9 కంపెనీల మార్కెట్ క్యాప్ రూ.2.2 లక్షల కోట్లు డౌన్, రిలయన్స్ మాత్రమే అదరగొట్టింది
ముంబై: టాప్ 10 కంపెనీల్లోని 9 కంపెనీల మార్కెట్ క్యాపిటలైజేషన్ గతవారం భారీగా కుంచించుకుపోయింది. వరుసగా రెండో వారం ఈ కంపెనల మార్కెట్ క్యాప్ క్షీణించింది. బడ్జెట్ అనంతరం భారీగా లాభపడిన మార్కెట్లు, అంతకుముందువారం నష్టపోయాయి. గతవారం ప్రారంభంలో కాస్త లాభాలు నమోదు చేసినప్పటికీ, చివరికి భారీ నష్టాల్లో ముగిశాయి. దీంతో టాప్ 10లోని తొమ్మిది కంపెనీల మార్కెట్ క్యాప్ రూ.2,19,920.71 లక్షల కోట్లు తగ్గింది. ముఖేష్ అంబానీ నేతృత్వంలోని రిలయన్స్ ఇండస్ట్రీస్ మాత్రమే గతవారం లాభపడిన టాప్ టెన్ కంపెనీల్లో ఉంది.
గుడ్న్యూస్, 30,000 మందికి క్యాప్జెమిని ఉద్యోగాలు! ఫ్రెషర్స్, ఎక్స్పీరియన్స్కు అవకాశం

మార్కెట్ క్యాప్ ఎంతంటే?
గతవారం సెన్సెక్స్ ఏకంగా 3 శాతం నష్టపోయింది. నిఫ్టీ కూడా దాదాపు అంతే కోల్పోయింది.
ఐటీ దిగ్గజం టీసీఎస్ మార్కెట్ క్యాపిటలైజేషన్ రూ.81,506.34 కోట్లు క్షీణించి రూ.10,71,263.77 కోట్లకు తగ్గింది.
HDFC బ్యాంకు మార్కెట్ క్యాప్ రూ.2,202.12 కోట్లు పడిపోయి రూ.8,45,552.53 కోట్లకు క్షీణించింది.
ICICI బ్యాంకు మార్కెట్ క్యాప్ రూ.18,098.57 కోట్లు పడిపోయి రూ.4,13,078.87 కోట్లకు తగ్గింది.
హిందూస్తాన్ యూనీలీవర్ మార్కెట్ క్యాప్ రూ.11,536.32 కోట్లు క్షీణించి రూ.5,00,937.14 కోట్లుగా నమోదయింది.
HDFC మార్కెట్ క్యాప్ రూ.35,389.88 కోట్లు తగ్గి రూ.4,57,518.73 కోట్లకు చేరింది.

రిలయన్స్ జంప్
ఇన్ఫోసిస్ ఎం-క్యాప్ రూ.16,613.57 కోట్లు క్షీణించి రూ.5,33,487.07 కోట్లకు చేరుకుంది.
బజాజ్ ఫైనాన్స్ మార్కెట్ క్యాపిటలైజేషన్ రూ.15,712.46 కోట్లు తగ్గి రూ.3,15,653.33 కోట్లుగా నమోదయింది.
కొటక్ మహీంద్రా బ్యాంకు మార్కెట్ క్యాప్ రూ.30,695.43 కోట్లు తగ్గి రూ.3,53,081.63 కోట్లకు చేరుకుంది.
ఎస్బీఐ మార్కెట్ క్యాప్ రూ.8,166.02 కోట్లు క్షీణించి రూ.3,48,238.34 కోట్లుగా నమోదయింది.
- కేవలం రిలయన్స్ ఇండస్ట్రీస్ మార్కెట్ క్యాప్ మాత్రం భారీగా ఎగిసింది. రిలయన్స్ మార్కెట్ క్యాప్ రూ.2,092.01 ఎగిసి రూ.13,21,044.35 కోట్లకు చేరుకుంది.

టాప్ 10 కంపెనీలు
గతవారం సెన్సెక్స్ 1,786 పాయింట్లు లేదా 3.46 శాతం పతనమైంది. అంతర్జాతీయంగా మార్కెట్లు కుప్పకూలడంతో ఈ ప్రభావం మన మార్కెట్లపై పడింది.
గత 10 నెలల కాలంలో శుక్రవారం (ఫిబ్రవరి 26) సూచీలు మొదటిసారి దారుణంగా పతనమయ్యాయి. ఎన్ఎస్ఈ నిఫ్టీ 568 పాయింట్లు పడిపోయింది
టాప్ 10 కంపెనీలు వరుసగా రిలయన్స్, టీసీఎస్, హెచ్డీఎఫ్సీ బ్యాంకు, ఇన్ఫోసిస్, హిందూస్తాన్ యూనీలీవర్ లిమిటెడ్, హెచ్డీఎఫ్సీ, ఐసీఐసీఐ బ్యాంకు, కొటక్ మహీంద్రా బ్యాంకు, ఎస్బీఐ, బజాజ్ ఫైనాన్స్ ఉన్నాయి.