ఆర్బీఐ నిర్ణయం ఎఫెక్ట్, 45,000తో సెన్సెక్స్ సరికొత్త రికార్డ్: రిలయన్స్ మళ్లీ డౌన్
ముంబై: స్టాక్ మార్కెట్లు భారీ లాభాల్లో ప్రారంభమయ్యాయి. నేడు సెన్సెక్స్ సరికొత్త రికార్డ్ 45,000 మార్కును క్రాస్ చేసింది. ఉదయం సెన్సెక్స్ 33.26 పాయింట్లు (0.07%) లాభపడి 44,665.91 వద్ద, నిఫ్టీ 43.50 పాయింట్లు (0.33%) ఎగిసి 13,177.40 వద్ద ప్రారంభమైంది. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(RBI) వడ్డీ రేట్లను యథాతథంగా ఉంచింది. రెపో రేటును 3.35 శాతం వద్దే కొనసాగిస్తోంది. జీడీపీ వృద్ధి రేటును కాస్త సానుకూలంగా సవరించింది. ఈ మేరకు ఆర్బీఐ గవర్నర్ శక్తికాంత దాస్ ప్రకటించారు. ఈ నేపథ్యంలో మార్కెట్లు భారీగా లాభపడ్డాయి. డాలర్ మారకంతో రూపాయి 15 పైసలు పెరిగి 73.78 వద్ద ప్రారంభమైంది.
SBI కాంటాక్ట్‌లెస్ డెబిట్ కార్డు.. కస్టమర్లకు ప్రయోజనాలివే

ఆర్బీఐ ఎఫెక్ట్.. 45,000 క్రాస్ చేసిన సెన్సెక్స్
మధ్యాహ్నం గం.12.00 సమయానికి సెన్సెక్స్ 300 పాయింట్లు లాభపడి 44,931 పాయింట్ల వద్ద ఉంది. సెన్సెక్స్ పదకొండు గంటల సమయంలో 45,020 వద్ద ట్రేడ్ అయింది. ఆ తర్వాత 44వేలమార్కుకు దిగివచ్చినప్పటికీ భారీ లాభాల్లోనే కదలాడింది. నిఫ్టీ 13,250 సమీపానికి చేరుకుంది. మధ్యాహ్నం గం.12 సమయంలో 74 పాయింట్లు లాభపడి 13,207 వద్ద ట్రేడ్ అయింది. ఆర్బీఐ వృద్ధి రేటు కాస్త సానుకూలంగా సవరించడం, రెపోరేటుని యథాతథంగా ఉంచడంతో మార్కెట్లు ఝూమ్మని ఎగిశాయి.

రిలయన్స్ మళ్లీ డౌన్
నేడు టాప్ గెయినర్స్ జాబితాలో హిండాల్కో 4.69 శాతం, భారతీ ఎయిర్టెల్ 3.40 శాతం, అల్ట్రా టెక్ సిమెంట్ 3.20 శాతం, ఐసీఐసీఐ బ్యాంకు 2.29 శాతం, అదానీ పోర్ట్స్ 2.16 శాతం లాభాల్లో ట్రేడ్ అయ్యాయి.
టాప్ లూజర్స్ జాబితాలో రిలయన్స్ 0.87 శాతం, బీపీసీఎల్ 0.80 శాతం, JSW స్టీల్ 0.71 శాతం, బజాజ్ ఫిన్ సర్వ్ 0.65 శాతం, దివిస్ ల్యాబ్స్ 0.44 శాతం నష్టపోయాయి.
మోస్ట్ యాక్టివ్ స్టాక్స్‌లో బజాజ్ ఫైనాన్స్, మారుతీ సుజుకీ, అల్ట్రా టెక్ సిమెంట్, ఎస్బీఐ, హెచ్డీఎఫ్సీ బ్యాంకు ఉన్నాయి.
రిలయన్స్ స్టాక్ నేడు 0.94 శాతం క్షీణంచి 1,945.55 వద్ద ట్రేడ్ అయింది.

రంగాలవారీగా చూస్తే...
రంగాలవారీగా చూస్తే నిఫ్టీ 50 స్టాక్స్ 0.61 శాతం, నిఫ్టీ మిడ్ క్యాప్ 0.37 శాతం లాభపడ్డాయి. నిఫ్టీ ఆటో 0.34 శాతం, నిఫ్టీ బ్యాంకు 0.90 శాతం, నిఫ్టీ ఫైనాన్షియల్ సర్వీసెస్ 0.53 శాతం, నిఫ్టీ ఎఫ్ఎంసీజీ 0.97 శాతం, నిఫ్టీ ఐటీ 0.52 శాతం, నిఫ్టీ మీడియా 0.42 శాతం, నిఫ్టీ మెటల్ 0.46 శాతం, నిఫ్టీ ఫార్మా 0.77 శాతం, నిఫ్టీ పీఎస్‌యూ బ్యాంకు 0.01 శాతం, నిఫ్టీ రియాల్టీ 0.66 శాతం, నిఫ్టీ ప్రయివేటు బ్యాంకు 0.93 శాతం లాభపడ్డాయి.
నిఫ్టీ ఎనర్జీ మాత్రం 0.21 శాతం నష్టపోయింది.
ఐటీ స్టాక్స్ విషయానికి వస్తే టీసీఎస్ 0.67 శాతం, ఇన్ఫోసిస్ 0.33 శాతం, టెక్ మహీంద్రా 1.13 శాతం, విప్రో 0.40 శాతం లాభపడ్డాయి.
హెచ్‌సీఎల్ టెక్ 0.19 శాతం, మైండ్ ట్రీ 0.35 శాతం, కోఫోర్జ్ 0.79 శాతం నష్టపోయాయి.