డిసెంబర్ నెలలో గూగుల్ పేను వెనక్కి నెట్టిన ఫోన్ పే
ప్రముఖ డిజిటల్ పేమెంట్ యాప్ ఫోన్ పే మరోసారి గూగుల్ పేని దాటేసింది. నేషనల్ పేమెంట్స్ కార్పోరేషన్ ఆఫ్ ఇండియా (NPCI) ప్రకారం వాల్ మార్ట్ నేతృత్వంలోని ఫోన్ పే డిసెంబర్ నెలలో ముందుకు వచ్చింది. ఫోన్ పే గత నెలలో 902.3 మిలియన్ల ట్రాన్సాక్షన్స్ నిర్వహించగా, వీటి మొత్తం వ్యాల్యూ రూ.1.82,126.88 కోట్లు. ఇక, గూగుల్ పే 854.49 మిలియన్ల ట్రాన్సాక్షన్స్ నిర్వహించగా వీటి వ్యాల్యూ రూ.1.76,199.33 కోట్లు.
ఈ రెండు డిజిటల్ పేమెంట్స్ యాప్స్ వాటా డిసెంబర్ నెలలో 78 శాతం వాటా ఉంది. డిసెంబర్ నెలలో మొత్తం 2,234.16 మిలియన్ల యూపీఐ ట్రాన్సాక్షన్స్ నిర్వహించారు. వ్యాల్యూమ్ పరంగా ఈ రెండింటి వ్యాల్యూ రూ.4,16,176.21 కోట్లు. వ్యాల్యూమ్ పరంగా వీటి వాటా 86 శాతం. NPCI డేటా ప్రకారం డిసెంబర్ నెలలో ఫోన్ పే వృద్ధి రేటు 3.87 శాతంగా ఉంది. వ్యాల్యూమ్ పరంగా 3.8 శాతంగా ఉంది. నవంబర్ నెలలో ఫోన్ పే ట్రాన్సాక్షన్స్ 868.4 మిలియన్ ట్రాన్సాక్షన్స్ ఉండగా, వ్యాల్యూమ్ పరంగా 1.75,453.85 కోట్లుగా ఉంది.

ఇక, గూగుల్ పే మాత్రం 11 శాతం పడిపోయింది. వ్యాల్యూ పరంగా 9.15 శాతం తగ్గింది. నవంబర్ నెలలో వ్యాల్యూమ్ పరంగా 960.02 మిలియన్ ట్రాన్సాక్షన్లు, వ్యాల్యూ ప రంగా రూ.1,61,418.19 కోట్లుగా ఉంది. ఆ తర్వాత అమెజాన్ పే, భీమ్ యాప్ నాలుగు, అయిదో స్థానాల్లో ఉన్నాయి.