For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

అక్కడ రియల్ ఎస్టేట్ ధరలు ఢమాల్: కొనుగోలుకు ఇదే సరైన సమయం అంటున్న నిపుణులు

|

ఆర్థిక రాజధాని ముంబైలో రియల్ ఎస్టేట్ ధరలు విపరీతంగా పడిపోతున్నాయి. ముంబైలో కరోనా కేసులు పెరుగుతుండటం,లాక్ డౌన్ కారణంగా రియల్ ఎస్టేట్ రంగానికి చెందిన డెవలపర్లకు డబ్బు సమస్యలు ఎక్కువ కావడం వంటి కారణాలతో ప్రస్తుతం రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్న వారు ధరలను తగ్గించి విక్రయాలు జరపాలని నిర్ణయం తీసుకున్నారు. ప్రస్తుతం ముంబైలో రియల్ ఎస్టేట్ సంక్షోభంలో ఉన్న నేపథ్యంలో కొనుగోలుదారులకు వెసులుబాటు కల్పిస్తూ తాజాగా ధరలు తగ్గించడం ఇళ్ళు, ప్లాట్లు కొనుగోలు చేయాలనే వారికి ఒక సువర్ణావకాశం అని చెప్పొచ్చు.

డబ్బులకు రియల్టర్లు విలవిల .. రియల్ ఎస్టేట్ కుదేలు .. ధరల తగ్గింపు

డబ్బులకు రియల్టర్లు విలవిల .. రియల్ ఎస్టేట్ కుదేలు .. ధరల తగ్గింపు

మహారాష్ట్రలో కరోనా దారుణమైన పరిస్థితులను సృష్టించింది. దీంతో రియల్ ఎస్టేట్ వ్యాపారం కుదేలైంది. మొన్నటి వరకు కొనసాగిన లాక్ డౌన్, ఇప్పటికీ కొనసాగుతున్న ఆంక్షల నేపథ్యంలో కోట్ల రూపాయల పెట్టుబడులు పెట్టిన రియల్టర్లు తీవ్రంగా నష్టపోయారు .గత మూడు నెలలుగా ముంబై లో ఇల్లు , ఫ్లాట్ లు కొనుగోలు చేసేందుకు ఆసక్తి చూపించకపోవటంతో ధరను తగ్గించి అయినా విక్రయాలు జరపాలని, డబ్బు రొటేషన్ అయితేనే బిజినెస్ చేయడానికి అవకాశం ఉంటుందని భావించి ధరలను తగ్గిస్తున్నారు. అంతేకాదు డబ్బులు ఆలస్యంగా చెల్లిస్తామని చెప్పినా సరే డెవలపర్లు ఒప్పుకుంటున్నారు.

ఎన్‌‌బీఎఫ్‌‌సీ కంపెనీ ఐఎల్ అండ్‌‌ ఎఫ్‌‌ఎస్‌లో సంక్షోభంతో లోన్లకు ఇబ్బంది

ఎన్‌‌బీఎఫ్‌‌సీ కంపెనీ ఐఎల్ అండ్‌‌ ఎఫ్‌‌ఎస్‌లో సంక్షోభంతో లోన్లకు ఇబ్బంది

ఇంట్లో దిగే అంతవరకూ చెల్లింపులపై వడ్డీలు కూడా మాఫీ చేస్తామని హామీ ఇచ్చి మరీ అమ్మకాలు జరుపుతున్నారు. దీంతో ఇల్లు కొనుగోలు చేయాలనుకునే వారికి ఇదే మంచి సమయమని నిపుణులు సూచిస్తున్నారు. ఎన్‌‌బీఎఫ్‌‌సీ కంపెనీ ఐఎల్ అండ్‌‌ ఎఫ్‌‌ఎస్‌లో సంక్షోభం మొదలైన తరువాత రియల్టీ కంపెనీలకు లోన్లు దొరకడం కష్టంగా మారింది. అంతేగాక అమ్ముడుపోని ప్రాజెక్టులు కూడా బాగా పేరుకుపోయాయి. కరోనా మహమ్మారితో దెబ్బతిన్నప్పటికీ ఈ రంగానికి సాయం అందించలేమని కేంద్ర ప్రభుత్వం స్పష్టం చేసింది. దీంతో ధరలు తగ్గించక తప్పనిసరి పరిస్థితి ఏర్పడింది.

