For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

లాక్‌డౌన్ తర్వాత సిలిండర్ బుకింగ్స్ ఎంత పెరిగాయంటే? స్టాఫ్‌కు 5 లక్షల ఎక్స్‌గ్రేషియా

|

దేశంలో ఇంధన కొరత లేదని ప్రభుత్వరంగ చము రు సంస్థ ఇండియన్ ఆయిల్ కార్పోరేషన్ (IOC) ప్రకటించింది. పెట్రోల్, డీజిల్, వంటగ్యాస్ (LPG) సరఫరాల విషయమై వినియోగదారులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని తెలిపింది. కరోనా వ్యాప్తిని నిరోధించేందుకు ప్రస్తుతం దేశవ్యాప్తంగా లాక్‌డౌన్ కొనసాగుతోంది. IOCతో పాటు HPCL కూడా ఇదే ప్రకటన చేసింది.

Fuel Crisis: ఉత్పత్తినే తగ్గించారు.. పెట్రోల్, డీజిల్, గ్యాస్ సిలిండర్ కొరత ఉంటుందా?

40 శాతం అదనంగా..

40 శాతం అదనంగా..

వంట గ్యాస్‌కు కొరత వస్తుందనే ఆందోళనతో ప్రజలు అధికంగా సిలిండర్లు బుక్ చేసుకుంటున్నారని ఇండియన్ ఆయిల్‌తో పాటు హెచ్‌పీసీఎల్, బీపీసీఎల్ తెలిపాయి. ఈ నేపథ్యంలో ఈ కంపెనీలు భరోసా ఇచ్చే ప్రయత్నాలు చేశాయి. వంటగ్యాస్, పెట్రోల్ వంటి ఇంధనాలకు కొరత లేదని, లాక్ డౌన్ నుంచి కనీసం 40 శాతం అదనంగా సరఫరా చేస్తున్నామని ఈ సంస్థలు ప్రకటించాయి.

అధికంగా సిలిండర్ బుకింగ్

అధికంగా సిలిండర్ బుకింగ్

లాక్ డౌన్ విధించాక వంట గ్యాస్ సిలిండర్ల బుకింగ్ పెరిగిందని, అందుకు తగ్గినట్లుగా రోజువారీ సగటు సరఫరా 25 శాతం నుండి దాదాపు 40 శాతం పెరిగిందని, తక్కువ సిబ్బందితోనే వీటిని అందిస్తున్నట్లు IOC, HPCL, BPCL తెలిపాయి. లాక్ డౌన్ మరింతకాలం కొనసాగుతుందనే భయంతో, సిలిండర్లు దొరకవనే ఆందోళనతో ప్రజలు అధకంగా సిలిండర్లు బుక్ చేసుకుంటున్నాయిల తెలిపాయి.

12 లక్షల నుండి 15 లక్షలకు పెరిగిన HPCL సిలిండర్ సరఫరా

12 లక్షల నుండి 15 లక్షలకు పెరిగిన HPCL సిలిండర్ సరఫరా

వంట గ్యాస్‌పై ఆందోళన అవసరం లేదని HPCL ఎండీ ముఖేష్ కుమార్ సురానా తెలిపారు. రోజుకు గతంలో 12 లక్షల సిలిండర్లు సరఫరా చేసేవారమని, ఇప్పుడు 15 లక్షలు చేస్తున్నట్లు తెలిపారు. అంటే 25 శాతం పెరిగింది. డెలివరీ సిబ్బందికి కూడా మాస్కులు, శానిటైజర్లు అందించామని, గుంపులుగా ఉండవద్దని సూచించినట్లు చెప్పారు.

ఇళ్లకు డెలివరీ

ఇళ్లకు డెలివరీ

తమ డెలివరీ సిబ్బందే ఇళ్లకు తీసుకు వెళ్తున్నారని, సొసైటీలలో లోపలకు తేవద్దని చెబితే మాత్రం గేటు వద్ద అప్పగించి వెళ్తున్నారని ముఖేష్ కుుమారా సురానా తెలిపారు. కొన్ని సొసైటీల వద్ద డెలివరీ తీసుకోవడం లేదన్నారు. పెట్రోల్ ఉత్పత్తులు దేశీయ అవసరాలకు సరిపడా ఉందని IOC, HPCL, BPCL కంపెనీలు తెలిపాయి.

200 శాతం పెరిగిన బుకింగ్

200 శాతం పెరిగిన బుకింగ్

లాక్‌డౌన్ ప్రకటించాక వంట గ్యాస్‌ సిలిండర్ల బుకింగ్‌ అమాంతం 200% పెరిగిందని ఐఓసీ చైర్మన్ సంజీవ్ సింగ్ ఆందోళన వ్యక్తం చేశారు. గత పది రోజల నుంచి ప్రభుత్వ రంగంలోని ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలు దేశవ్యాప్తంగా రోజుకు 52 లక్షల సిలిండర్లు సరఫరా చేస్తున్నాయని చెప్పారు. ఇందులో 25 లక్షల సిలిండర్లు ఐఓసీనే సరఫరా చేస్తోందని తెలిపారు. కొరత ఉంటుందనే భయంతో రెండు సిలిండర్లు ఉన్న వారు వంట గ్యాస్ బుక్ చేస్తున్నారన్నారు.

 ఇండియన్ ఆయిల్ కార్పోరేషన్

ఇండియన్ ఆయిల్ కార్పోరేషన్

కరోనా నేపథ్యంలో తమ సిబ్బందికి ఇండియన్ ఆయిల్ కార్పోరేషన్ ఆర్థిక సాయాన్ని ప్రకటించింది. ఈ వైరస్ కారణంగా చనిపోతే వారి కుటుంబానికి రూ.5 లక్షల ఎక్స్‌గ్రేషియా ఇస్తామని తెలిపింది. ఈ సమయంలో అందరూ విధి నిర్వహణలో ఉండాలని విజ్ఞప్తి చేసింది.

English summary

Oil cos say no LPG shortage at all, delivering 25 percent more LPG cylinders

Amid coronavirus lockdown, the state-run oil marketing company Indian Oil has said it has enough supplies of LPG cylinders and appealed customers to avoid panic booking as ‘one cylinder in 15 days’ norm is in place.
Story first published: Monday, March 30, 2020, 12:47 [IST]
Company Search
Thousands of Goodreturn readers receive our evening newsletter.
Have you subscribed?
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Goodreturns sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Goodreturns website. However, you can change your cookie settings at any time. Learn more