పేటీఎం మాల్ దీపావళి మహా షాపింగ్ ఫెస్టివెల్, వేలాది బ్రాండ్స్‌పై అదిరిపోయే డీల్
ఈ-కామర్స్ సేవలతో దేశవ్యాప్తంగా ఎస్ఎంఈలను శక్తివంతం చేస్తోన్న స్వదేశీ ఈ-కామర్స్ ఓ2ఓ (ఆఫ్‌లైన్ టు ఆన్లైన్) ప్లాట్‌ఫామ్ పేటీఎం మాల్ నవంబర్ 3వ తేదీ నుండి రెండు వారాల దీపావళి ప్రత్యేక మహా షాపింగ్ ఫెస్టివల్‌ను ప్రకటించింది. నవంబర్ 16వ తేదీ వరకు ఉండే ఈ షాపింగ్ ఫెస్టివెల్ కోసం పేటీఎం మాల్ 5000 బ్రాండ్స్, ప్రముఖ బ్యాంకులతో జతకట్టింది. 10 లక్షలకు పైగా ఉత్పత్తులపై కస్టమర్లకు బెస్ట్ డీల్స్, డిస్కౌంట్స్ అందిస్తోంది.
సిటీ బ్యాంక్, ఐసిఐసిఐ బ్యాంకులతో జత కట్టింది. ఈ బ్యాంకుల క్రెడిట్ కార్డు, డెబిట్ కార్డు చెల్లింపులపై 10 శాతం వరకు క్యాష్ బ్యాక్ రూ.3,000 వరకు పొందవచ్చు. ఐసిఐసిఐ బ్యాంకు కస్టమర్లు ఈఎంఐ ట్రాన్సాక్షన్స్ పైన అద్భుత ఆఫర్‌ను అందిస్తున్నారు. దేశమంతటా అన్ని పిన్ కోడ్స్ నుండి ఆర్డర్లను స్వీకరిస్తున్నట్లు పేటీఎం మాల్ తెలిపింది. పేటీఎం మాల్ అంతర్జాతీయ బ్రాండ్స్తోను జత కట్టింది. వివిధ విభాగాల్లో కొత్త ఉత్పత్తులు అందించే వందలాది ఎంఎస్ఎంఈలు, మేడిన్ ఇండియా బ్రాండ్స్‌తో భాగస్వామ్యం కలిగి ఉంది. 1.5 లక్షల ఉత్పత్తులను ఉచితంగా షిప్పింగ్ చేస్తోంది.

దుస్తులు, పాదరక్షలు, ఉపకరణాలలో 2 లక్షలకు పైగా రకాల ఉత్పత్తులపై 50 శాతం, అంతకంటే ఎక్కువతగ్గింపుతో అందిస్తున్నట్లు పేటీఎం మాల్ తెలిపింది. పండుగ సేల్స్‌లో భాగంగా 200 పైగా బ్రాండ్స్, డిస్కౌంట్లో ఉన్నాయి. ఆపిల్, గార్మిన్, స్మార్ట్ వాచ్‌లు వంటి వాటిపై రూ.5,000 క్యాష్ బ్యాక్ వరకు ఉంది.