For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

విస్తరణ కోసం రూ.10,000 కోట్ల పెట్టుబడి, రెండేళ్లలో లాభాల్లోకి పేటీఎం: విజయ్ శేఖర్ శర్మ

|

డిజిటల్ పేమెంట్ల సేవలు అందించే ప్రముఖ ఇండియన్ స్టార్టుప్ కంపెనీ పేటీఎం... లాభాల వేటలో పడింది. 2010 లో స్థాపించిన ఈ కంపెనీ ఇప్పటి వరకు భారీ నష్టాలనే మూటగట్టుకుంది. లాభాలు అన్న మాటే తెలియకుండా తన సేవలను కొనసాగిస్తోంది. ఏటా నష్టాల భారాన్ని కూడా పెంచుకుంటూ పోతోంది. అయితే, ఇకపై అలా ఏమీ ఉండదని, వచ్చే రెండేళ్లలోనే పేటీఎం ను లాభాల బాట పెట్టిస్తామని దాని ఫౌండర్ విజయ్ శేఖర్ శర్మ వెల్లడించారు. మరో వైపు దేశంలో తమ సేవల విస్తరణ కోసం వచ్చే రెండు, మూడేళ్ళలో రూ 10,000 కోట్ల వరకు పెట్టుబడులు పెడతామని అయన చెప్పారు. పేటీఎం లాభాల బాట పట్టేందుకు అనుసరించాల్సిన వ్యూహాలను సిద్ధం చేశామని, సరైన ప్రణాళికతో ముందుకు సాగుతామని తెలిపారు. ఇందుకోసం ఇప్పటికే ఉన్న యూసర్ బేస్ ను సరిగ్గా ఉపయోగించుకుంటూ... ఆర్థిక సేవల విస్తరణ, కామర్స్ విభాగాలపై అధిక దృష్టి సారిస్తామని స్పష్టం చేసారు. ప్రముఖ వార్త ఏజెన్సీ ప్రెస్ ట్రస్ట్ ఆఫ్ ఇండియా (పీటీఐ) కు ఇచ్చిన ఒక ప్రత్యేక ఇంటర్వ్యూ లో విజయ్ శేఖర్ శర్మ ఈ వ్యాఖ్యలు చేశారు.

నిమిషాల్లోనే ఉచితంగా పాన్‌కార్డు తీసుకోండి, ఇలా చేయండి

వచ్చే క్వార్టర్ లో తొలి లాభం...

వచ్చే క్వార్టర్ లో తొలి లాభం...

2015 లో క్యూర్ కోడ్స్ అమలు చేసిన పేటీఎం... ప్రస్తుతం దాని నుంచి లబ్ది పొందుతోందని పేటీఎం బాస్ తెలిపారు. 2016 లో దేశంలో పెద్ద నోట్ల రద్దు తర్వాత డిజిటల్ పేమెంట్ సేవల కంపెనీలకు విపరీతమైన ఆదరణ లభించింది. అందులో అన్నిటికన్నా అధికంగా లబ్ది పొందిన కంపెనీ పేటీఎం అని చెప్పొచ్చు. ఆర్థిక సేవలు సరైన మార్గంలో పయనిస్తున్నాయని, పేటీఎం మాల్ ఇప్పటికే లాభాల బాట పట్టిందని చెప్పారు. ఇకపోతే పన్నులకు ముందు తమ నష్టాలు భారీగా తగ్గిపోయాయని తెలిపారు. మార్కెట్లో తమకు అగ్రస్థానం ఉందన్న ఆయన... దానిని నిలుపుకుంటూనే సేవల మోనిటైజషన్ ఫై దృష్టి సరిస్తున్నామని చెప్పారు. ఇవన్నీ కలిసి వచ్చే క్వార్టర్ లోనే తాము తొలి లాభాన్ని నమోదు చేసే అవకాశం ఉందని స్పష్టం చేశారు.

విస్తరణపై భారీ పెట్టుబడులు...

విస్తరణపై భారీ పెట్టుబడులు...

