For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

డొమెస్టిక్ బుకింగ్స్ ప్రారంభించిన విమాన సంస్థలు, టిక్కెట్స్ చాలా 'ఖరీదు'

|

కరోనా మహమ్మారి కారణంగా లాక్ డౌన్ ఆంక్షలు క్రమంగా సడలిస్తున్నాయి ప్రభుత్వాలు. ప్రయివేటు విమానయాన సంస్థలు జూన్ నుండి డొమెస్టిక్ ఫ్లైట్స్ ఆపరేషన్స్ కోసం బుకింగ్స్‌ను తెరిచాయి. జూన్ ప్రారంభంలో ఢిల్లీ - ముంబై వంటి రద్దీ రూట్లలో ఎక్కువ డిమాండ్ ఉంటుందని భావిస్తున్నారు. మే 31వ తేదీ వరకు లాక్ డౌన్ పొడిగించినందున ఎయిర్‌లైన్ కమర్షియల్ ఆపరేషన్స్ అప్పటి వరకు ప్రస్తుత పరిస్థితి కొనసాగుతుందని ఏవియేషన్ రెగ్యులేటర్ తెలిపింది.

ఉద్యోగాలున్నాయి..వర్కర్స్‌ని ఇవ్వండి: కంపెనీలు, వర్కింగ్ హవర్స్ 12గం.కు పెంచితే ఎక్స్‌ట్రా శాలరీ

టిక్కెట్స్ జారీ చేస్తున్న ఎయిర్ లైన్స్

టిక్కెట్స్ జారీ చేస్తున్న ఎయిర్ లైన్స్

కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి హర్దీప్‌సింగ్ పూరి మంగళవారం మాట్లాడుతూ.. డొమెస్టిక్ విమానాల ఆపరేషన్స్ ప్రారంభం విషయమై తామొక్కరమే దీనిపై నిర్ణయం తీసుకోలేమని చెప్పారు. సివిల్ ఏవియేషన్ ఆపరేషన్స్‌కు రాష్ట్రాలు కూడా అంగీకరించాలని అభిప్రాయపడ్డారు. ఇదిలా ఉండగా లో-కాస్ట్ ఎయిర్ లైన్స్ ఇండిగో, స్పైస్ జెట్, గోఎయిర్, ఎయిర్ ఏషియా వంటి సంస్థలు డొమెస్టిక్ ఫ్లైట్స్ సర్వీసుల కోసం టిక్కెట్స్ ఇస్తున్నాయి.

టిక్కెట్ ధర ఎక్కువగా ఉన్నప్పటికీ..

టిక్కెట్ ధర ఎక్కువగా ఉన్నప్పటికీ..

మొదటి రెండు మూడు రోజులు టిక్కెట్ ధరలు దాదాపు రూ.1000 వరకు ఎక్కువగా ఉన్నప్పటికీ ప్రయాణీకులు బుక్ చేసుకునేందుకే ఆసక్తి చూపిస్తున్నారట. కరోనా-లాక్ డౌన్ కారణంగా అత్యంత ప్రభావితమైన రంగాల్లో విమానయాన రంగం ఒకటి. రెండో దశ లాక్ డౌన్ ముగిసినప్పటి నుండి ఎయిర్ లైన్స్ ప్రారంభమవుతాయని అటు సంస్థలు, ఇటు ప్రయాణీకులు భావించారు. కానీ అది కుదరలేదు. ఎట్టకేలకు జూన్ నుండి ప్రారంభమవుతున్నాయని భావించవచ్చు. ఆదివారం లాక్ డౌన్ పొడిగించినందున మే 31వ తేదీ అర్ధరాత్రి వరకు వాణిజ్య విమానాలను నిలిపివేసినట్లు DGCA ఓ ప్రకటనలో తెలిపింది.

కేంద్రం నుండి ఆదేశాలు వచ్చాక..

కేంద్రం నుండి ఆదేశాలు వచ్చాక..

