ఇండియాలోకి ఎంట్రీపై ఎలాన్ మస్క్, టెస్లా కారు-బెంగళూరు రోడ్లపై మీమ్స్
ఢిల్లీ: ఎలక్ట్రికల్ కార్ల తయారీ కంపెనీ టెస్లా ఇంక్ భారత్‌లోకి ప్రవేశిస్తోంది. ఈ మేరకు ఆ సంస్థ అధినేత ఎలాన్ మస్క్ 2 రోజుల క్రితం ధృవీకరించారు. ఒక్కమాటలో టెస్లాను తీసుకు వస్తున్నట్లు పేర్కొన్నారు. హామీ ఇచ్చినట్లుగా వస్తున్నామంటూ ట్వీట్ చేశారు. టెస్లా భారత్‌లో తమ విభాగాన్ని ప్రారంభించేందుకు నమోదు చేసుకుంది. ఈ నేపథ్యంలో మస్క్ ట్వీట్ చేశారు. టెస్లా భారత్ రాకపై గత కొద్ది రోజులుగా చర్చ సాగుతోంది. కేంద్రమంత్రి నితిన్ గడ్కరీ కూడా గత ఏడాది డిసెంబర్ నెలలో ధృవీకరించారు.
డీలర్ లేకుండా... టెస్లా మోడల్ 3 కారు బుకింగ్స్ జనవరి నుండే, జూన్‌లో ఫస్ట్ కారు

టెస్లా ఎంట్రీ ఖరారు
బెంగళూరులోని రిజిస్ట్రార్ ఆఫ్ కంపెనీస్ (RoC)లో టెస్లా ఇండియా మోటార్స్ అండ్ ఎనర్జీ ప్రయివేట్ లిమిటెడ్ పేరుతో రూ.1లక్ష పెయిడప్ క్యాపిటల్‌తో అన్‌లిస్టెడ్ సంస్థగా ఓ కంపెనీ నమోదు చేసుకుంది. దీంతో టెస్లా ఎంట్రీ ఖరారయింది. తాజాగా మస్క్ ట్వీట్ దానిని ధృవీకరించింది. తయారీ ప్లాంట్, ఆర్ అండ్ డీ కేంద్రం ఏర్పాటు కోసం పలు రాష్ట్రాలతో చర్చిస్తున్నట్లుగా వార్తలు వస్తున్నాయి. దేశీ ఆటోమొబైల్ దిగ్గజం టాటా మోటర్స్తోను టెస్లా జట్టు కట్టే అవకాశాలపై ఊహాగానాలు వచ్చాయి. ఈ వార్తలను టాటా మోటార్స్ ఖండించింది.

మీమ్స్ వెల్లువ
టెస్లా ఇంక్ భారత్ ఎంట్రీపై మీమ్స్ వెల్లువెత్తుతున్నాయి. దారుణమైన రోడ్ ఇన్ఫ్రా ఉన్న బెంగళూరు నగరంలో టెస్లా రాక అంటూ పలువురు ట్వీట్ చేస్తున్నారు. మన నగరాల్లో టెస్లా కార్లకు తగిన ఇన్ఫ్రా లేదని నెటిజన్ల అభిప్రాయం. మన రోడ్లు బాగా లేవని అర్థం వచ్చేలా ట్వీట్ చేస్తున్నారు. టెస్లా, గూగుల్ సరికొత్త సెల్ఫ్ డ్రైవింగ్ కార్లు తయారు చేస్తే, బెంగళూరు మహానగర పాలిక పాత్రం ఫ్లోటింగ్ కార్లు కనిపెట్టిందంటూ వర్షం, వరద నీటిలో కొట్టుకుపోతున్ ఫోటోలను, వీడియోలను పోస్ట్ చేశారు. టెస్లా ఇంక్ ఫ్లైయింగ్ మోడల్ కారు తెచ్చే వరకు బెంగళూరులో ఇబ్బందికరమేనని ఓ నెటిజన్ ఎద్దేవా చేశారు.

బుకింగ్..
టెస్లా మోడల్ 3 కార్లను 2021 జూన్ నెలలో భారత్‌లో లాంచ్ చేయనున్న విషయం తెలిసిందే. ఈ మోడల్ బుకింగ్ ఈ నెల నుండి ప్రారంభిస్తున్నారు. భారతీయులకు ఇప్పటి వరకు టెస్లా అందుబాటులో లేకపోయినప్పటికీ, ఈ స్టాక్స్ కొనుగోలుకు గత కొన్ని నెలలుగా ఆసక్తి కనబరుస్తున్న విషయం తెలిసిందే. ఇప్పుడు ఈ వాహనాలు కూడా కొనుగోలు చేయవచ్చు. దీని ధర రూ.55 లక్షల నుండి రూ.60 లక్షల మధ్య ఉంది. టెస్లా కంపెనీ డీలర్ లేకుండానే నేరుగా ఈ ఎలక్ట్రానిక్ వాహనాలను విక్రయిస్తోంది. ఒక్కసారి ఛార్జ్ చేస్తే 500 కిలో మీటర్లు ప్రయాణిస్తుంది. 3.5 సెకన్లలో 0 నుండి 100 కిలో మీటర్ల వేగం పెంచుకోవచ్చు. 2016లో కూడా మోడల్ 3 కార్ల బుకింగ్స్‌ను ప్రారంభించింది. కానీ ఎలక్ట్రానిక్ వెహికిల్ పాలసీలు, దిగుమతి సుంకం వంటి కారణాలతో ఆలస్యమైంది.