పీఎం కిసాన్ స్కీం నిధులు కావాలంటే బ్యాంక్ అకౌంట్‌కు ఆధార్ లింక్ చేసుకోవాల్సిందే
న్యూఢిల్లీ: రైతులకు పెట్టుబడి సాయం కోసం ప్రధాని నరేంద్ర మోడీ ప్రభుత్వం ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి యోజన(PM Kisan scheme) పథకాన్ని ప్రారంభించింది. దీంతో కోట్లాది మంది రైతులు ప్రయోజనం పొందుతున్నారు. ప్రతి ఏడాది విడతల వారీగా మొత్తం రూ.6,000 మోడీ ప్రభుత్వం రైతుల అకౌంట్లలో డబ్బులు వేస్తుంది. దీనిని పెట్టుబడి సాయంగా అందిస్తున్నారు. అయితే పీఎం కిసాన్ సమ్మాన్ నిధి యోజన నిధులు కావాలంటే బ్యాంకు ఖాతాను ఆధార్‌కు తప్పనిసరిగా అనుసంధానం చేయాల్సి ఉంటుందని ఇంగ్లీష్ పత్రికల్లో వార్తలు వచ్చాయి.
ఎయిర్టెల్, వొడాఫోన్ ఐడియా ఉచిత కాల్స్: జియో ధరలే తక్కువ

పీఎం కిసాన్ నిధులకు ఆధార్ అనుసంధానం
పీఎం కిసాన్ సమ్మాన్ యోజన నిధుల కోసం బ్యాంకు ఖాతాకు ఆధార్‌ను అనుసంధానం చేసుకునే అంశాన్ని అధికారులు ధృవీకరించాల్సి ఉంది. ఇప్పటి వరకు ఈ పథకాన్నికి ఎలాంటి నిబంధనలు లేవు. నాలుగో విడత సాయం చెల్లించే సమయంలో మాత్రం బ్యాంకు - ఆధార్ లింక్ తప్పనిసరి అనే అంశం తెరపైకి వచ్చింది. ఈ పథకాన్ని ఫిబ్రవరిలో లాంచ్ చేశారు. తొలిసారి ఈ నిబంధన తెరపైకి తెచ్చారు.

వినిమయ శక్తి పెంచేందుకు..
ప్రస్తుతం రూ.10 వేల కోట్ల నిధులను ఆర్థిక వ్యవస్థలోకి చొప్పించి డిమాండుకు ఊతమివ్వాలని కేంద్ర ప్రభుత్వం ప్రయత్నిస్తోంది. ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాలను ఆర్థికంగా బలోపేతం చేసేందుకు చర్యలు తీసుకుంటోంది. జీడీపీ వృద్ధి రేటు భారీగా తగ్గుతోందని, ఈ నేపథ్యంలో గ్రామీణ భారతంలో వినిమయ శక్తిని పెంచేందుకు రూ.10,000 కోట్లను రైతులకు ఒకే రోజు ఇవ్వనున్నామని అధికారులు చెబుతున్నారు.

ఆధార్ అనుసంధానం
ఆధార్ కార్డుతో అనుసంధానించిన బ్యాంకు ఖాతాలకు తాజా విడత PM Kisan నిధులు వస్తాయని, ఈసారి దాదాపు రూ.10 వేల కోట్లను ఒకేరోజు అందచేసే అవకాశాలు ఉన్నాయని వ్యవసాయ శాఖ అధికారి ఒకరు వెల్లడించినట్లు ఎకనమిక్ టైమ్స్ పేర్కొంది. 50 మిలియన్ బ్యాంకు అకౌంట్లకు పైగా అధికారులు లింక్ అయినట్లుగా గుర్తించినట్లు చెబుతున్నారు.