For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

అలాంటి వాటిలో ఇన్వెస్ట్ చేయలేక..: ఇక, IPOల్లో పెట్టుబడులకు పెన్షన్ నిధులు

|

పెన్షన్‌దారుల సొమ్ము త్వరలో పబ్లిక్ ఆఫరింగ్స్(IPO), లిస్టెడ్ కంపెనీల షేర్లలో పెట్టుబడిగా పెట్టనున్నారు. వీటిలో ఇన్వెస్ట్ చేసేందుకు పెన్షన్ ఫండ్ మేనేజర్స్(PFM)కు మరో ముడు నుండి నాలుగు రోజుల్లో అనుమతి రానున్నట్లు పెన్షన్ రెగ్యులేటరీ అండ్ డెవలప్‌మెంట్ అథారిటీ(PFRDA) చైర్మన సుప్రతిమ్ బంధోపాధ్యాయ తెలిపారు. ప్రస్తుతం ఆప్షన్స్ అండ్ ఫ్యూచర్స్‌లో ట్రేడ్ అవుతూ, రూ.5000 కోట్లకు పైగా మార్కెట్ వ్యాల్యూ కలిగిన షేర్లలో మాత్రమే PFMలు పెట్టుబడులు పెట్టేందుకు అనుమతి ఉండగా, ఇది ఫండ్ మేనేజరల అవకాశాలను పరిమితం చేస్తోంది. అయితే దీనిని మార్చడంతో ఐపీవోల్లో, లిస్టెడ్ కంపెనీల్లో ఇన్వెస్ట్ చేయవచ్చు.

సబ్‌స్క్రిప్షన్ పెంపు

సబ్‌స్క్రిప్షన్ పెంపు

కొత్త పెన్షన్ స్కీం ప్రారంభమైనప్పటి నుండి PFMలు ఈక్విటీ పెట్టుబడుల పైన 11.31 శాతం సంచిత వార్షిక రిటర్న్స్ అందించగలిగారని ఆయన ఈ సందర్భంగా పేర్కొన్నారు. కార్పొరేట్‌ డెట్‌ పథకాల్లో పెట్టుబడులపై 10.21 శాతం, ప్రభుత్వ సెక్యూరిటీలపై 9.69 శాతంగా నమోదైన రిటర్న్స్ కన్నా అధికమని బంధోపాధ్యాయ అన్నారు. కాగా, ఐపీవోలతో పాటు లిస్టెడ్ కంపెనీల్లో పెట్టుబడులు పెట్టే నిమిత్తం త్వరలో అనుమతులు వస్తే సబ్‌స్క్రైబర్ల సంఖ్య పెంచుకునే అవకాశాలు ఉన్నాయి. కరోనా తర్వాత ఈక్విటీల్లో పెట్టుబడులపై ఆసక్తి పెరిగిందని బంధోపాధ్యాయ చెప్పారు.

అలాంటి వాటిలో పెట్టుబడులు పెట్టలేక

అలాంటి వాటిలో పెట్టుబడులు పెట్టలేక

ప్రస్తుతం ఫ్యూచర్స్, ఆప్షన్స్(F&O) విభాగంలో రూ.5,000 కోట్లకు మించి మార్కెట్ వ్యాల్యూ కలిగిన షేర్లలో మాత్రమే పెట్టుబడులు పెట్టేందుకు పీఎఫ్‌ఎమ్‌లకు అనుమతి ఉంది. ఈక్విటీ పెట్టుబడుల్లో మంచి రిటర్న్స్ పొందేందుకు ఉన్న అవకాశాలను ఈ ఆంక్షలు పరిమితం చేస్తున్నాయనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఇందుకు ఉదాహరణగా అవెన్యూ సూపర్ మార్ట్స్ షేరును పేర్కొంటున్నారు. మంచి రిటర్న్స్ ఆర్జిస్తున్న ఈ షేర్, F&Oలో లేదు. దీంతో పెట్టుబడులు పెట్టలేకపోతున్నారని అంటున్నారు.

 మరిన్ని విభాగాల్లో పెట్టుబడులు

మరిన్ని విభాగాల్లో పెట్టుబడులు

ఈక్విటీల్లో మరిన్ని విభాగాల్లో పెట్టుబడులు పెట్టే అంశానికి సంబంధించి ఈ వారంలో కొత్త నిబంధనలు నోటిఫై చేయనున్నట్లు తెలిపారు. ఈ కొత్త నిబంధనల ప్రకారం పబ్లిక్ ఇష్యూలు, మలివిడత పబ్లిక్ ఆఫర్, ఆఫర్ ఫర్ సేల్స్‌లో PFMs పెట్టుబడులు పెట్టే వెసులుబాటు కలుగుతుంది. అలాగే షేర్ల ఎంపిక పరిధి పెరుగుతుంది. అప్పుడు అత్యుత్తమ 200 కంపెనీల షేర్లలో పెట్టుబడులు పెట్టవచ్చనని పేర్కొన్నారు. ఈక్విటీ పెట్టుబడులకు సంబంధించి నష్టభయాన్ని నివారించేందుకు కొన్ని ప్రత్యేక సూచనలు కూడా ఉంటాయన్నారు.

English summary

అలాంటి వాటిలో ఇన్వెస్ట్ చేయలేక..: ఇక, IPOల్లో పెట్టుబడులకు పెన్షన్ నిధులు | Pension fund managers will be allowed to invest in IPOs and listed firms

Pension funds will soon be allowed to invest in select publicly listed firms and initial public offerings.
Story first published: Wednesday, July 21, 2021, 9:37 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X