చూడ్డానికి బాగానే ఉన్నా.. ఆర్థిక అస్థిరతకు దారితీయొచ్చు: బసు హెచ్చరిక
ప్రయివేటు బ్యాంకుల్లోకి కార్పోరేట్లను అనుమతించాలని ఆర్బీఐ వేసిన కమిటీ చేసిన సిఫార్సులపై ప్రపంచ బ్యాంకు మాజీ చీఫ్ ఎకనమిస్ట్ కౌశిక్ బసు స్పందించారు. ఈ ప్రతిపాదన ఆశ్రిత పెట్టుబడిదారి విధానానికి తద్వారా ఆర్థిక ఆస్థితరతకు దారితీయవచ్చునని హెచ్చరించారు. ఆర్బీఐ ప్యానల్ ప్రతిపాదన.. చెడు మార్గంలో వెళ్లే బాగా కనిపించే స్టెప్ అన్నారు. విజయవంతమైన ఆర్థిక వ్యవస్థలు అన్నింటా పరిశ్రమలు, కార్పోరేషన్ల మధ్య స్పష్టమైన విభజన రేఖ ఉందన్నారు. బ్యాంకుల ఏర్పాటుకు కార్పోరేట్ సంస్థలను అనుమతించాలన్న ఆర్బీఐ ప్యానల్ ప్రతిపాదన ఆర్థిక వ్యవస్థను అస్థిరపరిచేది అన్నారు.
బ్యాంకులపై పిడుగుపాటు, కార్పోరేట్లు ఈజీగా నిధులు మంజూరు చేసుకుంటారు

హెచ్చరిక
ఈ ప్రతిపాదన క్రోనీ క్యాపిటలిజం, ఆర్థిక అస్థిరతకు దారి తీయడంతో పాటు అవినీతి పెరుగుతుందని, మార్కెట్లో గుత్తాధిపత్యానికి దారితీస్తుందని కౌశిక్ బసు హెచ్చరించారు. రాజకీయ-వ్యాపారవర్గాలు కుమ్మక్కవుతాయన్నారు. దేశంలో బ్యాంకుల ఏర్పాటుకు కార్పొరేట్ సంస్థలను అనుమతించాలనే ఆర్బీఐ ఇంటర్నల్ వర్కింగ్ గ్రూప్ ప్రతిపాదన చూడటానికి, వినడానికి బాగా కనిపిస్తున్నా, భారత ఆర్థిక వ్యవస్థను తప్పుదోవ పట్టించేలా కనిపిస్తోందన్నారు.

అది సమర్థవంతమైనది..
ఆర్థికంగా అభివృద్ధి చెందిన దేశాలన్నీ ఇండస్ట్రీలు, కార్పొరేషన్లను ఒకవైపు, బ్యాంకులు, ఇతర ఆర్థిక సంస్థలను మరోవైపు స్పష్టంగా విభజించాయన్నారు. దీంతో బ్యాంకింగ్ రంగం, రుణాల మంజూరు సజావుగా సాగుతాయన్నారు. కార్పోరేట్ల చేతికి బ్యాంకులు వెళ్తే స్వప్రయోజనాల కోసం డిపాజిటర్ల సొమ్మును ఉపయోగించుకుంటారని, అవసరం లేదా ప్రతిభ ఉన్నవారికి రుణ లభ్యత ఉండకపోవచ్చునని, అప్పుడు అభివృద్ధి కుంటుబడే అవకాశాలు ఉంటాయని తెలిపారు. బ్యాంకింగ్ నియంత్రిత చట్టం 1949 సమర్థవంతమైనదన్నారు.

సవరణలు అవసరం లేదు
బ్యాంకింగ్ నియంత్రిత చట్టంకు బ్యాంకింగ్ రంగంలోకి కార్పోరేట్లను అనుమతించే కోణంలో సవరణలు చేయాల్సిన అవసరం లేదన్నారు. యూపీఏ కాలంలో ప్రధాన ఆర్థిక సలహాదారుగా పని చేశారు బసు. ఇప్పటికే ఈ ప్రతిపాదనపై ఆర్బీఐ మాజీ గవర్నర్ రఘురామ్ రాజన్, డిప్యూటీ గవర్నర్ విరాల్ ఆచార్య విమర్శలు గుప్పించారు.