For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

Petrol prices today: వరుసగా 26వ రోజు స్థిరంగా పెట్రోల్ ధరలు

|

పెట్రోల్, డీజిల్ ధరలు దాదాపు 4 వారాలుగా స్థిరంగా ఉంటున్నాయి. చమురు ధరలు వరుసగా 26వ రోజు మంగళవారం(నవంబర్ 30) స్థిరంగా ఉన్నాయి. కేంద్ర ప్రభుత్వం ఎక్సైజ్ సుంకాన్ని తగ్గించిన అనంతరం ధరలు తగ్గాయి. కొద్ది రోజుల క్రితం మోడీ ప్రభుత్వం పెట్రోల్ పైన రూ.5, డీజిల్ పైన రూ.10 ఎక్సైజ్ సుంకాన్ని తగ్గించి దీపావళికి శుభవార్త చెప్పింది. పలు రాష్ట్రాలు కూడా కేంద్రం బాటలో నడిచి లీటర్ పెట్రోల్, డీజిల్ పైన రూ.7 చొప్పున తగ్గించాయి. తెలుగు రాష్ట్రాల్లో రాష్ట్ర ప్రభుత్వాలు యథాతథంగా కొనసాగిస్తున్నాయి. ధరలు తాము తగ్గించేది లేదని చెబుతున్నాయి. కాబట్టి తెలుగు రాష్ట్రాల్లో కేంద్రం తగ్గింపు పెట్రోల్ పైన రూ.5, డీజిల్ పైన రూ.10 మాత్రమే వర్తిస్తోంది.

కేంద్రం తగ్గింపుకు రాష్ట్రాల వ్యాట్ తగ్గింపు తోడు కావడంతో పెట్రోల్ పైన రూ.12, డీజిల్ పైన రూ.17 వరకు తగ్గింది. పెట్రోల్, డీజిల్ ధరలు పలు నగరాల్లో రూ.100 దిగువకు వచ్చాయి. ఢిల్లీ (రూ.94.14), కోల్‌కతా (రూ.89.79), చెన్నై (రూ.91.43), భోపాల్ (రూ.90.87లలో డీజిల్ ధర రూ.100 లోపు ఉంది. కేంద్రం తగ్గింపు తర్వాత పలు రాష్ట్రాలు వ్యాట్ తగ్గించాయి. కానీ చత్తీస్‌గఢ్, మహారాష్ట్ర, జార్ఖండ్, తమిళనాడు, ఢిల్లీ, పశ్చిమ బెంగాల్, కేరళ, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలలో వ్యాట్ తగ్గించలేదు.

అయితే అంతర్జాతీయంగా చమురు ధరలు ఇటీవల భారీగా తగ్గాయి. ఈ నేపథ్యంలో దేశీయంగా ధరలు కాస్త తగ్గుముఖం పట్టే అవకాశాలు కనిపిస్తున్నాయి. ప్రస్తుతం హైదరాబాద్‌లో లీటర్ పెట్రోల్ రూ.108.20, లీటర్ డీజిల్ రూ.94.62గా ఉంది. విజయవాడలో నేడు ధరలు అతి స్వల్పంగా తగ్గాయి. లీటర్ పైన 57 పైసలు క్షీణించి రూ.110.36, లీటర్ డీజిల్ పైన 0.51 పైసలు తగ్గి రూ.96.45గా ఉంది.

Petrol prices today: వరుసగా 26వ రోజు స్థిరంగా పెట్రోల్ ధరలు

యూరోపియన్ ప్రాంతంలో కరోనా కేసులు పెరగడం, జపాన్, భారత్ వంటి దేశాల్లో చమురు నిల్వలు ఉండటం, ఈ దేశాల్లో ఓవర్-సప్లై, బలహీనమైన డిమాండ్ ఉండటం వంటి అంశాలు ప్రభావం చూపనున్నాయి.

బ్రెంట్ క్రూడ్, యూఎస్ టెక్సాస్ ఇంటర్మీడియేట్ క్రూడ్ ధరలు తగ్గాయి. బ్రెంట్ క్రూడ్ బ్యారెల్ 11.55 శాతం తగ్గి 72.72 డాలర్లకు వచ్చింది. వెస్ట్ టెక్సాస్ ఇంటర్మీడియేట్ ధర 12.06 శాతం క్షీణించి 68.15 డాలర్లకు వచ్చింది. యూరోపియన్ దేశాల్లో కరోనా కేసుల ఆందోళన నేపథ్యంలో చమురు డిమాండ్ తగ్గుతుందని భావిస్తున్నారు. దీంతో అంతర్జాతీయంగా ధరలు భారీగా క్షీణించాయి.

అంతర్జాతీయంగా ధరలు తగ్గించడం వల్ల ఇప్పుడు భారత్‌లోను ఈ ధరలు మరింత తగ్గిస్తారా అంటే, అంతర్జాతీయ మార్కెట్లో ధరలు మరికొద్ది రోజులు క్షీణిస్తేనే అది వర్తిస్తుందని అంటున్నారు. దేశీయ రిటైల్ ధరలు 15 రోజుల రోలింగ్ యావరేజ్ విధంగా నిర్ణయించబడుతాయి. కాబట్టి గ్లోబల్ మార్కెట్లో మరిన్ని రోజులు తగ్గితేనే ఇక్కడా తగ్గుతాయి. అంతర్జాతీయ మార్కెట్లో నవంబర్ 25వ తేదీ వరకు ధరలు గరిష్టాల వద్ద ఉన్నాయి. ధరలు గత రెండు రోజులుగా మాత్రమే పడిపోయాయి.

English summary

Petrol, diesel prices today: Rates constant on 30 November

The price of oil fell by $10 a barrel to $73.18 on Friday on top of already lower wholesale prices meaning petrol is now around 12p a litre too expensive while diesel is 10p too high.
Story first published: Tuesday, November 30, 2021, 7:15 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X