స్వల్పలాభాల్లో ముగిసిన మార్కెట్లు: మెటల్ అదుర్స్, రియాల్టీ, బ్యాంకింగ్ డౌన్
దేశీయ స్టాక్ మార్కెట్లు గురువాలం స్వల్ప లాభాల్లో ఉన్నాయి. ఉదయం లాభాల్లో ప్రారంభమైన మార్కెట్లు లాభనష్టాల ఊగిసలాడాయి. చివరకు స్వల్ప లాభాల్లో ముగిశాయి. సెన్సెక్స్ 61,259.99 పాయింట్ల వద్ద ప్రారంభమై, 61,348.57 పాయింట్ల వద్ద గరిష్టాన్ని, 60,949.81 పాయింట్ల వద్ద కనిష్టాన్ని తాకింది. నిఫ్టీ 18,257.00 పాయింట్ల వద్ద ప్రారంభమై, 18,272.25 పాయింట్ల వద్ద గరిష్టాన్ని, 18,163.80 పాయింట్ల వద్ద కనిష్టాన్ని తాకింది. సెన్సెక్స్ చివరకు 85 పాయింట్లు లాభపడి 61,235 పాయింట్ల వద్ద, నిఫ్టీ 45 పాయింట్లు ఎగిసి 18,257.80 పాయింట్ల వద్ద ముగిసింది.
సెన్సెక్స్‌లో మెటల్ రంగ సూచీ అత్యధిక లాభాల్లో ఉండగా, రియాల్టీ రంగం అత్యధిక నష్టాల్లో కనిపించింది. అమెరికాలోకి నాస్డాక్, డౌజోన్స్, ఎస్ అండ్ పీ500 సూచీలు స్వల్ప లాభాల్లో ముగిశాయి. అమెరికాలో ద్రవ్యోల్భణం ఎన్నడూ చూడని విధంగా 40 ఏళ్ల కనిష్టానికి (7 శాతం) పడిపోవడం ప్రభావం చూపింది. దీనికి తోడు ఫెడ్ వడ్డీ రేట్లు వేగంగా పెంచవలసిన అవసరం లేని పరిస్థితి ఏర్పడింది. ఈ ప్రభావం మార్కెట్ పైన కనిపించింది. మెటల్ స్టాక్స్ లాభపడగా, రియాల్టీ, బ్యాంకు స్టాక్స్ నష్టపోయాయి.

నేటి టాప్ గెయినర్స్ జాబితాలో టాటా స్టీల్, JSWS స్టీల్, సన్ ఫార్మా, కోల్ ఇండియా, యూపీఎల్ ఉండగా, టాప్ లూజర్స్ జాబితాలో విప్రో, ఏషియన్ పేయింట్స్, HDFC బ్యాంకు, కొటక్ మహీంద్రా బ్యాంకు, ఇండస్ఇండ్ బ్యాంకు ఉన్నాయి.