ఫీచర్ ఫోన్‌కూ UPI ఆధారిత పేమెంట్ ఉత్పత్తులు, ఆ పరిమితి రూ.5 లక్షలకు పెంపు
బ్యాంకులు తమ తమ బ్రాంచీలలో, ఓవర్సీస్లలోని తమ బ్రాంచీలలో డబ్బులు ఇన్ఫ్యూజ్ చేయడానికి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(RBI) అనుమతి తీసుకోవాల్సిన అవసరం లేదని కేంద్రబ్యాంకు గవర్నర్ శక్తికాంత దాస్ అన్నారు. అలాగే, ఫీచర్ ఫోన్ వినియోగదారులకు కూడా యూపీఐ ఆధారిత పేమెంట్ ఉత్పత్తులను ప్రారంభించే ప్రతిపాదన ఉందన్నారు. భారత ఆర్థిక వ్యవస్థ రికవరీ బాట పట్టిందని, అయితే ఒమిక్రాన్ వేరియంట్ ప్రభావం చూపుతోందన్నారు. సెకండ్ వేవ్ ట్రాక్షన్ కారణంగా రికవరీకి అంతరాయం ఏర్పడిందన్నారు.

ఒమిక్రాన్... అనిశ్చితి
కరోనా, కొత్త వేరియంట్ ఒమిక్రాన్ నేపథ్యంలో ఆర్థిక పరిస్థితి అనిశ్చితిగా ఉందని, వృద్ధి-ద్రవ్యోల్భణం వృద్ధి పైన కూడా భారీ అనిశ్చితి కొనసాగుతోందని శక్తికాంత దాస్ అన్నారు. లిక్విడిటీ పరిస్థితులకు అంతరాయం కలిగించని రీతిలో రీబ్యాలెన్స్ను కొనసాగిస్తామన్నారు. మెయిన్ లిక్విడిటీ ఆపరేషన్‌గా 14 రోజుల వేరియేబుల్ రివర్స్ రెపో రేటు (VRRR)ని తిరిగి సాధించడమే లక్ష్యంగా పెట్టుకున్నట్లు తెలిపారు. డిసెంబర్ 17న జరిగే వీఆర్ఆర్ఆర్ వేలం ద్వారా రూ.6.5 లక్,ల కోట్లను సమీకరిస్తుందని, డిసెంబర్ 31న జరిగే వీఆర్ఆర్ఆర్ వేలం ద్వారా రూ.7.5 లక్షల కోట్లను సమీకరిస్తుందని తెలిపారు. టీఎల్టీఆర్వోలకు సంబంధించి బ్యాంకులు వన్ టైమ్ ప్రీ పేమెంట్ చేయడానికి ఆర్బీఐ అనుమతిస్తుందన్నారు.

ఫీచర్ ఫోన్ ఆధారిత ఉత్పత్తులు
డిజిటల్ చెల్లింపులపై ఆర్బీఐ చర్చా పత్రాన్ని విడుదల చేయనుందని శక్తికాంత దాస్ తెలిపారు. అంటే డిజిటల్ పేమెంట్స్ ఛార్జీలకు సంబంధించి చర్చాపత్రాన్ని విడుదల చేస్తుంది.
ఇది యూనిఫైడ్ పేమెంట్స్ ఇంటర్ఫేస్(UPI) ఆధారిత ఫీచర్ ఫోన్ ఉత్పత్తులను కూడా ప్రారంభిస్తుందన్నారు.
గిల్ట్స్, రిటైల్, ఐపీవోలకు యూపీఐ పరిమితిని రూ.5 లక్షలకు పెంచాలని నిర్ణయించారు.
ప్రపంచవ్యాప్తంగా ఆర్థిక కార్యకలాపాలు క్రమంగా కరోనా ముందుస్థాయికి చేరుకుంటున్నాయని శక్తికాంత దాస్ అన్నారు.

ద్రవ్య లభ్యత
కరోనా సంక్షోభం నుండి ఆర్థిక వ్యవస్థ క్రమంగా కోలుకుంటుండటంతో ద్రవ్య లభ్యతను తగ్గించే దిశగా ఆర్బీఐ చర్యలు చేపట్టనుందని అందరూ భావించారు. జీఎస్టీ వసూళ్లు పెరగడం, తయారీ, సేవా పీఎంఐ గాడినపడటం దోహదపడ్డాయి. అయితే ఒమిక్రాన్ ఈ పరిస్థితిని తలకిందులు చేసింది. ఈ వేరియంట్ వల్ల ప్రమాదం ఉండకపోవచ్చుననే అంచనాలు ఉన్నప్పటికీ ఇన్వెస్టర్ల అనిశ్చితి, మార్కెట్ అనిశ్చితికి కారణంగా మారింది. ఈ నేపథ్యంలో ఈసారి కూడా వడ్డీ రేటును స్థిరంగా కొనసాగించారు.
సెమీకండక్టర్ల కొరత, కమోడిటీ ధరలు పెరగడం, అంతర్జాతీయ ఆర్థిక మార్కెట్ ఒడిదుడుకుల నేపథ్యంలో ఈ ఏడాది ద్రవ్యోల్భణం 5.3 శాతంగా అంచనా వేసింది. అక్టోబర్-డిసెంబర్ కాలంలో 5.1 శాతం, జనవరి-మార్చి కాలంలో 5.7 శాతం, ఏప్రిల్-జూన్ కాలంలో 5 శాతం, జూలై-సెప్టెంబర్ కాలంలో 5 శాతంగా అంచనా వేసింది.
వృద్ధి రేటు అంచనాలను 9.5 శాతంగా కొనసాగించింది. అక్టోబర్-డిసెంబర్ కాలంలో 6.6 శాతం, జనవరి-మార్చి కాలంలో 6.4 శాతం, ఏప్రిల్-జూన్ కాలంలో 17.2 శాతం, జూలై-సెప్టెంబర్ కాలంలో 7.8 శాతం అంచనా వేసింది.