For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

టెస్లా ఎలక్ట్రిక్ కార్లపై కీలక వ్యాఖ్యలు, పన్ను దెబ్బ.. భారత్‌కు వచ్చేనా?

|

భారత్‌లో టెస్లా కార్ల అంశం చాలా కాలంగా కొనసాగుతోంది. ఇక్కడ పన్నులు ఎక్కువగా ఉన్నాయని టెస్లా ఇంక్ అధినేత ఎలాన్ మస్క్ గతంలో పలుమార్లు వ్యాఖ్యానించారు. టెస్లా ఎలక్ట్రిక్ కార్ల ఇండియా ఆరంగేట్రం చాలా కాలంగా చర్చనీయాంశ అంశం. తాజాగా టెస్లా కార్ల అంశంపై నీతి ఆయోగ్ వైస్ చైర్మన్ రాజీవ్ కుమార్ కీలక వ్యాఖ్యలు చేశారు. అంతర్జాతీయంగా మంచి ఆదరణ చూరగొన్న ఎలక్ట్రిక్ కార్ల తయారీ సంస్థ టెస్లాను భారత్‌లో తయారీ చేపట్టాలని రాజీవ్ కుమార్ కోరారు.

ప్రభుత్వం తప్పకుండా పన్ను ప్రయోజనాలు కల్పిస్తుందన్నారు. పబ్లిక్ ఫోరమ్ ఆఫ్ ఇండియా(PAFI) నిర్వహించిన వర్చువల్ సమావేశంలో మాట్లాడారు. మొదట విదేశాల్లో ఉత్పత్తి చేసిన కార్లను భారత్‌కు ఎగుమతి చేస్తామని, తద్వారా మార్కెట్‌ను పెంచుకొని దేశంలోకి ప్రవేశిస్తామని టెస్లా ప్రతిపాదన చేస్తోందని, కానీ వీటికి కాలం చెల్లిందన్నారు.టెస్లా కొత్త ఆలోచనలతో ముందుకు రావాలని సూచించారు.

టెస్లా ఏం చెప్పిందంటే

టెస్లా ఏం చెప్పిందంటే

మొదట భారత్‌లో తయారీని ప్రారంభించాలని, ఆ తర్వాతే పన్ను తగ్గింపు విషయాన్ని పరిశీలిస్తామని కేంద్రమంత్రి నితిన్ గడ్కరీ కూడా ఇటీవల చెప్పారు. జనాభాపరంగా ప్రపంచంలో రెండో అతిపెద్ద మార్కెట్ కలిగిన భారత్‌లోకి ప్రవేశించేందుకు టెస్లా చాలాకాలంగా ప్రయత్నాలు చేస్తోంది.

భారత్‌లో కార్ల దిగుమతిపై ఉన్న సుంకాన్ని తగ్గించాలని కోరారు. ఈ మేరకు కేంద్ర ప్రభుత్వానికి లేఖ కూడా రాశారు. మరోవైపు టెస్లాకు చెందిన కొన్ని మోడల్స్ భారత్‌లో నడిచేందుకు అనువైనవిగా కేంద్రం ధృవీకరించింది.

పూర్తిస్థాయిలో విదేశాల్లో తయారైన కార్లపై కేంద్రం 60 శాతం నుండి 100 శాతం దిగుమతి సుంకాన్ని విధిస్తోంది. ఇంజిన్ పరిమాణంతో పాటు ధర, బీమా, రవాణా కలుపుకొని రూ.40,000 డాలర్లు దాటితే సుంకం వర్తిస్తుంది. అయితే, దీనిని 40 శాతానికి తగ్గించాలని టెస్లా కోరుతోంది.

అలాగే, విద్యుత్ కార్లపై 10 శాతం సమాజ సంక్షేమ సర్‌ఛార్జీని రద్దు చేయాలని కోరింది. దీంతో విద్యుత్ వాహనాల విక్రయానికి భారత్‌లో అనుకూల వాతావరణం ఏర్పడుతుందని పేర్కొంది. ఆ తర్వాత కార్ల విక్రయాలు, సేవలు, ఛార్జింగ్ మౌలిక వసతుల రంగాల్లో టెస్లా నేరుగా పెట్టుబడులు పెడుతుందని, అలాగే భారత్ నుండి ముడిసరకు కొనుగోలును పెంచుతామని తెలిపింది.

నీతి ఆయోగం ఏం చెప్పిందంటే?

నీతి ఆయోగం ఏం చెప్పిందంటే?

ఈ నేపథ్యంలో నీతి ఆయోగ్ చైర్మన్ స్పందించారు. టెస్లా తన ఎలక్ట్రిక్ వాహనాలను భారత్‌లో తయారు చేయాలన్నారు. అదే సమయంలో టెస్లాకు ప్రభుత్వం నుండి కావలసిన పన్ను ప్రయోజనాలను కచ్చితంగా పొందే అవకాశముందన్నారు. అమెరికా నుంచి టెస్లా తన ఉత్పత్తులను భారత్‌కు రవాణా చేసే బదులు ఇక్కడే తయారీ కేంద్రాన్ని ఏర్పాటు చేస్తే, ఏకకాలంలో టెస్లాకు, ఇక్కడి వారికి ప్రయోజనాలు ఉంటాయని తెలిపింది.

లాబీయింగ్

లాబీయింగ్

మరోవైపు, మోడీ కార్యాలయంలో పన్ను తగ్గింపు కోసం టెస్లా లాబీయింగ్ చేస్తున్నట్లుగా వార్తలు వస్తున్నాయి. భారత మార్కెట్లోకి రావడానికి ముందు పన్ను అంశాన్ని తేల్చుకోవాలని భావిస్తోంది. టెస్లా ఆరంగేట్రం గురించి ఆ కంపెనీ అధినేత ఎలాన్ మస్క్, భారత ప్రధాని నరేంద్ర మోడీ మధ్య చర్చలు జరగవచ్చునని అంటున్నారు. గత నెలలోనే టెస్లా ఎగ్జిక్యూటివ్స్ ఇందుకు సంబంధించి ప్రధాని కార్యాలయంతో సంప్రదింపులు జరిపినట్లుగా వచ్చినట్లుగా వార్తలు వచ్చాయి. ప్రస్తుతం ఇంపోర్టెడ్ కార్ల పైన భారత్ వంద శాతం ఇంపోర్ట్ డ్యూటీ విధిస్తోంది.

English summary

Niti Aayog on Tesla electric cars debut in India, Musk to meet Modi

Tesla’s much-awaited India debut may hinge on a possible meeting between CEO Elon Musk and prime minister Narendra Modi.
Story first published: Friday, October 22, 2021, 16:59 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X