ఒక వైపు డిజిటల్ పేమెంట్స్ సేవలను అందిస్తూనే... పేటీఎం ఆర్థిక సేవలని పటిష్టం చేసుకోవాలని చూస్తోంది. అదే సమయంలో పేటీఎం క్లౌడ్ సేవలను కూడా విస్తరించే పనిలో పడింది. దేశంలోనే ఈ కంపెనీ పేమెంట్ గేట్వే సేవలు అందించటంలో ముందుంటుంది. అనేక ప్రభుత్వ రంగ టిక్కెటింగ్ సంస్థలు కూడా పేటీఎం సేవలను వినియోగించుకుంటున్నాయి. ఇకపోతే వచ్చే రెండు, మూడేళ్ళలో ప్రస్తుతం ఉన్న అన్ని రకాల సేవలను మరింత సమర్థవంతంగా వినియోగదారులకు అందించేందుకు భారీగా పెట్టుబడులు పెట్టనుంది. ఇందుకోసం ఏకంగా రూ 10,000 కోట్లను వెచ్చిస్తామని విజయ్ శేఖర్ శర్మ వెల్లడించటం విశేషం. ఇంత భారీ స్థాయిలో ఇండియాలో విస్తరించే యోచనలున్న మరో కంపెనీ దరిదాపుల్లో కూడా లేకపోవటం పేటీఎం కు కలిసొచ్చే అంశంగా అనలిస్టులు భావిస్తున్నారు. ఆల్ ఇన్ వన్ పేమెంట్ ఆప్ ను విడుదల చేసిన పేటీఎం... ఏడాదిలో మరో 1 కోటి మంది మర్చంట్ల ను తమ ప్లాట్ఫారం పైకి తేవాలని లక్ష్యంగా పెట్టుకుంది. ప్రస్తుతం పేటీఎం సుమారు కోటి అరవై లక్షల మంది వర్తకులకు తన సేవలను అందిస్తోంది.

16 బిలియన్ డాలర్ల వాల్యుయేషన్...

16 బిలియన్ డాలర్ల వాల్యుయేషన్...

ఇండియాలో ఫ్లిప్కార్ట్ తర్వాత అత్యంత విలువ కలిగిన స్టార్టుప్ యునికార్న్ కంపెనీల్లో పేటీఎం కూడా చేరిపోయింది. గతేడాది విస్తరణ కోసం పేటీఎం సుమారు 1 బిలియన్ (దాదాపు రూ 7,000 కోట్లు) పెట్టుబడులను సమీకరించింది. అమెరికా కు చెందిన టీ రోవె ప్రైస్ అనే పెట్టుబడి సంస్థ తో పాటు, అలీబాబా, సాఫ్ట్ బ్యాంకు కంపెనీల నుంచి ఇంత భారీ ఇన్వెస్ట్మెంట్ రాబట్టగలిగింది. దీంతో ప్రస్తుతం పేటీఎం వాల్యుయేషన్ ఏకంగా 16 బిలియన్ డాలర్ల (సుమారు రూ 1.12 లక్షల కోట్లు) కు పెరిగిపోయింది. అమెరికాకు చెందిన ప్రపంచంలోనే అతిపెద్ద రిటైల్ కంపెనీ వాల్మార్ట్ ... మన దేశ ఈ కామర్స్ దిగ్గజం ఫ్లిప్కార్ట్ ను కొనుగోలు చేసినప్పుడు దానికి కట్టిన విలువ కూడా 16 బిల్లియన్ డాలర్లు కావటం విశేషం.

English summary

Paytm founder Vijay Shekhar Sharma reveals road to profitability

Digitial payment giant Paytm expects to turn profitable after two years as it is monetising the existing customer base and eyes financial services as its next major frontier for growth, its founder CEO Vijay Shekhar Sharma said.
Story first published: Monday, February 24, 2020, 8:12 [IST]
Company Search
Thousands of Goodreturn readers receive our evening newsletter.
Have you subscribed?
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Goodreturns sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Goodreturns website. However, you can change your cookie settings at any time. Learn more