Covid 19: రూ.2,500 కోట్లు పెరిగిన రాకేష్ ఝున్ఝున్వాసా పెట్టుబడుల వ్యాల్యూ
ప్రముఖ ఇన్వెస్టర్ రాకేష్ ఝున్‌ఝున్‌వాలా గత 69 సెషన్లలో సగటున రోజుకు రూ.13 లక్షలు సంపాదించారు. అతని నెట్ వర్త్ రూ.10,000 కోట్లను అధిగమించింది. ఈ ఆర్థిక సంవత్సరం తొలి క్వార్టర్ (ఏప్రిల్-జూన్)లో ఆయన పెట్టుబడుల వ్యాల్యూ రూ.2,514 కోట్లు పెరిగింది. కరోనా-లాక్ డౌన్ సమయంలో ఆస్తులు పెరిగాయి. సోమవారం మార్కెట్ ముగింపు సమయానికి లిస్టెడ్ కంపెనీల్లో ఝున్‌ఝున్‌వాలా, ఆయన కుటుంబం పెట్టుబడులు రూ.10,797 కోట్లను చేరుకున్నాయి. మార్చి చివరలో రూ.8,284 కోట్లు ఉండగా, ఇప్పుడు దాదాపు 30 శాతం పెరిగాయి.
టీసీఎస్, యాక్సెంచర్ పోటీపడ్డప్పటికీ.. ఇన్ఫోసిస్ చరిత్రలో అతిపెద్ద, అరుదైన డీల్

వాటాలు పెంచుకున్నారు
కొన్ని కంపెనీల్లో పెట్టుబడులు పెట్టడం ద్వారా వాటాలు పెంచుకున్నారు. ఏప్రిల్-జూన్ త్రైమాసికంలో జుబిలాంట్ లైఫ్ సైన్సెస్, ఫెడరల్ బ్యాంక్, ఎన్సీసీ, ఫస్ట్ సోర్స్ సొల్యూషన్స్ తదితర కంపెనీల్లో ఝున్‌ఝున్‌వాలా వాటాలు పెంచుకున్నారు. లుపిన్, ఆగ్రో టెక్ ఫుడ్స్‌లో మాత్రం వాటాలను తగ్గించుకున్నారు. టైటాన్ కంపెనీ, ఎస్కార్ట్, ఓరియంట్ సిమెంట్ కంపెనీల్లో పెట్టుబడులను యథాతథంగా ఉంచారు. దాదాపు 11 నుండి 13 సంస్థల్లో పెట్టుబడులను యథాతథంగా ఉంచారు.

అందుకే పెరిగిన ఝున్‌ఝున్ వాలా సంపద
రాకేష్ ఝున్‌ఝున్‌వాలా, అతని భార్య రేఖాలకు మార్చి 2020 క్వార్టర్ ముగిసే నాటికి 29 లిస్టెడ్ కంపెనీల్లో 1% పైగా వాటాలు ఉన్నాయి. జూన్ క్వార్టర్లో ఇండియన్ హోటల్స్‌లో 12.5 మిలియన్ షేర్లు కొనుగోలు చేయడం ద్వారా 1.05 శాతం వాటాను దక్కించుకున్నారు. ఏప్రిల్ 2020 నుండి ఎస్కార్ట్, జుబిలాంట్ లైఫ్ సైన్సెస్, ర్యాలీస్ ఇండియా, లుపిన్ షేర్లు ఝున్‌ఝున్‌వాలా రిటర్న్స్ భారీగా పెరగడానికి దోహదపడ్డాయి. ఈ కాలంలో మొత్తం రూ.2,514 కోట్లు పెరగగా, కేవలం వీటి వాటానే దాదాపు సగం (రూ.1246 కోట్లు)గా ఉన్నాయి.

ఇన్వెస్ట్ చేస్తూ వచ్చారు..
రాకేష్ ఝున్‌ఝున్‌వాలా కరోనా సమయంలోను మార్కెట్లలో ఇన్వెస్ట్ చేస్తూ వచ్చారు. దీంతో పెట్టుబడుల వ్యాల్యూ రూ.2,514 కోట్ల మేర పెరిగింది. ర్యాలీస్ ఇండియా, ఎస్కార్ట్, జుబిలాంట్ లైఫ్ సైన్సెస్, లుపిన్.. ఈ 4 స్టాక్స్ ఝూమ్ అన్నాయి. కరోనా కారణంగా మార్చి, ఏప్రిల్ నెలల్లో స్టాక్స్ భారీగా పడిపోయిన విషయం తెలిసిందే. ప్రస్తుతం మార్కెట్లు రికవరీ స్టేజీలో ఉన్నాయి. ప్రపంచ మార్కెట్లు మందగించే అవకాశాలు లేవని భావిస్తున్నారు.