సెన్సెక్స్ 460 పాయింట్లు జంప్, దలాల్ స్ట్రీట్‌కు ఆర్బీఐ ఊతం
ముంబై: ఓ వైపు దేశవ్యాప్తంగా కరోనా కేసులు పెరగడం, మహారాష్ట్ర సహా పలు ప్రాంతాల్లో లాక్ డౌన్ ఆంక్షలు ఇన్వెస్టర్ల సెంటిమెంటును బలహీనపరచగా, కేంద్ర బ్యాంకు నిర్ణయాలు వారికి కొత్త ఉత్సాహాన్ని నింపాయి. దీంతో నిఫ్టీ 14,800 పాయింట్లకు పైన ముగియగా, సెన్సెక్స్ 460 పాయింట్లు జంప్ చేసింది. అంతర్జాతీయ మార్కెట్లు నిన్న లాభాల్లో ముగియడంతో నేడు సూచీలు సానుకూలంగా ప్రారంభమయ్యాయి. ఆ తర్వాత ఆర్బీఐ ద్రవ్య పరపతి విధాన సమీక్ష నిర్ణయాల ప్రకటన అనంతరం ఆల్ టైమ్ గరిష్టాన్ని తాకాయి.

సెన్సెక్స్, నిఫ్టీకి ఆర్బీఐ అండ
సెన్సెక్స్ నేడు ఉదయం 49,277.09 పాయింట్ల వద్ద ప్రారంభమై, 49,900.13 వద్ద గరిష్టాన్ని, 49,093.90 వద్ద కనిష్టాన్ని తాకింది. నిఫ్టీ 14,716.45 పాయింట్ల వద్ద ప్రారంభమై, 14,879.80 వద్ద గరిష్టాన్ని, 14,649.85 పాయింట్ల వద్ద కనిష్టాన్ని తాకింది. సెన్సెక్స్ చివరకు 460.37 (0.94%) పాయింట్లు లాభపడి 49,661.76 పాయింట్ల వద్ద, నిఫ్టీ 135.55 (0.92%) పాయింట్లు ఎగిసి 14,819.05 పాయింట్ల వద్ద ముగిసింది.

టాప్ గెయినర్స్, లూజర్స్
నేటి టాప్ గెయినర్స్ జాబితాలో JSW స్టీల్ 4.62 శాతం, విప్రో 2.54 శాతం, ఎస్బీఐ లైఫ్ ఇన్సురా 2.33 శాతం, SBI 2.28 శాతం, బ్రిటానియా 2.09 శాతం లాభపడ్డాయి.
టాప్ లూజర్స్ జాబితాలో అదానీ పోర్ట్స్ 2.49 శాతం, టాటా కన్స్యూమర్స్ ప్రోడక్ట్స్ 1.30 శాతం, యూపీఎల్ 1.04 శాతం, టైటాన్ కంపెనీ 0.75 శాతం, ఎన్టీపీసీ 0.57 శాతం నష్టపోయాయి.
మోస్ట్ యాక్టివ్ స్టాక్స్‌లో అదానీ పోర్ట్స్, రిలయన్స్, హెచ్డీఎఫ్సీ బ్యాంకు, ఎస్బీఐ, టాటా స్టీల్ ఉన్నాయి.

రంగాలవారీగా..
నిఫ్టీ 50 స్టాక్స్ 0.92 శాతం, నిఫ్టీ మిడ్ క్యాప్ 1.35 శాతం లాభపడ్డాయి. నిఫ్టీ ఆటో 1.59 శాతం, నిఫ్టీ బ్యాంకు 1.51 శాతం, నిఫ్టీ ఎనర్జీ 0.64 శాతం, నిఫ్టీ ఫైనాన్షియల్ సర్వీసెస్ 1.19 శాతం, నిఫ్టీ ఎఫ్ఎంసీజీ 0.62 శాతం, నిఫ్టీ ఐటీ 1.13 శాతం, నిఫ్టీ మీడియా 0.77 శాతం, నిఫ్టీ మెటల్ 0.90 శాతం, నిఫ్టీ ఫార్మా 0.54 శాతం, నిఫ్టీ పీఎస్‌యూ బ్యాంకు 1.95 శాతం, నిఫ్టీ రియాల్టీ 0.96 శాతం, నిఫ్టీ ప్రయివేటు బ్యాంకు 1.53 శాతం లాభపడ్డాయి.