For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

రుణాలు ఇవ్వకుంటే ఫిర్యాదు చేయండి: నిర్మలా సీతారామన్

|

సూక్ష్మ, చిన్న, మధ్య తరహా పరిశ్రమలకు (MSME) కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ ఊరట ప్రకటన చేశారు. బ్యాంకులు కారణం లేకుండానే రుణాల్ని మంజూరు చేయకుంటే తమకు ఫిర్యాదు చేయాలని సూచించారు. కేంద్ర బడ్జెట్ ప్రతిపాదలన గురించి ట్రేడర్స్‌కు చెన్నైలో జరిగిన ఓ కార్యక్రమంలో ఆమె వివరించారు. ఈ సందర్భంగా ఎంఎస్ఎంఈలకు పై సూచన చేశారు.

ఆంధ్రప్రదేశ్‌లా.. మావద్ద అలాంటి నిబంధనల్లేవు!: KIAకు పంజాబ్ ఆహ్వానంఆంధ్రప్రదేశ్‌లా.. మావద్ద అలాంటి నిబంధనల్లేవు!: KIAకు పంజాబ్ ఆహ్వానం

కారణం లేకుండా రుణాలు మంజూరు చేస్తే ఫిర్యాదు

కారణం లేకుండా రుణాలు మంజూరు చేస్తే ఫిర్యాదు

ఎంఎస్ఎంఈలకు బ్యాంకులు ఎలాంటి కారణం లేకుండా రుణం మంజూరు చేయకుంటే తమకు ఫిర్యాదు చేయాలని, ఫిర్యాదుల కోసం ప్రత్యేకంగా ఓ కేంద్రాన్ని ఏర్పాటు చేయనున్నట్లు నిర్మలా సీతారామన్ చెప్పారు. ఫిర్యాదు చేసినప్పుడు సంబంధిత బ్యాంకు మేనేజర్‌కు కూడా ఓ కాపీని పంపించాలని చెప్పారు. రుణాలు నిరాకరించిన ఉద్యోగిపై సంబంధిత బ్యాంకు మేనేజర్‌కు ఫిర్యాదు ఉండాలన్నారు.

ఫిర్యాదుల కోసం ప్రత్యేక సెంటర్

ఫిర్యాదుల కోసం ప్రత్యేక సెంటర్

ఎంఎస్ఎంఈల ఏర్పాటుకు ప్రజలు బ్యాంకులను సంప్రదించినప్పుడు హేతుబద్ద కారణం లేకుండా బ్యాంకులు నిరాకరించలేవన్నారు. అలా నిరాకరిస్తే ఫిర్యాదు చేసేందుకు త్వరలో ఆర్థిక శాఖ ప్రత్యేక సెంటర్‌ను ఏర్పాటు చేస్తుందన్నారు. దేశంలో ఎంఎస్ఎంఈల పునాదులు బలంగా ఉన్నాయని చెప్పారు. మెరుగైన మౌలిక సదుపాయాల కల్పన వల్ల ప్రభుత్వానికి ఆస్తులు సృష్టించుకునే అవకాశం ఏర్పడుతుందన్నారు.

అందుకే విదేశీ మారకనిల్వలు ఎక్కువగా ఉన్నాయి

అందుకే విదేశీ మారకనిల్వలు ఎక్కువగా ఉన్నాయి

ఇటీవల ప్రవేశపెట్టిన బడ్జెట్ అన్ని వర్గాలు అభివృద్ధి చెందే విధంగా ఉందని నిర్మలా సీతారామన్ ఆశాభావం వ్యక్తం చేశారు. ఆర్థిక మూలాలు బాగున్నందునే విదేశీ మారకం నిల్వలు ఎక్కువ స్థాయిలో ఉన్నాయన్నారు. గతంలో బ్యాంకులు తమ సంబంధీకులకు ఫోన్ బ్యాంకింగ్ ద్వారా రుణాలు మంజూరు చేశాయని, దీంతో నిరర్ధక ఆస్తులు ఎక్కువస్థాయిలో పెరిగాయని తెలిపారు.

నాలుగేళ్లు పట్టింది

నాలుగేళ్లు పట్టింది

నిరర్థక ఆస్తులను పరిష్కరించేందుకు నాలుగేళ్లు పట్టిందన్నారు. గతంలో జరిగిన ఇలాంటి పరిస్థితులను నివారించేందుకు మంచి పాఠాలు నేర్చుకున్నామని, అనవసరమైన ఖర్చులను ప్రభుత్వం ప్రోత్సహించడం లేదని చెప్పారు. మౌలిక సదుపాయాల్లో పెట్టుబడుల ద్వారా ఆస్తులు సృష్టించేందుకు నిర్ణయించిందన్నారు.

English summary

రుణాలు ఇవ్వకుంటే ఫిర్యాదు చేయండి: నిర్మలా సీతారామన్ | MSMEs can complain if banks deny loan without reason

Finance Minister Nirmala Sitharaman on Saturday told micro, small and medium enterprises (MSMEs) to make a complaint if banks deny loans without reason.
Story first published: Sunday, February 9, 2020, 8:56 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X