RBI సెక్యూరిటీ రూల్స్! జనవరి నుండి పిన్ లేకుండా రూ.5,000 వరకు ట్రాన్సాక్షన్స్
ముంబై: కరోనా వైస్ సమయంలో డిజిటల్ ట్రాన్సాక్షన్స్ వేగంగా పెరిగిన విషయం తెలిసిందే. ఫెయిల్యూర్స్, ఫ్రాడ్స్ కూడా పెరిగిపోతున్నాయి. ఈ నేపథ్యంలో రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(RBI) కొత్త డిజిటల్ పేమెంట్ సెక్యూరిటీ కంట్రోల్ నిబంధనలు జారీ చేయనుంది. సెంట్రల్ బ్యాంకు తన స్టేట్మెంట్ ఆన్ డెవలప్మెంట్ అండ్ రెగ్యులేటరీ పాలసీస్ సందర్భంగా ఆర్బీఐ డిజిటల్ చెల్లింపు భద్రతానియమాలకు సంబంధించిన ఆదేశాలను జారీ చేయనుందని తెలిపింది.

మార్గదర్శకాలు విడిగా..
నెట్ బ్యాంకింగ్ బదలీలు, మొబైల్ బ్యాంకింగ్, యూపీఐ, కార్డ్ పేమెంట్స్ వంటి డిజిటల్ ట్రాన్సాక్షన్స్‌కు సంబంధించి సురక్షితంగా ఉండేలా నిబంధనలు రూపొందిస్తున్నట్లు తెలిపింది. అంతేకాకుండా ట్రాన్సాక్షన్స్ వైఫల్యం రేటు కనిష్టానికి తగ్గనున్నాయని తెలిపారు. డిజిటల్ పేమెంట్స్‌కు సంబంధించి ఆర్బీఐ భద్రతా నియంత్రణకు అధిక ప్రాముఖ్యతను ఇస్తుందని తెలిపింది ఆర్బీఐ. ఇందుకు సంబంధించి మార్గదర్శకాలు విడిగా జారీ చేయబడతాయని తెలిపింది.

రూ.2వేల నుండి రూ5వేలకు పెంపు
జనవరి 1వ తేదీ నుండి కాంటాక్ట్‌లెస్ కార్డు ట్రాన్సాక్షన్స్ పరిమితిని రూ.2వేల నుండి రూ.5 వేలకు పెంచనున్నట్లు ఆర్బీఐ గవర్నర్ శక్తికాంతదాస్ తెలిపారు. కరోనా సమయంలో సమర్ధ, సురక్షిత డిజిటల్ ట్రాన్సాక్షన్స్ అందుబాటులో ఉంటాయన్నారు. సురక్షిత డిజిటల్ చెల్లింపుల కోసం కస్టమర్ ఇష్టానుసారం కాంటాక్ట్‌లెస్ ట్రాన్సాక్షన్ పరిమితి పెంచుతున్నట్లు తెలిపారు. ఇప్పటి వరకు రూ.2వేల వరకు చెల్లింపులు, ట్రాన్సాక్షన్స్ పిన్ నెంబర్ లేకుండా జరుపుకునే వెసులుబాటు ఉంది. ఇప్పుడు ఆ పరిమితిని రూ.5,000కు పెంచుతూ నిర్ణయం తీసుకుంది.

24X7 అందుబాటులోకి
RTGS వ్యవస్థను కూడా 24X7 అందుబాటులోకి తీసుకు వస్తున్నట్లు ప్రకటించారు శక్తికాంతదాస్. అనునిత్యం AePS, IMPS, NETC, NFS, RuPay, UPI లావాదేవీలు సదుపాయం ఉంటుందని తెలిపారు. ఆర్బీఐ కీలక వడ్డీ రేట్లను యథాతథంగా ఉంచిన విషయం తెలిసిందే.