For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

మొన్న భారీగా పతనమై, నేడు పరుగు పెట్టిన రిలయన్స్ స్టాక్: ఎందుకంటే

|

ముఖేష్ అంబానీ నేతృత్వంలోని రిలయన్స్ ఇండస్ట్రీస్ స్టాక్ ధర నేడు ఆరు శాతానికి పైగా లాభపడింది. సౌదీ ఆరామ్‌కోతో డీల్‌కు బ్రేక్ పడిన అనంతరం వరుసగా ఈ స్టాక్ నష్టపోతోంది. రూ.2500కు పైగా ఉన్న రిలయన్స్ షేర్ రూ.2300 స్థాయికి పడిపోయింది. అయితే నేడు రిలయన్స్ ఇండస్ట్రీస్ కీలక అడుగుల నేపథ్యంలో స్టాక్ పరుగులు పెట్టింది. ఉదయం నుండి అంతకంతకూ ఎగిసి 6.36 శాతం లాభపడింది. దీంతో ఈ స్టాక్ రూ.149.60 ఎగిసి రూ.2501 వద్ద ముగిసింది. రిలయన్స్ స్టాక్ క్రితం సెషన్‌లో రూ.2351 వద్ద క్లోజ్ అయింది. నేడు రూ.2373 వద్ద ప్రారంభమై, రూ.2502 వద్ద గరిష్టాన్ని, రూ.2357 వద్ద కనిష్టాన్ని తాకింది.

రిలయన్స్ షేర్ జంప్ వెనుక

రిలయన్స్ షేర్ జంప్ వెనుక

గ్యాసిఫికేషన్ అసెట్స్ రీస్ట్రక్చర్ నేపథ్యంలో రిలయన్స్ ఇండస్ట్రీస్ స్టాక్ పరుగు పెట్టింది. సంస్థకు చెందిన గ్యాసిఫికేషన్ అండర్‌టేకింగ్‌ను పూర్తి యాజమాన్యంలోని అనుబంధ సంస్థగా బదలీ చేయాలని నిర్ణయించింది. ఇందుకు ఒక స్కీమ్ ఆఫ్ అరేంజ్‌మెంట్‌ను అమలు చేయాలని RIl బోర్డు నిర్ణయించింది. గతంలో ఇంధనగా పని చేసిన రిఫైనరీ ఆఫ్-గ్యాస్‌ను రిఫైనరీ ఆఫ్ గ్యాస్ క్రాకర్(ROGC) కోసం ఫీడ్ స్టాక్‌గా వినియోగిస్తున్నారు. దీంతో ఎనర్జీ అవసరాలను తీర్చడానికి సింగ్యాస్ లేదా సింథటిక్ గ్యాస్‌ను ఉత్పత్తి చేయాలనే లక్ష్యంతో గుజరాత్‌లోని జామ్‌నగర్ వద్ద గ్యాసిఫికేషన్ ప్రాజెక్టును రిలయన్స్ ఏర్పాటు చేసింది. తక్కువ నిర్వహణ ఖర్చుతో ఒలెఫిన్స్ ఉత్పత్తి సాధ్యమైంది.

ఫలితంగా ఇంధనంగా వాడే సింథటిక్ గ్యాస్ సరఫరా విశ్వసనీయత పెరిగి, ఎనర్జీ కాస్ట్ అశ్థిరత తగ్గింది. జామ్‌నగర్ రిఫైనరీలో వినియోగం కోసం హైడ్రోజన్‌ను ఉత్పత్తి చేసేందుకు సింథటిక్ గ్యాస్‌ను కూడా వినియోగిస్తారు. రిలయన్స్ గ్యాసిఫికేషన్ ఆస్తుల పునర్వ్యవస్థీకరణపై దృష్టి సారించడంతో స్టాక్ పుంజుకుంది. రీ-సైక్లింగ్ చేయగల, స్థిర నెట్-జీరి కార్బన్‌తో కూడిన పోర్ట్‌పోలియోపై రిలయన్స్ దృష్టి సారించింది. ఎనర్జీ అవసరాలు తీర్చేందుకు పునరుత్పాదకత, అధిక వ్యాల్యూ కలిగిన పదార్థాలు, రసాయనాలకు మారడం ద్వారా ఇది సాధ్యమని భావిస్తోంది.

పునరుత్పాదక శక్తిని ప్రాథమిక వనరుగా

పునరుత్పాదక శక్తిని ప్రాథమిక వనరుగా

రిలయన్స్ క్రమంగా పునరుత్పాదక శక్తిని ప్రాథమిక వనరుగా మార్చుకుంటోంది. అప్పుడు సీవన్ కెమికల్స్, హైడ్రోజన్ సహా అధిక వ్యాల్యూ కలిగిన కెమికల్స్ కోసం అప్‌గ్రెడేషన్ అయితే మరిన్ని సింథటిక్ గ్యాస్‌లు అందుబాటులోకి వస్తాయి. హైడ్రోజన్‌ను ఉత్పత్తి చేసే ప్రక్రియలో విడుదలయ్యే అధిక సాంధ్రత కలిగిన కార్పన్ డై ఆక్సైడ్‌ను సులభంగా సంగ్రహించవచ్చు. దీంతో కార్బన్ క్యాప్చర్ ధర గణనీయంగా తగ్గుతుంది. ఈ చర్యలు జామ్‌నగర్ కాప్లెక్స్ కార్బన్ పుట్ ప్రింట్‌ను తగ్గించడంలో సహాయపడతాయని చెబుతోంది.

అనుమతి అవసరం

అనుమతి అవసరం

సపరేషన్ స్కీమ్ మార్చి 31, 2022 నుండి అమల్లోకి వచ్చే అవకాశముంది. ఈ స్కీంకు షేర్ హోల్డర్లు, ఎన్సీఎల్టీ, ఇతర రెగ్యులేటరీ అథారిటీస్ అనుమతులు అవసరం. 2019 ఆగస్ట్ షేర్ హోల్డర్ల ఏజీఎం సమావేశంలో ఆయిల్ టు కెమికల్స్‌లో ఇరవై శాతం వాటాను విక్రయిస్తామని ముఖేష్ అంబానీ ప్రకటించారు. ఇప్పుడు సౌదీ ఆరామ్‌కోతో డీల్‌కు బ్రేక్ తర్వాత సోమవారం రిలయన్స్ స్టాక్ నాలుగు శాతం నష్టపోయింది. అయితే తాము కొత్త ఎనర్జీ వ్యాపారంపై దృష్టి సారిస్తున్నట్లు అప్పుడే చెప్పారు.

English summary

Reliance shares surge 6 Percent on Restructuring of Gasification Assets

Shares of India's top valued firm Reliance Industries Ltd (RIL) were trading nearly 6% higher at ₹2,491 apiece on the BSE in Thursday's trading session as the heavyweight supported markets as the top gainer and helped in the rebound of indices in afternoon deals.
Story first published: Thursday, November 25, 2021, 16:18 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X