For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

ఫార్చ్యూన్ బిజినెస్‌పర్సన్: అందుకే... సత్య నాదెళ్ల నెంబర్ 1, మనోళ్లు ముగ్గురు..

|

ఫార్చ్యూన్ బిజినెస్ పర్సన్ ఆఫ్ ది ఇయర్ 2019 జాబితాలో తెలుగు తేజం, మైక్రోసాఫ్ట్ సీఈవో సత్య నాదెళ్ల అగ్రస్థానంలో నిలిచారు. దైర్యంగా లక్ష్యాలను చేరుకోవడం, అసాధ్యాల్ని సుసాధ్యం చేయడం, సృజనాత్మక పరిష్కారమార్గాల్ని కనుకొనడం, వినూత్న పరిష్కారాలను కనుగొనడం వంటి కీలక అంశాల ఆధారంగా రూపొందించిన ఈ జాబితాలో మొత్తం ఇరవై మంది పేర్లు ఉన్నాయి. ఇందులో భారత సంతతికి చెందిన వారు ముగ్గురు ఉన్నారు. ఇందులో సత్య నాదెళ్ల తొలి స్థానం దక్కించుకున్నారు.

ఉద్యోగాలు లేవు... రెండేళ్లుగా ఇదే పరిస్థితి:ఈ రంగాలు బెట్టర్

ముగ్గురు భారత సంతతివారు

ముగ్గురు భారత సంతతివారు

సత్య నాదెళ్ల తొలి స్థానం దక్కించుకోగా, మాస్టర్ కార్డ్ సీఈవో అజయ్ బంగా, అరిస్టా అధిపతి జయశ్రీ ఉల్లాల్ వరుసగా 8, 18వ స్థానం దక్కించుకున్నారు. వాటాదారులకు అందిన ప్రతిఫలాలు మొదలు మూలధనంపై అందిన ప్రతిఫలాల వరకు మొత్తం పది ఆర్థిక అంశాలను పరిగణలోకి తీసుకొని ఈ జాబితాను రూపొందించారు. మొత్తం 20 మందిని ఎంపిక చేసినట్లు ఫార్చూన్ వెల్లడించింది.

ఇదీ సత్య నాదెళ్ల

ఇదీ సత్య నాదెళ్ల

వ్యూహాత్మక లీడర్ పాత్రలో ఒదిగిపోయిన సత్య నాదెళ్ల కొత్త టెక్నాలజీతో విజయవంతంగా దూసుకుపోతూ కస్టమర్లలో నమ్మకాన్ని పెంచడం ద్వారా ఈ స్థానానికి చేరుకున్నట్లు ఫార్చ్యూన్ మేగజైన్ ప్రశంసించింది. తాజాగా 10 బిలియన్ డాలర్ల పెంటగాన్ క్లౌండ్ కాంట్రాక్టును అందుకోవడంలో ఆయన చూపిన చొరవ కంపెనీని మరింత ఉన్నత శిఖరాలకు చేర్చిందని తెలిపింది. ఈ విషయాన్ని స్వయంగా ఆ సంస్థ డైరెక్టర్లు చెప్పినట్లు పేర్కొంది.

... అయినా కూడా..

... అయినా కూడా..

బిల్ గేట్స్‌లా వ్యవస్థాపకుడు కాదని, స్టీవ్ బామర్‌లా ప్రఖ్యాత వ్యక్తి కాదని, ఐనప్పటికీ సత్య నాదెళ్లని 2014లో మైక్రోసాఫ్ట్ అధిపతిగా నియమించినప్పుడు ఆశ్చర్యకర ఎంపికగా అందరూ భావించారని, అదే విధంగా ఆయన ఆర్థిక విభాగంలోను పని చేయలేదని, కానీ ఆయన అన్నింటిని అధిగమించి తనదైన లీడర్‌షిప్‌తో కంపెనీని ముందుండి నడిపించారని ఫార్చ్యూన్ పేర్కొంది. నాపై నాకు నమ్మకం ఎక్కువ అని, అదే సమయంలో మిగతా వారిని ఎదగనిస్తానని, సీఈవోలకు అద్భుతమైన బృందం లేకుంటే ఏం చేయలేదని, అదృష్టవశాత్తూ తనకు అది లభించిందని సత్య నాదెళ్ల పేర్కొన్నట్లు ఫార్చ్యూన్ తెలిపింది.

40 శాతం పెరిగిన షేర్

40 శాతం పెరిగిన షేర్

మాస్టర్ కార్డ్ ఆర్థిక సేవల్లో తనదైన ముద్రను వేయడం వెనుక అజయ్ బంగా దూరదృష్టి ఉన్నట్లు ఫార్చ్యూన్ పేర్కొంది. ఈ ఏడాది కంపెనీ షేర్ 40 శాతం పెరిగిందని, ఇన్వెస్టర్లకు అత్యంత ప్రీతిపాత్రమైనదిగా మారిందని పేర్కొంది.

ప్రత్యేక మార్కెట్ దిగ్గజంగా...

ప్రత్యేక మార్కెట్ దిగ్గజంగా...

అరిస్టాను జయశ్రీ ఉల్లాల్ ఒక ప్రత్యేకమైన మార్కెట్ దిగ్గజంగా మార్చడానికి కృషి చేశారని ఫార్చ్యూన్ కొనియాడింది. తన కంపెనీ అరిస్టాను ఈథర్నెట్ స్విచ్చెస్, ఓపెన్ సోర్స్, క్లౌడ్ సాఫ్టువేర్‌లలో ప్రత్యేక మార్కెట్ దిగ్గజంగా మార్చేందుకు కృషి చేశారని పేర్కొంది.

టాప్ 20లో ప్రముఖులు...

టాప్ 20లో ప్రముఖులు...

వీరు కాకుండా, ఫార్చ్యూన్ బిజినెస్ పర్సన్ ఆఫ్ ది ఇయర్ 2019లో రెండో స్థానంలో ఫోర్టెస్క్యూ మెటల్ గ్రూప్ సీఈవో ఎలిజబెత్ గెయినెస్, మూడో స్థానంలో చిపోటిల్ మెక్సికన్ గ్రిల్ సీఈవో బ్రియాన్ నికోల్, నాలుగో స్థానంలో సింక్రోని ఫైనాన్షియల్ సీఈవో మార్గరెట్ కీనే, 5వ స్థానంలో ప్యూమా సీఈవో జోర్న్ గుల్డెన్ ఉన్నారు. జేపీ మోర్గాన్ చేస్ సీఈవో జామీ డిమాన్ 10వ స్థానంలో, అసెంచెర్ సీఈవో జూలీ స్వీట్ 15వ స్థానంలో, అలీబాబా సీఈవో డేనియల్ ఝాంగ్ 16వ స్థానంలో నిలిచారు.

English summary

Microsoft CEO Satya Nadella tops Fortune's Businessperson of the Year 2019 list

Microsoft's India-born Chief Executive Officer Satya Nadella has occupied the top spot in Fortune's Businessperson of the Year 2019 list, an annual compilation that also includes Mastercard CEO Ajay Banga and Arista head Jayshree Ullal.
Story first published: Thursday, November 21, 2019, 10:18 [IST]
Company Search
Thousands of Goodreturn readers receive our evening newsletter.
Have you subscribed?
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Goodreturns sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Goodreturns website. However, you can change your cookie settings at any time. Learn more