For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

విలీనం దిశగా పేటీఎం మాల్ - గ్రోఫెర్స్.. త్వరలోనే నిర్ణయం!

|

దేశంలో డిజిటల్ పేమెంట్ రంగంలో విప్లవాత్మక మార్పులు తెచ్చిన పేటీఎం... మరో కీలక ముందగుడు వేయబోతోంది. పేటీఎం మాల్ పేరుతో ఈ కంపెనీ ఇప్పటికే ఒక ఈ కామర్స్ సంస్థను ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. అయితే తొలుత తీవ్ర నష్టాలు రావటంతో కొన్ని రోజులు తాత్కాలికంగా కార్యకలాపాలు నిలిపివేసింది. కానీ ఇటీవలే మళ్ళీ తిరిగి ఈ కామర్స్ సేవలను ప్రారంభించి. ఇలా ఉండగా... దేశం లో కరోనా వైరస్ విస్తరించిన తర్వాత... లాక్ డౌన్ ప్రకటించటంతో ఉన్నట్టుండి గ్రోసరీస్ కు విపరీతమైన డిమాండ్ ఏర్పడింది.

ప్రజలు ఇళ్లకే పరిమితం అవటంతో ఆన్లైన్ లో గ్రోసరీస్ కొనుగోలు చేసేందుకు ఆసక్తి చూపారు. ప్రభుత్వాలు కూడా గ్రోసరీస్ డెలివరీ కంపెనీలకు అనుమతి ఇవ్వటంతో ఈ రంగంలో ఉన్న బిగ్ బాస్కెట్, గ్రోఫెర్స్ వంటి కంపెనీలకు విపరీతమైన ఆర్డర్లు లభించాయి. వాటిని డెలివరీ చేసేందుకు ఆయా కంపెనీలు చాలా కష్టపడాల్సి వచ్చింది. అయితే, ఇప్పుడిప్పుడే మళ్ళీ పరిస్థితులు చక్కబడుతుండటంతో... అన్ని రకాల ఈ కామర్స్ కంపెనీల కార్యకలాపాలకు మార్గం సుగమం అయింది. దీంతో మళ్ళీ మార్కెట్లో పోటీ మొదలైంది. ఈ నేపథ్యంలో పేటీఎం ఒక వ్యూహాత్మక నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం.

హెరిటేజ్ ఫుడ్స్ నష్టం రూ.210 కోట్లు, నారా బ్రాహ్మణి ఏం చెప్పారంటే

విలీనం దిశగా చర్చలు...

విలీనం దిశగా చర్చలు...

పేటీఎం మాల్ లో గ్రోఫెర్స్ ను విలీనం చేసుకునే దిశగా రెండు కంపెనీల మధ్య చర్చలు మొదలైనట్లు తెలిసింది. ఈ రెండు సంస్థల్లోనూ ప్రధాన ఇన్వెస్టర్ జపాన్ కు చెందిన సాఫ్ట్ బ్యాంకు కావటం విశేషం. అయితే, కొంత కాలంగా సాఫ్ట్ బ్యాంకు భారీ నష్టాలను నమోదు చేస్తోంది. ఆ కంపెనీ పెట్టుబడులు లాభాలు తీసుకు రాకపోగా... నష్టాలు మిగిల్చాయి. ఈ నేపథ్యంలో అటు పేటీఎం మాల్ లో గానీ ఇటు గ్రోఫెర్స్ లో కానీ కొత్త పెట్టుబడులు సాధ్యం కాదని తేల్చి చెప్పింది. దానికి బదులుగా.. రెండు సంస్థలు విలీనమై ఒకరి నెట్వర్క్ మరొక సంస్థ వినియోగించుకుంటే ఖర్చులు తగ్గటంతో పాటు లాభాల దిశగా పయనించవచ్చని భావిస్తున్నారు. అందుకే ప్రస్తుతం పేటీఎం, గ్రోఫెర్స్ మధ్య విలీనం చర్చలు జరుగుతున్నాయి.

పేటీఎం మాల్ వద్ద రూ 1,275 కోట్లు...

