For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

Global Health IPO: మేరిసిన మేదాంతా స్టాక్.. సూపర్ లిస్టింగ్ లాభాలు.. తొలిరోజే 18.50% ప్రీమియం..

|

Global Health IPO: మేదాంతా బ్రాండ్ పేరుతో హాస్పిటల్స్ చైన్ నిర్వహిస్తున్న గ్రోబల్ హెల్త్ ఐపీవో నేడు స్టాక్ మార్కెట్లో లిస్ట్ అయ్యింది. తొలిరోజే స్టాక్ ప్రీమియంకు లిస్ట్ అయ్యింది. స్టాక్ బీఎస్ఈలో 18.50% ప్రీమియంతో రూ.398.15 వద్ద లిస్ట్ అవగా.. ఎన్ఎస్ఈలో 19.35% ప్రీమియంతో రూ.401 రేటు వద్ద లిస్ట్ అయ్యింది. ఐపీవోలో పాల్గొన్న ఇన్వెస్టర్లకు మంచి లాభాలు తొలిరోజే అందాయి.

ట్రేడింగ్ సమయంలో..

ట్రేడింగ్ సమయంలో..

ఉదయం 11.10 గంటల సమయంలో స్టాక్ ఎన్ఎస్ఈలో రూ.77కు పైగా లాభపడి రూ.414 వద్ద ట్రేడ్ అవుతోంది. ఇదే సమయంలో స్టాక్ బీఎస్ఈలో రూ.78 లాభపడి రూ.413.35 వద్ద ట్రేడ్ అవుతోంది. గ్లోబల్ హెల్త్ IPO దాదాపు 10 సార్లు సబ్‌స్క్రైబ్ చేయబడింది. ఐపీవో సమయంలో ప్రైస్ బ్యాంక్ రూ.319-336గా కంపెనీ నిర్ణయించింది. అయితే ఈ హాస్పిటల్ చైన్ స్టాక్ మంచి లిస్టింగ్ గెయిన్స్ ఇన్వెస్టర్లకు అందించింది.

ఆఫర్ స్టాక్స్..

ఆఫర్ స్టాక్స్..

కంపెనీ ఐపీవో ద్వారా ఇన్వెస్టర్లకు 4.67 కోట్ల షేర్లను ఆఫర్ చేయగా.. 44.79 కోట్ల షేర్లకు బిడ్లు వచ్చాయి. గ్లోబల్ హెల్త్ IPOలో రూ.500 కోట్ల ఫ్రెష్ ఇష్యూ ఉండగా.. ఆఫర్ ఫర్ సేల్ రూపంలో 50,761,000 షేర్లను ఇన్వెస్టర్లకు అందుబాటులో ఉంచింది. కంపెనీ దీని ద్వారా వచ్చిన మెుత్తాన్ని రుణాల చెల్లింపులు, అభివృద్ధికి వినియోగించనుంది.

పెట్టుబడులు..

పెట్టుబడులు..

గ్లోబల్ హెల్త్ యాంకర్ ఇన్వెస్టర్ల నుంచి రూ.662 కోట్లను సమీకరించింది. కంపెనీ ఐపీవోలో సింగపూర్ ప్రభుత్వం, నోమురా, ఆదిత్య బిర్లా సన్ లైఫ్ మ్యూచువల్ ఫండ్, ఎస్‌బిఐ మ్యూచువల్ ఫండ్, యాక్సిస్ బ్యాంక్ మ్యూచువల్ ఫండ్, హెచ్‌డిఎఫ్‌సి మ్యూచువల్ ఫండ్, ఐసిఐసిఐ ప్రుడెన్షియల్ ఎంఎఫ్, కోటక్ ఎంఎఫ్, మ్యాక్స్ లైఫ్ ఇన్సూరెన్స్, ఎస్‌బిఐ లైఫ్ ఇన్సూరెన్స్ కంపెనీలు యాంకర్ ఇన్వెస్టర్ల జాబితాలో ఉన్నాయి.

English summary

Global Health IPO: మేరిసిన మేదాంతా స్టాక్.. సూపర్ లిస్టింగ్ లాభాలు.. తొలిరోజే 18.50% ప్రీమియం.. | medantha hospital Global Health IPO listed at good premiums in NSE, BSE

medantha hospital Global Health IPO listed at good premiums in NSE, BSE
Story first published: Wednesday, November 16, 2022, 11:33 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X