పదింట 9 కంపెనీల మార్కెట్ క్యాప్ రూ.1.11 లక్షల కోట్లు జంప్
టాప్ టెన్లోని తొమ్మిది కంపెనీల మార్కెట్ క్యాపిటలైజేషన్ గతవారం రూ.1.11 లక్ష కోట్లు పెరిగింది. అంతకుముందు వారం టాప్ టెన్లోని ఐదు కంపెనీల మార్కెట్ క్యాపిటలైజేషన్ గతవారం రూ.1 లక్ష కోట్లు పెరిగింది. దానికంటే ముందు వారం ఎనిమిది కంపెనీల మార్కెట్ క్యాప్ రూ.2,61,812.14 కోట్లు తగ్గింది. ఒమిక్రాన్ ప్రభావం అంతంతే అనే అభిప్రాయాలు ఇన్వెస్టర్ల సెంటిమెంటు బలపరిచాయి. క్రితం వారం బీఎస్ఈ బెంచ్ మార్క్ 1200 పాయింట్ల వరకు ఎగిసింది. అంతకుముందు వారం బీఎస్ఈ బెంచ్ మార్క్ స్వల్పంగా మాత్రమే ఎగిసింది. వరుసగా రెండో వారం పెరిగింది. గతవారం రిలయన్స్ ఇండస్ట్రీస్ మార్కెట్ క్యాప్ తగ్గింది.

వీటి మార్కెట్ క్యాప్ జంప్
- టీసీఎస్ మార్కెట్ క్యాపిటలైజేషన్ రూ.24,635.68 కోట్లు ఎగిసి రూ.13,82,280.01 కోట్లకు పెరిగింది.
- HDFC బ్యాంకు మార్కెట్ క్యాపిటలైజేషన్ రూ.22,554.33 కోట్లు పెరిగి రూ.8,20,164.27 కోట్లుగా నమోదయింది.
- హిందూస్తాన్ యూనీ లీవర్ లిమిటెడ్ మార్కెట్ క్యాప్ రూ.14,391.25 కోట్లు ఎగిసి రూ.5,54,444.80 కోట్లకు పెరిగింది.
- ఇన్ఫోసిస్ మార్కెట్ క్యాపిటలైజేషన్ రూ.10,934.61 కోట్లు ఎగిసి రూ.7,94,714.60 కోట్లకు పెరిగింది.
- HDFC మార్కెట్ క్యాపిటలైజేషన్ రూ.9,641.77 కోట్లు పెరిగి రూ.4,68,480.66 కోట్లకు ఎగిసింది.

రిలయన్స్ డౌన్
- విప్రో మార్కెట్ క్యాప్ రూ.9,164.13 కోట్లు ఎగిసి రూ.3,92,021.38 కోట్లకు పెరిగింది.
- ఐసీఐసీఐ బ్యాంకు మార్కెట్ క్యాపిటలైజేషన్ రూ.8,902.89 కోట్లు పెరిగి రూ.5,13,973.22 కోట్లకు చేరుకుంది.
- బజాజ్ ఫైనాన్స్ మార్కెట్ క్యాపిటలైజేషన్ రూ.7,575.11 కోట్లు ఎగిసి రూ.4,21,121.74 కోట్లకు చేరుకుంది.
- SBI మార్కెట్ క్యాపిటలైజేషన్ రూ.3,212.86 కోట్లు పెరిగి రూ.4,10,933.74 కోట్లకు ఎగిసింది.
- అయితే రిలయన్స్ ఇండస్ట్రీస్ మార్కెట్ క్యాప్ మాత్రం తగ్గింది.
రిలయన్స్ ఇండస్ట్రీస్ మార్కెట్ క్యాపిటలైజేషన్ రూ.2,772.49 కోట్లు క్షీణించి రూ.16,01,382.07 కోట్లకు పడిపోయింది.

టాప్ టెన్ కంపెనీలు
టాప్ టెన్ కంపెనీల విషయానికి వస్తే రిలయన్స్ ఇండస్ట్రీస్, టీసీఎస్, HDFC బ్యాంకు, ఇన్ఫోసిస్, హిందూస్తాన్ యూనీలీవర్, ICICI బ్యాంకు, HDFC, బజాజ్ ఫైనాన్స్, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, విప్రో ఉన్నాయి.