పేటీఎం మాల్ వద్ద రూ 1,275 కోట్లు...

ప్రస్తుతం పేటీఎం మాల్ వద్ద సుమారు రూ 1,275 కోట్ల (170 మిలియన్ డాలర్లు) నిధులు ఉన్నాయి. కాబట్టి, ఈ నిధులతో అటు గ్రోఫెర్స్ బిజినెస్ ను కూడా మరింత ముందుకు తీసుకువెళ్లవచ్చని పెట్టుబడిదారులు భావిస్తున్నారు. కంపెనీకి కొత్తగా నిధుల ప్రవాహం కష్టమే కాబట్టి ప్రస్తుతం ఉన్న నిధులతో రెండు సంస్థలు ఏకతాటిపైకి తీసుకొస్తే ఫలితం ఉంటుందని యోచిస్తున్నారు. ఇదిలా ఉండగా.. ప్రస్తుతం సాఫ్ట్ బ్యాంకు కు పేటీఎం మాల్ లో సుమారు 20% కి పైగా వాటా ఉండగా.. గ్రోఫెర్స్ లో దానికి 40% వాటా ఉంది. పైగా గ్రోఫెర్స్ లో సాఫ్ట్ బ్యాంకే ప్రధాన వాటాదారు కూడా కావటం విశేషం. అందుకే ఈ రెండు సంస్థల విలీనం జరగటానికి అవకాశాలు మెండుగా ఉన్నాయని విశ్లేషకులు పేర్కొంటున్నారు. అయితే, డీల్ విషయంలో మాత్రం ప్రస్తుతం రెండు సంస్థల మధ్య ఏకాభిప్రాయం కుదరలేదని తెలుస్తోంది.

జియో దెబ్బతో...

జియో దెబ్బతో...

ఇండియా కుబేరుడు ముకేశ్ అంబానీ కి చెందిన రిలయన్స్ జియో మార్ట్ రాకతో మార్కెట్లో పరిణామాలు పూర్తిగా మారిపోయాయని నిపుణులు విశ్లేషిస్తున్నారు. ఇప్పటికే జియో మార్ట్ దేశంలోని 200 నగరాల్లో సేవలు ప్రారంభించగా... దాని నుంచి ఎదురయ్యే పోటీని తట్టుకుని నిలబడాలంటే.. ఇప్పుడు మార్కెట్లో ఉన్న కంపెనీల మధ్య విలీనం తప్పనిసరి అని భావిస్తున్నారు. లేదంటే పోటీలో వెనుకబడిపోయే అవకాశాలు అధికం అని అంటున్నారు. మరోవైపు పేటీఎం కూడా ప్రముఖ మిల్క్ డెలివరీ కంపెనీ మిల్క్ బాస్కెట్ ను కొనుగోలు చేసేందుకు కూడా చర్చలు ప్రారంభించిందని మార్కెట్లో చర్చలు జరుగుతున్నాయి. ఇలా గ్రోసరీస్, నిత్యావసర సరుకుల డెలివరీ విభాగంలో విపరీతమైన పోటీ నెలకొంటోంది. పెద్ద పెద్ద ప్లేయర్ల రాకతో చిన్న ప్లేయర్లు వాటిలో విలీనం అయిపోవటమో... లేదా వాటికి కొనుగోలు టార్గెట్ గా నిలవటమో జరగటం బిజినెస్ లో సర్వ సాధారణ విషయమే. ప్రస్తుతం పేటీఎం, గ్రోఫెర్స్ విషయంలో సరిగ్గా అదే జరుగుతోందని చెబుతున్నారు.

Read more about: online paytm paytm mall
English summary

Paytm Mall in talks for Grofers stake as SoftBank pushes for consolidation

Online retailer Paytm Mall has held talks with e-grocer Grofers for a potential investment, multiple people in the know told ET, adding that the ongoing discussions may even lead to a merger.
Story first published: Friday, May 29, 2020, 18:54 [IST]
Company Search
Thousands of Goodreturn readers receive our evening newsletter.
Have you subscribed?
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Goodreturns sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Goodreturns website. However, you can change your cookie settings at any time. Learn more