For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

చైనా నుండి కంపెనీలు ఇండియాకు రావడం డౌటే, కరెన్సీ విలువ తగ్గిస్తే..

|

కరోనా మహమ్మారి కారణంగా చైనా నుండి పెద్ద మొత్తంలో కంపెనీలు ఇతర దేశాలకు మకాం మార్చేందుకు సిద్ధమవుతున్నాయి. వీటిని ఆకర్షించేందుకు భారత్ సహా అన్ని దేశాలు ప్రయత్నాలు చేస్తున్నాయి. ఈ నేపథ్యంలో నోబెల్ గ్రహీత అభిజిత్ బెనర్జీ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. చైనా నుండి విదేశీ కంపెనీలు నిష్క్రమించినప్పటికీ దాని వల్ల భారత్‌కు లాభిస్తుందని కచ్చితంగా చెప్పలేమన్నారు.

చైనాకు ఫస్ట్ ఝలక్: ఇండియాకు ఆపిల్ ప్రొడక్షన్ యూనిట్ల తరలింపు, కేంద్రం ఆ అవరోధాలు తొలగించాకే..

చైనా కరెన్సీ విలువను తగ్గించుకుంటే..

చైనా కరెన్సీ విలువను తగ్గించుకుంటే..

కరోనా వైరస్ వ్యాప్తికి చైనాయే కారణమని చాలామంది నిందిస్తున్నారని, చైనా నుంచి విదేశీ కంపెనీలు నిష్క్రమిస్తే భారత్‌ లాభపడుతుందని కొందరు అంచనా వేస్తున్నారని, కానీ అలా జరుగకపోవచ్చునని అభిజిత్ అన్నారు. చైనా తన కరెన్సీ విలువను తగ్గించుకుంటే ఆ దేశ ఉత్పత్తులు మరింత చౌకగా లభిస్తాయన్నారు. దీంతో ప్రజలు వాటి కొనుగోళ్లను ఇప్పటిలాగే కొనసాగిస్తారని చెప్పారు. 'చైనా తన కరెన్సీ విలువను తగ్గిస్తే ఏమవుతుంది. ఆ దేశ ఉత్పత్తులు చౌక అవుతాయి. దాంతో ప్రజలు వాటిని కొనడాన్ని కొనసాగిస్తారు' అని అన్నారు.

వారే ఆర్థిక వ్యవస్థను నడిపిస్తారు

వారే ఆర్థిక వ్యవస్థను నడిపిస్తారు

ఆర్థిక వ్యవస్థలకు ఊతమిచ్చేందుకు అమెరికా, బ్రిటన్, జపాన్‌లు తమ జీడీపీలో అధిక మొత్తాన్ని వెచ్చిస్తున్నాయని చెప్పారు. మన దేశంలోని ప్రజల కొనుగోలు శక్తి తగ్గిపోవడం ప్రధాన సమస్యగా మారిందన్నారు. ఈ సమస్య నుండి బయట పడేందుకు కనీసం మూడు లేదా ఆరు నెలల పాటు పేదల చేతికి మరింత నగదు అందేలా చూడాలన్నారు. ప్రభుత్వాలు సామాన్యుల చేతుల్లోకి డబ్బులు పంపించాలని, వారే ఆర్థిక వ్యవస్థను నడిపిస్తారని, ధనవంతుల చేతుల్లోకి పంపించవద్దన్నారు.

ఎమర్జెన్సీ రేషన్ కార్డులు

ఎమర్జెన్సీ రేషన్ కార్డులు

పేదల చేతుల్లోకి మూడు నుండి ఆరు నెలలు మనీ పంపించేందుకు ఎమర్జెన్సీ రేషన్ కార్డులు ఈ కాలానికి గాను ఇష్యూ చేయాలన్నారు. మారటోరియం పొడిగించడం ద్వారా ప్రజలకు మరికొంత వెసులుబాటు కల్పించాలని సూచించారు. ఇవే కాకుండా మరిన్ని చర్యలు తీసుకోవాలని చెప్పారు. అయితే డిమాండ్ ముఖ్యమని, ఈ దిశగా చర్యలు తీసుకోవాలన్నారు.

ప్యాకేజీపై..

ప్యాకేజీపై..

కరోనా వల్ల దేశ ఆర్థిక వ్యవస్థ కుదేలయిందని, ఆర్థిక వృద్ధి కోసం కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన ప్యాకేజీపై ఆయన అసంతృప్తి వ్యక్తం చేశారు. దేశ ఆర్థిక వ్యవస్థను చక్కదిద్దేందుకు జీడీపీలో 1% కంటే తక్కువ మొత్తాన్ని ఖర్చు చేస్తున్నట్లు మోడీ ప్రభుత్వం ప్రకటించిందని, ఇది ఏమాత్రం చాలదని, దీనిని మరింత పెంచాలని గతంలో నిర్మలా సీతారామన్ ప్రకటించిన రూ.1.70 లక్షల కోట్ల ప్యాకేజీని ఉద్దేశించి అన్నారు. జీడీపీలో కనీసం 10 శాతం ఉండాలని అభిప్రాయపడ్డారు. (అయితే ప్రధాని మోడీ నిన్న రూ.20 లక్షల కోట్ల ఆర్థిక ప్యాకేజీని అంటే 10 శాతం ప్యాకేజీని ప్రకటించారు.

English summary

Not sure India will gain if businesses shift from China: Abhijit Banerjee

Nobel laureate and economist Abhijit Banerjee has said there is no certainty that India will gain in case big corporates shift their businesses from China in the wake of coronavirus pandemic.
Story first published: Wednesday, May 13, 2020, 8:50 [IST]
Company Search
Thousands of Goodreturn readers receive our evening newsletter.
Have you subscribed?
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Goodreturns sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Goodreturns website. However, you can change your cookie settings at any time. Learn more