దీంతో జూన్ నుండి పలు విమానయాన సంస్థలు బుకింగ్స్ స్వీకరిస్తున్నాయి. దేశీయ విమానాల కోసం బుకింగ్ తీసుకుంటున్నట్లు ఇండిగో, విస్తారా తెలిపాయి. స్పైస్ జెట్ ప్రతినిధి అంతర్జాతీయ బుకింగ్స్ జూన్ 15వ తేదీ వరకు క్లోజ్ చేయబడినట్లు చెప్పారు. కేంద్రం నుండి ఆదేశాలు వచ్చిన తర్వాత తిరిగి సర్వీసులు ప్రారంభిస్తామని ఎయిరిండియా తెలిపింది. వాణిజ్య సేవలను తిరిగి ప్రారంభించడంపై అధికారిక ప్రకటన కోసం పౌర విమానయాన మంత్రిత్వ శాఖ, ఎయిరిండియా ట్విట్టర్ హ్యాండ్లిస్, సంబంధిత సైట్స్ అనుసరించాలని వైమానిక సంస్థ కోరింది.

జూన్ 1 నుండి రైళ్లు

జూన్ 1 నుండి రైళ్లు

దేశంలోని చిన్న పట్టణాలు, నగరాలలో నివసిస్తున్న వారికి భారతీయ రైల్వే ఇప్పటికే శుభవార్త చెప్పింది. జూన్ 1వ తేదీ నుండి 200 ప్రత్యేక ప్యాసింజర్ రైళ్లను నడుపుతున్నట్లు తెలిపింది. నాన్ ఏసీ, సెకండ్ క్లాస్ కోచ్‌లతో ఈ రైళ్లను ప్రతిరోజు నడుపుతున్నట్లు తెలిపింది. ఆన్‌లైన్లో టికెట్లు బుక్‌ చేసుకునేందుకు త్వరలో అవకాశం కల్పిస్తామని చెప్పింది. టికెట్ ధరలు కూడా సాధారణ స్లీపర్ క్లాస్ ధరలే ఉంటాయని పేర్కొంది. ఈమేరకు రైల్వే శాఖ మంత్రి పీయూష్ గోయల్ మంగళవారం ట్వీట్‌ చేశారు.

రాష్ట్రాలు కోరితే మరిన్ని శ్రామిక్ రైళ్లు

రాష్ట్రాలు కోరితే మరిన్ని శ్రామిక్ రైళ్లు

మరోవైపు, శ్రామిక్ ప్రత్యేక రైళ్లలో వెళ్లలేకపోయిన వలస కార్మికుల జాబితాలను అందిస్తే ప్రత్యేక రెళ్లను ఏర్పాటు చేసే ప్రయత్నాలు చేస్తామని రాష్ట్రాలకు రైల్వే శాఖ మరో ప్రకటనలో సూచించింది. వచ్చే రెండు రోజుల్లో శ్రామిక్ ప్రత్యేక రైళ్ల సంఖ్యను రెట్టింపు చేస్తామని తెలిపింది. రోజుకు 400 చొప్పున శ్రామిక్ రెళ్లను నడుపుతామని స్పష్టం చేసింది. శ్రామిక్ రైళ్లకు సంబంధించి అన్ని నిర్ణయాలు రైల్వే శాఖ తీసుకుంటుంది. తగినన్ని ప్రత్యేక రైళ్లు నడపడం, ఆగే స్టేషన్లను పెంచడం, రాష్ట్రాలతో సంప్రదించి టిక్కెట్స్ బుక్ చేయడం, స్టేషన్స్ వద్ద స్క్రీనింగ్.. ఇలా అన్నీ రైల్వే శాఖ చూసుకుంటుంది. కేంద్ర హోంశాఖను సంప్రదించిన తర్వాత రైల్వే మంత్రిత్వ శాఖ ప్రత్యేక రైళ్లకు అనుమతిస్తుంది.

English summary

Private airlines open bookings for domestic flight operations from June

Private airlines have opened bookings for their flights from June onwards for domestic operations.
Story first published: Wednesday, May 20, 2020, 13:20 [IST]
Company Search