అలా గుర్తించేందుకు డిసెంబర్ 31వ తేదీ వరకు గడువు!
ఇప్పటికే ప్రమాద హెచ్చరికలు జారీ చేసిన రుణ ఖాతాలను మోసపూరిత ఖాతాలుగా బ్యాంకులు గుర్తించాలని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(RBI) ఆదేశించినట్లుగా వార్తలు వస్తున్నాయి. ఈ మేరకు అలాంటి ఖాతాలను గుర్తించిన ఆర్బీఐ, అలాంటి ఖాతాలను ఫ్రాడ్ కింద వర్గీకరించేందుకు బ్యాంకులకు డిసెంబర్ 31వ తేదీ వరకు గడువు ఇచ్చిందట.
భారీ రిటర్న్స్ ఇచ్చిన టెస్లా, ఏడాదిలో 700% జంప్: జెఫ్ బెజోస్‌ను దాటివేసే దిశగా ఎలాన్ మస్క్

హెచ్చరికలు
హెచ్చరికలు జారీ చేసిన ఆయా ఖాతాల పరిస్థితిపై నివేదిక పంపించడంతో పాటు వాటిని సరిగ్గా వర్గీకరించేందుకు ఆర్బీఐ ఈ గడువును నిర్ణయించిందని, కొన్ని బ్యాంకుల్లో ముందస్తు హెచ్చరిక వ్యవస్థలు బలంగా లేకపోవడం వల్ల ఆర్బీఐ ఈ ఆదేశాలు జారీ చేసిందని బ్యాంకింగ్ అధికారి ఒకరు తెలిపారు. అలాంటి ఖాతాలను మోసపూరిత ఖాతాలుగా గుర్తించడం, లేదంటే క్రమబద్ధీకరించిన పక్షంలో ఖాతాను నవీకరించడం వంటి విషయాల్లో బ్యాంకులు వేగం కనబరచడం లేదని, అందుకే ఆర్బీఐ ఈ అడుగులు వేస్తోందని వార్తలు వచ్చాయి.

కేటాయింపులు
పలు బ్యాంకులు కొన్ని ఖాతాలను డిఫాల్ట్‌గా గుర్తించాయి. అయితే అన్ని బ్యాంకులు ఈ విషయంలో ముందుకు రావాలని ఆర్బీఐ భావిస్తోందని అంటున్నారు. డిఫాల్ట్ విభాగ ఖాతాలకు నాలుగు క్వార్టర్లలో వంద శాతం కేటాయింపులు జరపాలి. నిరర్థక ఆస్తుల విషయంలో ఎనిమిది క్వార్టర్లలో వంద శాతం కేటాయింపులు జరపాలి.

సంతృప్తికరంగా లేదు
కొన్ని బ్యాంకుల ముందస్తు హెచ్చరికలతో ఆర్బీఐ సంతృప్తికరంగా లేదని తెలుస్తోంది. కొన్ని బ్యాంకులు ఫ్రాడ్‌గా గుర్తించడంలో అంత వేగంగా స్పందించడం లేదని, అలాగే వాటిని అప్ గ్రేడ్ చేసినట్లు ట్యాగ్ చేయడంలో విఫలమైనట్లుగా భావిస్తోంది.