మారుతీ సుజుకీ కార్ల ధరల షాక్, కార్లపై రూ.34,000 వరకు పెంపు
న్యూఢిల్లీ: భారత ఆటో దిగ్గజం మారుతి సుజుకీ కార్ల ధరల్ని పెంచింది. వివిధ మోడల్స్ పైన ఢిల్లీలో ఎక్స్-షోరూం ధర రూ.34,000 వరకు పెరిగింది. ఈ మేరకు సోమవారం మారుతీ సుజుకీ ప్రకటించింది. కొత్త ధరలు తక్షణమే అమల్లోకి వస్తాయని తెలిపింది. ఉత్పాదక వ్యయం పెరిగాయని, దీంతో ధరలను పెంచక తప్పడం లేదని వెల్లడించింది. ధరల పెంపునకు ముందు మారుతి కార్ల ధరల శ్రేణి రూ.2.95 లక్షల నుంచి రూ.11.52 లక్షలు. ఇప్పుడు పెరుగుతున్నాయి. ఆల్టో ధర కనిష్ఠం, XL6 ధర గరిష్ఠంగా ఉంది.
అదే డొనాల్డ్ ట్రంప్ టార్గెట్, చైనా హువావేకు అమెరికా భారీ షాక్

అందుకే ధరల పెంపు
తక్షణమే అమలులోకి వస్తాయని ప్రకటించిన నేపథ్యంలో జనవరి 18 నుండి ధరలు పెరిగాయి. ఇప్పటికే హ్యుండాయ్, కియా, మహీంద్రా అండ్ మహీంద్రా వంటి కంపెనీలు ధరలు పెంచాయి. ఈ కంపెనీల్లో కొన్ని ఈ నెల ప్రారంభం నుండే ధరల పెంచాయి. ఇప్పుడు మారుతీ సుజుకీ కూడా అదే దారిలో నడిచింది. ఇన్పుట్ ఖర్చులు పెరగడం, కరోనా వల్ల బిజినెస్ పైన ప్రభావం పడటం వంటి వివిధ కారణాలతో ధరలు పెంచుతున్నాయి. కీలకమైన సమయంలో ఆటో కంపెనీలు ధరలు పెంచుతున్నాయి.

మారుతీ మోడల్స్ ధరల పెంపు
మారుతీ Alto 800 రూ.14,000 వరకు, మారుతీ S-Presso రూ.7,000 వరకు, మారుతీ Celerio రూ.19,400 వరకు, మారుతీ Wagon-R రూ.23,200 వరకు, మారుతీ Tour S రూ.5,061 వరకు, మారుతీ Eeco రూ.24,200 వరకు, మారుతీ Swift రూ.30,000 వరకు, మారుతీ Dzire రూ.12,500 వరకు, మారుతీ Vitara Brezza రూ.10,000 వరకు, మారుతీ Ertiga రూ.34,000 వరకు, మారుతీ Super Carry రూ.10,000 వరకు పెరుగుతున్నాయి.

ఎర్టిగా రూ.34,000 జంప్
ప్రధానంగా మారుతీ ఎర్టిగా పైన రూ.34,000 వరకు పెరుగుతోంది. స్విఫ్ట్ పైన రూ.30,000 పెరుగుతోంది. గత సంవత్సరం వివిధ ఇన్పుట్ ఖర్చులు పెరగడం వల్ల కంపెనీ వాహనాల ధరలపై ప్రతికూల ప్రభావం పడిందని, అందుకే జనవరి 2021 నుండి ధరలు పెంచుతున్నట్లు మారుతీ సుజుకీ తెలిపింది.