SBI బాటలో PNB: ATM నుండి డబ్బు తీస్తున్నారా? ఈ కొత్త రూల్ తెలుసుకోండి
పంజాబ్ నేషనల్ బ్యాంకు(PNB) ఏటీఎంల నుండి డబ్బులు ఉపసంహరించుకుంటున్నారా? అయితే ఇది మీకోసమే. PNB ఏటీఎం నుండి రూ.10,000కు మించి నగదును ఉపసంహరించుకుంటే రిజిస్టర్డ్ మొబైల్ నెంబర్‌కు వన్ టైమ్ పాస్వర్డ్(OTP) వస్తుంది. దీనిని ఎంటర్ చేస్తేనే డబ్బులు ఉపసంహరించుకోవచ్చు. ఈ నిబంధన డిసెంబర్ 1వ తేదీ నుండి అమలులోకి వచ్చింది. PNB ఖాతాదారులు ఈ విధానంలో సురక్షితంగా నగదును ఉపసంహరించుకోవచ్చును.
SBI ఏటీఎంలో డబ్బులు డ్రా చేస్తున్నారా, సెప్టెంబర్ 18 నుండి కొత్త రూల్... తెలుసుకోండి
|
మొబైల్‌ను తప్పకుండా తీసుకెళ్లాలి!
PNB బ్యాంకు ఎంటీఎంకు వెళ్లి డబ్బు ఉపసంహరించుకోవాలంటే మీరు తప్పకుండా మీ వెంట రిజిస్టర్డ్ మొబైల్ నెంబర్‌ను తీసుకు వెళ్లాలి. అయితే రూ.10వేలు అంతకుమించి తీసే మొత్తానికి ఈ నిబంధన వర్తిస్తుంది. వన్ టైమ్ పాస్ వర్డ్ లేకుంటే మీరు డబ్బులు ఉపసంహరించుకోలేరు. బ్యాంకు ప్రకారం ఇక నుండి కస్టమర్ రాత్రి గం.8 నుండి ఉదయం గం.8 వరకు రూ.10వేల ఈజీగా, సురక్షితంగా డబ్బులు ఉపసంహరించుకోవచ్చు. ఇందుకు సంబంధించి PNB వారం క్రితమే ట్వీట్ చేసింది.

ఇలా ఉపసంహరించుకోండి
పంజాబ్ నేషనల్ బ్యాంకు ఏటీఎం నుండి డబ్బును ఎలా ఉపసంహరించుకోవాలనే అంశానికి సంబంధించి 47 సెకన్ల వీడియోను కూడా పోస్ట్ చేసింది.
- ATMలోని కార్డు స్లాట్‌లో మీ ఏటీఎం కార్డును ఉంచాలి.
- క్యాష్ విత్-డ్రాకు సంబంధించి అక్కడ అవసరమైన వివరాలు పొందుపరచాలి. అమౌంట్ ఎంటర్ చేయాలి.
- ఆ తర్వాత రూ.10వేల కంటే ఎక్కువ ఉపసంహరించుకునే వారి రిజిస్టర్డ్ మొబైల్ నెంబర్‌కు ఓటీపీ వస్తుంది.
- ఆ తర్వాత ఓటీపీని ఎంటర్ చేయాలి. ఆ తర్వాత ట్రాన్సాక్షన్ ప్రాసెస్ పూర్తవుతుంది.

ఇప్పటికే ఎస్బీఐ 24x7 ఓటీపీ ఆధారిత విత్ డ్రా
ఇప్పటికే ప్రభుత్వరంగ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(SBI) ఏటీఎం నుండి రూ.10,000, అంతకంటే ఎక్కువ డబ్బులు ఉపసంహరించే కస్టమర్లకు ఓటీపీ ఆధారిత ఉపసంహరణ సేవలను సెప్టెంబర్ 18వ తేదీ నుండి రౌండ్-ది-క్లాక్ అందుబాటులోకి తీసుకు వచ్చింది. ఎస్బీఐ ఈ ఏడాది జవరి నెలలో ఓటీపీ ఆధారిత ఉపసంహరణను అందుబాటులోకి తెచ్చింది. అయితే అన్ని ఏటీఎంలలో ఈ వెసులుబాటును రాత్రి 8 గంటల నుండి ఉదయం 8 గంటల వరకు అందుబాటులోకి తేగా, సెప్టెంబర్ నుండి నిత్యం (24x7) అందుబాటులోకి తెచ్చింది.