. ఈ సారి రెమిటెన్సులు తగ్గే దేశాల్లో యూరోప్ రీజియన్ అధికంగా ప్రభావితం అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. వరల్డ్ బ్యాంకు అంచనా ప్రకారం ... సుమారు 28% నిధులు ఆయా దేశాలకు తగ్గిపోయే పరిస్థితి కనిపిస్తోంది. ఆ తర్వాత ఆఫ్రికా దేశాలకు సుమారు 23% నిధుల ప్రవాహం తగ్గొచ్చని అంచనా. ఈ మేరకు ది ఎకనామిక్ టైమ్స్ ఒక కథనాన్ని ప్రచురించింది.

సుమారు 2 కోట్ల మంది...

సుమారు 2 కోట్ల మంది...

మన దేశం నుంచి బతుకు దెరువు కోసం, ఉద్యోగాల కోసం, వ్యాపారాల కోసం సుమారు 2 కోట్ల మందికి పైగా భారతీయులు వెళ్లి దాదాపు 200 దేశాల్లో స్థిరపడ్డారు. అందుకే, ఏ దేశానికి వెళ్లినా అక్కడ భారతీయులు కచ్చితంగా కనిపిస్తారు. అదే క్రమంలో మన తెలుగు వాళ్ళు కూడా ప్రపంచంలోని దాదాపు అన్ని దేశాల్లోనూ తమ ఉనికిని చాటుతున్నారు. ఒకప్పుడు వలస అంటే బతకలేని వారు కేవలం బతుకుదెరువు కోసం వెళ్లే పనిగా భావించేవారు. కానీ ఇప్పుడు పరిస్థితి పూర్తిగా మారిపోయింది. మన ప్రవాస భారతీయులు ప్రపంచ దేశాల్లో లక్షల మందికి ఉపాధి కల్పిస్తూ అన్ని రంగాల్లో దూసుకుపోతున్నారు. అందుకే, అమెరికా సహా అభివృద్ధి చెందిన దేశంలో అయినా... అక్కడ వలసదారుల సంపాదన పరంగా చూస్తే భారతీయులే అధిక సంపన్నులుగా నిలుస్తున్నారు. అంటే, మన వారు ఎంత కష్టపడతారో అర్థమవుతుంది. ఆ సంపాదనలో చాలా మట్టుకు సొంత దేశానికి పంపుతూ ఇండియా అభివృద్ధికి పాటుపడుతున్నారు. తద్వారా మన ఎన్నారైలు ప్రపంచానికే ఆదర్శంగా నిలుస్తున్నారు.

English summary

Remittances to India to dip 23 percent in 2020

The World Bank expects remittances to South Asia will drop 22% this year, underscoring the economic distress stemming from the Covid-19 pandemic and the ensuing lockdown aimed at curbing the disease. This reflects loss of income for expatriate Indians working in the Gulf and elsewhere who support families back home in Kerala and other states at a time when the local economy is at a near standstill.
Story first published: Thursday, April 23, 2020, 11:18 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X