డిస్కౌంట్స్ ఇస్తామని ప్రకటిస్తున్న డెవలపర్లు

డిస్కౌంట్స్ ఇస్తామని ప్రకటిస్తున్న డెవలపర్లు

ఇక దీనిపై సేవిల్స్ ఇండియా ఎండి భవిన్ ఠక్కర్ కొనుగోలుకు సిద్ధంగా ఉన్న వారికి డిస్కౌంట్ ఇవ్వడానికి ముంబై మెట్రోపాలిటన్ రీజియన్ డెవలపర్లు సిద్ధంగా ఉన్నారని ఆయన పేర్కొన్నారు. ఇక మధ్యతరగతి వారికి సంబంధించిన సెగ్మెంట్‌‌లోని ఇండ్లపై 15 శాతం వరకు తగ్గిస్తున్నారని, కొందరు మాడ్యులర్ కిచెన్స్ లేదా కార్ లేదా ఫర్నిచర్ వంటి వాటిని ఉచితంగా ఇస్తున్నారని వివరించారు. లగ్జరీ అపార్ట్‌‌మెంట్లపై అయితే డిస్కౌంట్లు 35 శాతం వరకు ఉన్నాయి.

ముంబైలో దాదాపు 70 శాతం ప్రాజెక్టుల ధరలు తగ్గాయంటున్న పలు అధ్యయనాలు

ముంబైలో దాదాపు 70 శాతం ప్రాజెక్టుల ధరలు తగ్గాయంటున్న పలు అధ్యయనాలు

ఈ ఏడాది మే, జూన్ నెలల్లో ముంబైలోని దాదాపు 70 శాతం ప్రాజెక్టుల ధరలు తగ్గాయని ప్రాప్‌‌స్టక్ స్టడీ తెలిపింది. సెకండరీ మార్కెట్లోనూ తక్కువ ధరలకే ఆస్తులు అందుబాటులో ఉన్నాయని మరో స్టడీ వెల్లడించింది. ముంబైతోపాటు ఢిల్లీలోనూ రేట్లు తగ్గాయని పేర్కొంది. ప్రస్తుతం నిర్మాణంలో ఉన్న ప్రాజెక్టులు పూర్తి కావడానికి ఆరు నెలల నుంచి రెండేళ్ల వరకు పట్టొచ్చని డెవలపర్లు అంటున్నారు.

ఆర్ధిక సంక్షోభం నుండి గట్టెక్కే చర్యగా ధరల తగ్గింపు

ఆర్ధిక సంక్షోభం నుండి గట్టెక్కే చర్యగా ధరల తగ్గింపు

ఒకటి రెండు పెద్ద కంపెనీలు మినహాయించి, మిగతా రియల్ ఎస్టేట్ కంపెనీలన్నీ ధరలు తగ్గించి, డిస్కౌంట్స్ ఇచ్చి మరి అమ్మకాలు జరుపుతున్న పరిస్థితి ప్రస్తుతం కనిపిస్తోంది. ఒకపక్క కరోనా వ్యాప్తి, కార్మికుల కొరత, డెవలపర్ల దగ్గర డబ్బు లేకపోవడం, బ్యాంకులలో లోన్లు ఇబ్బంది గా మారడం వంటి అనేక కారణాలు ముంబై రియల్ ఎస్టేట్ ను తిరోగమన బాట పట్టిస్తున్నాయి. ఇక ఈ పరిస్థితుల నుండి, తీవ్రమైన ఆర్థిక సంక్షోభం నుంచి గట్టెక్కడానికి ముంబై రియల్టర్లు డిస్కౌంట్ల బాట పట్టారు. తక్కువ ధరలకు అమ్మకాలు జరుపుతున్నారు.

English summary

Real Estate Prices decreased in mumbai ..experts says this is the time to buy

Faced with no movement in sales in the past three-odd months due to lockdown and Covid-19-related issues, property developers are resorting to price cuts in mumbai . Developers are worried about their loans. This year they Cut down 20 per cent lower than last year’s prices.
Story first published: Thursday, July 9, 2020, 18:14 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X