For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

అలా ఐతే వదిలేద్దాం!: ప్రభుత్వానికి వొడాఫోన్ ఐడియా పరోక్ష హెచ్చరిక

|

ముంబై: వొడాఫోన్ ఐడియా లిమిటెడ్‌లో కొత్త పెట్టుబడులు పెట్టే ఆలోచన లేదని ఆదిత్య బిర్లా గ్రూప్ గురువారం స్పష్టం చేసింది. లైసెన్స్ ఫీజులు, సర్దుబాటు స్థూల ఆదాయం (AGR) బకాయిలపై సుప్రీం కోర్టు తీర్పు నేపథ్యంలో దేశీయ టెలికం పరిశ్రమపై పెను భారం పడిందని, తమను ఆదుకోని పక్షంలో దివాళాకు వెళ్తామని హెచ్చరించింది. ఇప్పటికే వోడాఫోన్ సీఈవో నిక్ రీడ్ భారత్‌లో భవిష్యత్తుపై ఆందోళన వ్యక్తం చేశారు. ఇప్పుడు ఆదిత్య బిర్లా గ్రూప్ సాయం చేయాలని కోరింది. లేదంటే దివాళాకు వెళ్తామని చెబుతోంది.

AGR దెబ్బ: టెలికం కంపెనీల ఆందోళన

నిన్న వొడాఫోన్ బాస్.. నేడు ఆదిత్య బిర్లా..

నిన్న వొడాఫోన్ బాస్.. నేడు ఆదిత్య బిర్లా..

అధిక పన్నులు, చార్జీల భారం తగ్గించకుంటే కొనసాగే పరిస్థితులు లేవని నిక్ రీడ్ ఇటీవల చెప్పిన విషయం తెలిసిందే. సుప్రీం కోర్టు ఆదేశాలతో వేల కోట్ల రూపాయలను చెల్లించాల్సి వస్తుందని ఆందోళన వ్యక్తం చేశారు. వొడాఫోన్ ఐడియా జాయింట్ వెంచర్ రెండో భాగస్వామి ఐడియా కూడా ఇదే అభిప్రాయం వ్యక్తం చేసింది. ఈ రెండు కంపెనీలు గత ఏడాది కలిసిపోయాయి. ఇవి వొడాఫోన్ ఐడియాగా కార్యకలాపాలను సాగిస్తున్నాయి. సుప్రీం కోర్టు తీర్పు నేపథ్యంలో టెలికం పరిశ్రమపై రూ.1.4 లక్షల కోట్ల భారం పడనుంది. ఈ తీర్పు ప్రభావం ఎక్కువగా వొడాఫోన్ ఐడియా, ఎయిర్‌టెల్ పైన పడుతున్నాయి. జియో స్వల్ప మొత్తంలో చెల్లించాల్సి వస్తోంది.

అందరికీ లాభాలు కానీ...

అందరికీ లాభాలు కానీ...

వొడాఫోన్ - ఐడియా క్లోజ్ చేసే అవకాశాలు ఉన్నాయని గతంలోనే వార్తలు వచ్చాయి. ఇప్పుడు భాగస్వాములు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తుండటం గమనార్హం. సుప్రీం కోర్టు తీర్పు నేపథ్యంలో వొడాఫోన్ ఐడియాపై AGR బకాయిల భారం రూ.44 వేల కోట్లకు పైగా ఉంటాయని చెబుతున్నారు. వడ్డీ, జరిమానాలతో కలుపుకుని అదనపు లైసెన్స్ ఫీజు బకాయిలు దాదాపు రూ.28 వేల కోట్లుగా ఉంటే, స్పెక్ట్రం వినియోగ చార్జీల బకాయిలు రూ.16,500 కోట్లకు పైగా ఉంటాయని చెబుతున్నారు. భారతీయ టెలికం వ్యాపారం అందరికీ లాభాలు అందిస్తోందని, ఒక్క టెలికం సంస్థలకు మాత్రం లాభాలు లేవని, అస్థిరంగా ఉందన్న నిక్ రీడ్ వ్యాఖ్యలను సమర్థిస్తున్నారు.

