For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

కుప్పకూలిన గ్రిడ్, చీకట్లో ముంబై మహానగరం: మార్కెట్లకు ఏ ఇబ్బందీ లేదు!

|

ముంబై: స్టాక్ మార్కెట్లు సోమవారం భారీ లాభాల్లో ప్రారంభమయ్యాయి. గత వారం 40వేల మార్క్ దాటిన సెన్సెక్స్ అదే ఒరవడి కొనసాగిస్తోంది. వరుసగా ఏడు రోజులు స్టాక్ మార్కెట్లు లాభాల్లో ముగిశాయి. నేడు 8వ రోజు కూడా లాభాల్లోనే ట్రేడింగ్ ప్రారంభించాయి. దూకుడు మీద ఉన్న స్టాక్ మార్కెట్లకు ముంబై నగరంలో విద్యుత్ అంతరాయం వల్ల ఇబ్బందులు తలెత్తుతాయేమోననే ఆందోళన పలువురు ఇన్వెస్టర్లలో ఉంది. అయితే దీనిపై బీఎస్ఈ, ఎన్ఎస్ఈ స్పష్టతను ఇచ్చాయి. నగరంలో విద్యుత్ సరఫరాలో ఇబ్బంది ఉందని, అయితే మార్కెట్ సాధారణంగానే కొనసాగుతుందని ఇబ్బంది లేదని స్పష్టం చేశాయి.

దూసుకెళ్తున్న ఐటీ స్టాక్స్: తెలంగాణ యూనిట్‌పై అమెరికా వార్నింగ్ లేఖ, శిల్ప షేర్ ధర డౌన్దూసుకెళ్తున్న ఐటీ స్టాక్స్: తెలంగాణ యూనిట్‌పై అమెరికా వార్నింగ్ లేఖ, శిల్ప షేర్ ధర డౌన్

విద్యుత్ సమస్య వచ్చినా.. మార్కెట్ ర్యాలీ!

విద్యుత్ సమస్య వచ్చినా.. మార్కెట్ ర్యాలీ!

దక్షిణ ముంబై నగరంలో పవర్ గ్రిడ్ ఫెయిల్యూర్ విద్యుత్ సరఫరాలో ఇబ్బందులు తలెత్తాయని, అయితే ఎక్స్చేంజీ కార్యకలాపాలు సాధారణంగానే కొనసాగుతాయని బీఎస్ఈ తెలిపింది. ఎలాంటి సమస్య వచ్చినా పూర్తిస్థాయిలో బ్యాకప్ సిద్ధంగా ఉందని, కాబట్టి మార్కెట్ కార్యకలాపాల్లో ఎలాంటి సమస్యలు తలెత్తవని భావిస్తున్నట్లు తెలిపింది.మార్కెట్ కార్యకలాపాలకు ఎలాంటి ఇబ్బంది లేదని ఎన్ఎస్ఈ కూడా స్పష్టం చేసింది.

భారీ విద్యుత్ అంతరాయం

భారీ విద్యుత్ అంతరాయం

ముంబైలో సోమవారం విద్యుత్ అంతరాయం ఏర్పడింది. ప్రజల నుండి పెద్ద ఎత్తున ఫిర్యాదులు వచ్చాయి. ముఖ్యంగా ముంబై సౌత్, ముంబై సెంట్రల్, ముంబై నార్త్ ప్రాంతాల్లో విద్యుత్ అంతరాయంపై సామాజిక అనుసంధాన వేదిక ట్విట్టర్ ఆక్రోషించింది. గ్రిడ్ వైఫల్యం కారణంగా విద్యుత్ సరఫరాలో అంతరాయం తలెత్తినట్లు చెబుతున్నారు. సోమవారం ఉదయం పది గంటలకు ఆర్థిక రాజధానిలో భారీ ఎత్తున విద్యుత్ సరఫరా అంతరాయం ఏర్పడింది.

స్తంభించిన నగరం..!

స్తంభించిన నగరం..!

ముంబై మెట్రోపాలిటన్ రీజియన్‌లో విద్యుత్ సరఫరాలో వైఫల్యం కారణంగా విద్యుత్ సరఫరాలో అంతరాయం ఏర్పడింది. విద్యుత్ సరఫరాలో అంతరాయంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులకు గురయ్యారు. ముంబైలోని కీలక ప్రాంతాలైన కొలబా, మాహిమ్, బాండ్రాలలో విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. గ్రిడ్ వైఫల్యం కారణంగా ముంబై నగరంలోని సబర్బన్ ట్రైన్ సర్వీసులు నిలిచిపోయాయి. మెట్రో రైల్ సర్వీసులు కూడా ఆగిపోయాయి. విద్యుత్ సరఫరాలో అంతరాయానికి తాము చింతిస్తున్నామని బృహన్ ముంబై విద్యుత్ సరఫరా, రవాణ సంస్థ(BEST) తెలిపింది. ముంబైతో పాటు థానే, పాల్ఘడ్, రాయ్‌గడ్ జిల్లాల్లోను విద్యుత్ సరఫరా నిలిచింది.

English summary

కుప్పకూలిన గ్రిడ్, చీకట్లో ముంబై మహానగరం: మార్కెట్లకు ఏ ఇబ్బందీ లేదు! | Mumbai power outage: exchange working normally

The stock exchange BSE confirmed of a power failure in South Mumbai but added that the exchange is working normally. The exchange further added that complete back up in place and doesn't expect any disruption in market activity.
Story first published: Monday, October 12, 2020, 12:52 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X