మనుగడ ప్రశ్నార్థకం

మనుగడ ప్రశ్నార్థకం

ప్రభుత్వం నుంచి మినహాయింపులు ఏమీ రాకుంటే మార్కెట్లో మనగలుగుతామా అనే సందేహాన్ని వ్యక్తం చేసిన వొడాఫోన్ ఐడియా సుప్రీం కోర్టులో రివ్యూ పిటిషన్ వేసేందుకు సిద్ధమవుతున్నట్లు తెలిపింది. ప్రభుత్వం నుంచి వచ్చే ఊరట ప్రకటనపై తమ మనుగడ ఆధారపడి ఉంటుందని, సానుకూల నిర్ణయం ఉంటుందని భావిస్తున్నామని తెలిపింది. వొడాఫోన్ ఐడియా భవిష్యత్తు అగమ్య గోచరంగా మారింది. తాజా క్వార్టర్ ఫలితాలు కంపెనీ మనుగడను ప్రశ్నార్థకంగా మార్చాయి. ప్రస్తుతం వొడాఫోన్ ఐడియా కంపెనీ ఈక్విటీలో ఆదిత్య బిర్లా గ్రూప్ వాటా 26%, బ్రిటన్ కంపెనీ వొడాఫోన్‌ గ్రూప్ వాటా 43% ఉంది. విలీన సమయంలో ఈ కంపెనీలు రైట్స్ ఇష్యూ కింద రూ.25,000 కోట్ల ఈక్విటీ పెట్టుబడులు సమకూర్చాయి.

అప్పట్లో ఒక్కో షేర్‌ను రూ.12.5 చొప్పున కేటాయించారు. ఇప్పుడు అదే షేర్ ధర రూ.2.95 స్థాయిలో ట్రేడ్ అవుతోంది. మరిన్ని నిధులు కేటాయించేందుకు ప్రమోటర్లు ఆసక్తిగా లేరు. వొడాఫోన్‌ ఐడియా దివాలా ప్రక్రియకు పోయినా పట్టించుకోకపోవడమే మేలని ఆదిత్య బిర్లా గ్రూప్, వొడాఫోన్‌ గ్రూప్ ఇప్పటికే నిర్ణయానికి వచ్చాయని వార్తలు వస్తున్నాయి.

రుణభారం రూ.1.02 లక్షల కోట్లు

రుణభారం రూ.1.02 లక్షల కోట్లు

ఈ కంపెనీ నికర రుణ భారం రూ.1.02 లక్షల కోట్లుగా ఉంది. రిలయన్స్ జియో రాకతో దేశీయ టెలికం పరిశ్రమ ముఖచిత్రం మారిపోయిన విషయం తెలిసిందే. అతి తక్కువ ధరలకు ఇంటర్నెట్, ఉచిత వాయిస్ కాల్స్, సందేశాలు.. వంటి కారణంగా టెలికం సంస్థల ఆదాయానికి గండిపడింది. కాగా, సెప్టెంబర్ క్వార్టర్‌లో వొడాఫోన్ ఐడియా నష్టం రూ.54 వేల కోట్లకు పైగా ఉండగా, ఎయిర్ టెల్ నష్టం రూ.23వేల కోట్లకు పైగా ఉంది. రెండు కంపెనీల నష్టం రూ.74,000 కోట్ల వరకు ఉంది.

English summary

opts for insolvency if govt does not provide relief: Aditya Birla Group

Aditya Birla Group will not infuse any fresh equity into Vodafone Idea Ltd, its telecom joint venture with Vodafone Group of UK, and let it opt for insolvency if the government does not provide substantial relief, including on the telco's AGR-based dues, which could be over 39,000 crore, senior executives aware of the matter said.
Story first published: Friday, November 15, 2019, 10:33 [IST]
Company Search
Thousands of Goodreturn readers receive our evening newsletter.
Have you subscribed?
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Goodreturns sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Goodreturns website. However, you can change your cookie settings at any time. Learn more